- Home
- Entertainment
- Karthika Deepam: కార్తీక్, దీపలకు మరోసారి పెళ్లి చేస్తున్న సౌందర్య.. షాకింగ్ ఎంట్రీ ఇచ్చిన మోనిత!
Karthika Deepam: కార్తీక్, దీపలకు మరోసారి పెళ్లి చేస్తున్న సౌందర్య.. షాకింగ్ ఎంట్రీ ఇచ్చిన మోనిత!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ రోజురోజుకీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఫ్యామిలీ అంతా హైదరాబాదు బయలుదేరుతుండగా ఈ లోపు రుద్రాణి (Rudrani) వచ్చి కార్తీక్ తో సహా అందరినీ గౌరవిస్తూ క్షమాపణలు అడుగుతుంది.

ఈ క్రమంలో చెక్ ను తిరిగిస్తూ ఉండగా సౌందర్య (Soundarya) నీ దగ్గరే ఉంచుకో అని నవ్వుతూ చెబుతుంది. ఆ తర్వాత రుద్రాణి హిమ కు ప్రేమగా ఒక ముద్దు ఇచ్చి వెళుతుంది. ఇక ఫ్యామిలీ అంతా హైదరాబాదులో సొంత ఇంటికి చేరుతారు. వాళ్ల రాకను అజయ్, శ్రావ్యలు చూసి ఎంతో ఆనందిస్తారు. ఇక శ్రావ్య, కార్తీక్ (Karthik) , దీపలకు దిష్టి తీసి లోపలకు ఆహ్వానిస్తుంది.
మరోవైపు అప్పారావు కార్తీక్ (Karthik) , దీపలు ఎంత గొప్ప వాళ్ళో తెలుసుకున్న తర్వాత వాళ్ల గొప్పతనం గురించి వాళ్ళ ఓనర్ కి తెలుపుతూ ఉంటాడు. ఇక ఓనర్ కూడా వాళ్ల గొప్పతనం గ్రహించుకుంటాడు. ఒకవైపు కార్తీక్ ఫ్యామిలీ ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో శౌర్య (Sourya), దీపతో మనం ఎప్పుడూ ఈ ఇంటిని వదిలి వెళ్లొద్దమ్మ అని చెబుతుంది.
ఇక మోనిత, కార్తీక్ (Karthik) గురించి ఆలోచించు కుంటూ ఉండగా ఈలోపు మోనిత కు అంకుల్ కాల్ చేస్తాడు. ' నేను ముంబైలో ఉన్నాను హార్ట్ సర్జరీ చేయాలి అంటున్నారు అని చెబుతాడు. దానికి మోనిత (Monitha) షాక్ అయ్యి బాబాయ్ జాగ్రత్త..నేను నిన్ను కలుస్తాను అని చెబుతుంది.
ఇక సౌందర్య (Soundarya) వాళ్ళ ఇంట్లో అప్పటివరకు ఏడుస్తున్న ఆనంద్ కార్తీక్ దగ్గరికి వెళ్ళగానే నవ్వుతాడు. దాంతో సౌందర్యంతో ఆశ్చర్యపోతుంది. మరోవైపు మోనిత బస్తి లో ఉండే లక్ష్మణ్ కి డబ్బులు ఇచ్చి తాడికొండలో కార్తీక్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని ఎలాగైనా కని పెట్టాలి అని చెబుతోంది. ఇక సౌందర్య ఇంట్లో పిల్లలు ఆనంద్ (Anand) ను నవ్వుతూ ఆడిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో సౌర్య (Sourya) ' నానమ్మ తమ్ముడు అచ్చం నాన్న లాగే ఉన్నాడు కదా' అనగా ఫ్యామిలీ అంతా కొంత ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కార్తీక్, దీపల కు మరోసారి ఆనందంగా ఆ ఇంట్లో పెళ్లి చేస్తూ ఉంటారు. ఈలోగా అక్కడకు మోనిత (Monitha) క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.