- Home
- Entertainment
- Karthika Deepam: సౌర్య కోసం మళ్లీ 'డాక్టర్'గా మారనున్న డాక్టర్ బాబు.. మోనిత సరికొత్త ప్లాన్!
Karthika Deepam: సౌర్య కోసం మళ్లీ 'డాక్టర్'గా మారనున్న డాక్టర్ బాబు.. మోనిత సరికొత్త ప్లాన్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

రుద్రాణి (Rudrani) దగ్గరికి వెళ్లిన కార్తీక్ రుద్రాణి పై గట్టిగా అరుస్తాడు. ఇక రుద్రాణి కార్తీక్ వెళుతుంటే ఆపి మరి సౌర్య ఆపరేషన్ కు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానికి కార్తీక్ అస్సలు ఒప్పుకోడు. తాను ఎంత ప్రయత్నించినా కార్తీక్ (Karthik) మాత్రం డబ్బులు తీసుకోకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
మరోవైపు దీప (Deepa) సౌర్యను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. డబ్బులు తీసుకొని కార్తీక్ ని చూసి రుద్రాణి ఇంత గొప్ప మనసు ఉంటే ఎలా అని అంటుంది. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ అప్పారావుని చూసి ఇక్కడ ఉన్నావ్ ఏంటి అప్పు (Appu) అని అడుగుతాడు. జరిగిన విషయం అంత తెలిసిందని అప్పు అంటాడు.
కార్తీక్ (Karthik) ఆదిత్య వాళ్లకి ఫోన్ చెయ్యాలని అనుకుంటాడు. కానీ ఆదిత్య ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధ పడతాడు. ఇంట్లోకి వెళ్లగానే దీప డబ్బులు తీసుకొచ్చావా అంటూ ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ ఒక టాబ్లెట్ తీసుకుని రావడంతో దీప (Deepa) టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అంబులెన్సు వస్తుంది.
ఇక హాస్పిటల్ కి వెళ్లగా అక్కడ కార్తీక్ (Karthik) డాక్టర్ కోసం ఎదురు చూస్తుంటాడు. అంతలోనే రుద్రాణి (Rudrani) మళ్ళీ అక్కడికి వచ్చి మళ్లీ తన మాటలతో కార్తీక్ వాళ్ళను బాగా రెచ్చగొడుతుంది. ఇక కార్తీక్, దీప ఏమీ అనలేకపోతారు. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేకుండా జరగదు పని జరుగదని అంటుంది.
డబ్బుకి బదులుగా హిమను (Hima) ఇవ్వమని అనటంతో వెంటనే దీప ఆవేశం తో రగిలిపోతుంది. ఇక కార్తీక్ డాక్టర్ తో సౌర్య (Sourya) పరిస్థితి గురించి మాట్లాడటంతో అతడు కాస్త వెటకారం గా మాట్లాడుతాడు. అదే సమయంలో హిమ లేదని తెలియడంతో చాలా బాధ పడతాడు.
సౌర్య (Sourya) ను కాపాడటం కోసం హిమ రుద్రాణి దగ్గరికి వెళ్లి తన దగ్గరే ఉంటాను అని అంటుంది. ఇక దానికి రుద్రాణి తెగ సంతోష పడుతుంది. తరువాయి భాగం లో డాక్టర్స్ ఆపరేషన్ కోసం నిరాకరిస్తారు. ఇక దీప (Deepa) కార్తీక్ కు చేతులెత్తి నా కూతురికి ఆపరేషన్ చేయండి అని బతిమాలుతుంది. చూస్తుంటే కార్తీక్ మళ్లీ డాక్టర్ అయ్యేలా కనిపిస్తున్నాడు.