- Home
- Entertainment
- Karthika Deepam: కార్తీక్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మోనిత.. బస్తీ గురించి తెలుసుకొని షాకైనా వంటలక్క!
Karthika Deepam: కార్తీక్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మోనిత.. బస్తీ గురించి తెలుసుకొని షాకైనా వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సౌందర్య, దీపను పెళ్లి మండపం దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక కార్తీక్ పెళ్లిరోజు శుభాకాంక్షలు వంటలక్క అని దీప (Deepa) తో కార్తీక్ అంటాడు. క్రమంలో ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు.

మరోవైపు సౌందర్య (Soundarya) , కార్తీక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ల ఆచూకీ తెలుసుకోమని పెట్టిన వ్యక్తి మోనిత ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో కార్తీక్, మోనిత ల పెళ్లి ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు. ఇక మోనిత (Monitha) కార్తీక్ నీకు తెలుసా అని అడుగగా.. ఈ సార్ ఫోన్ పడేసుకోవడం కోవడం నేను చూశాను మేడం అని చెబుతాడు.
అంతే కాకుండా కార్తీక్ (Karthik) , వాళ్ళ తల్లి దండ్రుల దగ్గరకి వెళ్ళిపోయిన సంగతి చెబుతాడు. ఆ విషయం తెలిసిన మోనిత ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే అత్తగారి ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతుంది. మరో వైపు సౌందర్య పంతులుగారి సమక్షంలో కార్తీక్ (Karthik), దీపల పెళ్లి రోజు వేడుకలు జరుపుతుంది.
ఈ క్రమంలో సౌందర్యం (Soundarya) .. ఆమె కోడలు కోసం చేయించిన మంగళ సూత్రాన్ని పంతులు గారికి ఇచ్చి కార్తీక్ చేతులతో మూడు ముళ్ళు వేపిస్తుంది. ఈ క్రమంలో అక్కడకు మోనిత వచ్చి వాళ్ళను చూసి క్లాప్స్ కొడుతుంది. కానీ సుందర్య మోనితను ఏమాత్రం పట్టించుకోకుండా చల్లగా ఉండండీ అంటూ కార్తీక్, దీప (Deepa) ల ను దీవిస్తుంది.
ఆ తర్వాత రవి (Ravi), కార్తిక్ కి పెళ్లిరోజుశుభాకాంక్షలు సందర్భంగా కార్తీక్ మళ్లీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేయవచ్చు అన్న ఆర్డర్ ను గిఫ్ట్ గా ప్రజంట్ చేస్తాడు. దీనికి ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా రవి.. దీనికంతా కారణం మోనిత అని చెబుతాడు. ఇక కార్తీక్ (Karthik) కొంత విచారాన్ని వ్యక్తం చేస్తాడు.
ఇక ఆ తరువాత మోనిత .. కార్తీక్ డాక్టర్ గా మళ్ళీ చేయడానికి లైసెన్స్ నేనే తెప్పించాను అంటూ గొప్పలు చెప్పుకుంటుంది. ఇక ఆ తరువాత దీప, నేను బస్తీకి వెళ్ళొస్తాను అని సౌందర్య తో చెప్పగా.. ఫ్యామిలీ అంతా స్టన్ అవుతారు. ఇక బస్తీలో జరిగిన విషయం అంతా చెబుతారు దాంతో దీప ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి ఏం జరుగుతుందో చూడాలి.