Karthika Deepam: వంటలక్క ప్రయోగం.. మూర్ఛ వచ్చి పడిపోయిన డాక్టర్ బాబు!
Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప నాటకంలో కార్తీక్ తో, ఇన్నాళ్లు నేను మీకు నా మనసులో గుడి కట్టుకున్నాను.మిమ్మల్ని దేవుడిలా పూజించాను కానీ ఎప్పుడైతే నా బిడ్డకి తండ్రి మీరు కాదు అని అన్నారో అప్పుడే నా గుడిలో దేవుడు మాయమైపోయాడు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ దృశ్యం చూస్తున్నప్పుడు కార్తీక్ కి తలనొప్పిగా ఉంటుంది. నాటకంలో కొన్ని సంవత్సరాల తర్వాత, కార్తీక్ మళ్ళీ దీప దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు మనకి పుట్టింది ఒక బిడ్డ కాదు, కవలలు అంట అని చెప్పినా కార్తీక్ మనసు మారదు.
నీ కూతురికి నీకు ఏమైనా సహాయం కావాలంటే చెప్పు చేస్తాను కానీ అంతకుమించి నువ్వు నా దగ్గర నుంచి ఎక్కువ ఆశించదు అని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప, కార్తీక్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసిన కార్తిక్ కి గతం గుర్తొస్తూ తలనొప్పిగా ఉంటుంది. నాటకంలో కార్తీక్ దీపుతో, హిమ ఎవరు నిజం చెప్పు అని దీప ని అడగగా హిమ కూడా మన కూతురని అంటుంది దీప. అప్పుడు ఇన్నాళ్లు నీ కూతురిని నా దగ్గరికి పంపించి మమకారం పెంచుకునేలా చేసావు. ఈరోజు నుంచి తనకి నాకు రుణాలు తీరిపోయాయని హిమతో అంటాడు.
అప్పుడు హిమ దీపతో,నువ్వేనా నా అమ్మవి అని వెళ్లి హద్దుకుంటుంది. ఇది చూస్తున్న కార్తిక్ వంటలక్క తో శౌర్య ఎవరు? తర్వాత ఏమవుతుంది అని ఆసక్తిగా ఉంటాడు. అప్పుడు తర్వాత సీన్లో నాటకంలో శౌర్య స్కూల్లో ఉన్నప్పుడు కార్తీక్ సౌర్యకు చదువుకు అయ్యే ఖర్చులన్నీ తనే పెడతాను అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న సౌందర్య సౌర్యని చూసి ఇది మన మనవరాలే, అచ్చు నాలాగే ఉన్నది నా మొదటి అక్షరం, నా చివరి అక్షరం కలిపి సౌర్య అని పెట్టింది. మన మనవరాల్లు ఇద్దరు డాన్స్ బాగా చేశారు కదా అని అంటుంది.
అప్పుడు మీ అమ్మని పిలువని స్టేజ్ మీద కార్తీక్ అనగా దీప అక్కడికి రాదు.అప్పుడు నాటకం చూస్తున్న కార్తీక్ వెళ్లు దీప అని అంటాడు. కానీ దీపా అక్కడికి వెళ్ళలేదు. ఆరోజు రాత్రి సౌర్య కార్తీక్ తో నాన్న, నువ్వే కదా నాన్నవి నాకు తెలుసు అని ఏడుస్తుంది. నాటకంలో ఆ తర్వాత సీన్లో కార్తీక్, దీప కాళ్ళ మీద పడి నేను తప్పు చేశాను నిన్న అనుమానించాను అని అంటాడు. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి కార్తీక్ నేను నెల తప్పాను. నీ బిడ్డకి తల్లినవ్వుతున్నాను అని అనగా ఏం మాట్లాడుతున్నావ్ మోనిత నేను నీ బిడ్డకు తండ్రిని కాదు అని అరుస్తాడు.
ఇంతలో నాటకాన్ని చూస్తున్న కార్తీక్, మోనిత ఎక్కడ అని అనగా వస్తుంది లెండి సార్ మీరు కూర్చోండి అని దీప వాళ్ళ అన్నయ్య కూర్చోబెడతాడు. ఆ తర్వాత సీన్లో మోనిత,కార్తీక్ లు తన బిడ్డతో పూజ చేస్తుంటారు. తర్వాత కార్తీక్,దీప వెళ్లి మేము పెళ్లయిన మొదట్లో ఇక్కడికే వచ్చాము అని అంటారు. వాళ్లు ఆరోజు అక్కడ పాడిన పాటలను కూడా ఇక్కడ దీప పాడుతుంది. అప్పటికే కార్తీక్ కి చాలా అస్పష్టమైన గతం గుర్తొస్తూ ఉంటుంది. ఇంతలో హిమ కార్తీక్ దగ్గరికి వెళ్లి నాకు కార్ డ్రైవింగ్ నేర్పించు డాడీ అని అడుగుతుంది.
అప్పుడు దీప స్టేజ్ మీద నుంచి కిందకి వస్తున్నప్పుడు కార్తీక్ దీపతో,వద్దు దీప వద్దు అని అరుస్తూ,తలనొప్పి తో, కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత సీన్లో మోనిత ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి మొన్న అంకుల్, ఆంటీ వస్తారేమో అని భయపడ్డాను ఇప్పుడు శౌర్య కూడా ఇక్కడే ఉన్నది.ఏదో చిన్న అవసరం అని ఇంటికి వచ్చి కార్తీక్ ని చూసే అవకాశం ఉంది,వెంటనే కార్తీక్ ని ఇక్కడి నుంచి తీసుకు వెళ్లిపోవాలి అని అనుకునీ కార్తీక్ అని పిలిచినా కార్తీక్ రాకపోయేసరికి కార్తీక్ ఎక్కడ అని శివని అడుగుతుంది.
వంటలక్క తో వెళ్ళారు మేడం అని శివ అనగా మోనిత,శివని కొడుతుంది. మరి నువ్వు ఎందుకు ఉన్నావు వేలకువేలు జీతం ఇచ్చి నిన్ను పెట్టుకోవడం ఎందుకు? ఇది ఇప్పుడు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్లిందో అని అనగా పక్క దేశానికో ఎక్కడికో వెళ్లినట్టు భయపడతారు ఎందుకు మేడం,వెళ్ళింది పక్కనున్న కమ్యూనిటీ హాల్ కే కదా వంటలక్క ఏదో నాటకం చేస్తుంది అంట డాక్టర్ బాబు చూడడానికి వెళ్లారు అని అంటూ అంటాడు శివ.నాటకం చేస్తున్నారా అని చెప్పి కంగారుగా మోనిత అక్కడికి వెళుతుంది.
అప్పుడు శివ,ప్రతి భార్య తన మొగుడిని ఇలాగే కాపలాకు పెడుతుందా! ఖచ్చితంగా ఈవిడ సార్ భార్య కాదు అని అనుకుంటాడు. అప్పుడు మోనిత కమ్యూనిటీ హాల్ కి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!