- Home
- Entertainment
- Karthika Deepam: డాక్టర్ బాబుకు టెన్షన్.. దీపపై మరో కుట్ర చేస్తున్న రుద్రాణి.. ఈసారి ఏకంగా?
Karthika Deepam: డాక్టర్ బాబుకు టెన్షన్.. దీపపై మరో కుట్ర చేస్తున్న రుద్రాణి.. ఈసారి ఏకంగా?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.

రుద్రాణి (Rudrani) కార్తీక్ దగ్గరకు వచ్చి పెళ్ళాం బయట పిండివంటలు అమ్ముతుంటే.. మొగుడు ఇంట్లో బాబుకు పాలు పట్టిస్తున్నాడా అంటూ రుద్రాణి కార్తీక్ ను అవమానం పాలు చేస్తుంది. దీంతో కార్తీక్ (Karthik) కు కోపం వచ్చి మర్యాదగా మాట్లాడు అంటూ లెగుస్తాడు.
ఇక రుద్రాణి (Rudrani) శ్రీవల్లి బాబును తనతో పాటు తీసుకెళ్తా అని చెప్పగా.. కార్తీక్ అడ్డుకుంటాడు. ఇక రుద్రాణి కార్తీక్ (Karthik) ను డబుల్ మీనింగ్ మాటలతో జ్ఞానోదయం చేసి బయట పిండివంటలు అమ్ముతున్న దీప, స్కూలుకు వెళుతున్న పిల్లలు జాగ్రత్త అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి తిరిగి వెళ్తుంది.
ఒకవైపు మోనిత (Monitha) గోడకు తమ ఫోటో పెట్టుకుని మురిసిపోతూ.. ఉయ్యాలలో బొమ్మను పడుకోబెట్టి బాబు ఉన్నట్లు ఫీల్ అవుతుంది. నరసమ్మ అక్కడికి రావడంతో తమ జంట గురించి నర్సమ్మ (Narsamma) కు వివరిస్తూ తెగ మురిసిపోతుంది.
కార్తీక్ ఫోన్ తీసుకున్న వ్యక్తి కార్తీక్ (Karthik) వాళ్ళ కోసం వెతుకుతూ చివరికి తాడికొండ గ్రామానికి చేరుతాడు. అక్కడ రుద్రాణి (Rudrani) మనిషి దగ్గరికి వెళ్లి కార్తీక్ ఫోటో ను చూపించే ప్రయత్నం చేయగా వాళ్లు చూడలేకపోతారు.
మరోవైపు కార్తీక్ రుద్రాణి (Karthik) అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. తన పిల్లల గురించి అన్న మాటల గురించి గుర్తు తెచ్చుకొని రుద్రాణి (Rudrani) అన్నంత పని చేస్తుందేమో అని భయపడి కార్తీక్ పిల్లలను చూడాలనిపించి స్కూల్ కి వెళతాడు.
ఈ లోపు పిల్లలు ఆకలితో ఉండగా అక్కడకు రుద్రాణి (Rudrani) భోజనం పట్టుకుని రానే వస్తుంది. ఆ భోజనం పిల్లలకు తినిపించాలని చూస్తుంది. కానీ పిల్లలు అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నిస్తారు. రుద్రాణి వాళ్ళను బెదిరిస్తుంది. ఈలోపు కార్తీక్ (Karthik) అక్కడకు వస్తాడు.
కార్తీక్ (Karthik) తన మాటలతో రుద్రాణి మందలిస్తాడు. కానీ కార్తీక్ మాటలు రుద్రాణి ఏమాత్రం పట్టించుకోకుండా.. ఇక తనపై దీప ఇదివరకు చేయి చేసుకున్న దాని గురించి వివరించి.. దీప (Deepa) ను చంపేస్తా అన్నట్టు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత కార్తీక్ (Karthik) రుద్రాణి అన్న మాటలు గురించి తలుచుకుంటూ.. నిజంగానే దీపకి ఏదైనా హాని కలిగిస్తుందా అని మనసులో అనుకుంటూ ఇంటికి వెళుతూ ఉంటాడు. ఈలోపు సౌందర్య (Soundarya) కార్తీక్ ఆచూకి వెతకమని పెట్టిన వ్యక్తి కార్తీక్ ఎదురు దార్లో వస్తూ ఉంటాడు. కానీ అతడు చూడలేకపోతాడు. మరి దీపని రుద్రాణిని ఏం చేసిందో అనేది ఆసక్తిగా మారింది.