MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న చారుశీల.. దీపను చూసి కుమిలిపోతున్న డాక్టర్ బాబు?

Karthika Deepam: కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న చారుశీల.. దీపను చూసి కుమిలిపోతున్న డాక్టర్ బాబు?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 31 2022, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో దీప అయితే ఒక పని చేయండి ప్రమాదంలో మీరు మాత్రమే బతికున్నారని నేను చనిపోయానని చెప్పి మీరు అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లిపోండి అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ దీప నా ప్రాణాలు కదా పోయేవి అనే కార్తీక్ అనడంతో ఇక చాలు డాక్టర్ బాబు నాకు మొత్తం తెలుసు పోయేది మీ ప్రాణాలు కాదు నా ప్రాణాలు అని నాకు తెలుసు అనడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు. మీరు చారుశీల కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నేను మొత్తం అన్ని విన్నాను అని అంటుంది. నేను చనిపోయానని తెలిసి మీరు బతికున్నారని తెలిసినా వాళ్ళు సంతోషపడతారు వెళ్ళండి అనడంతో కార్తీక్ అందుకు ఒప్పుకోడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు సౌందర్య హేమచంద్రతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ బాబు అత్తయ్య వెళ్ళిపోతుంది వెళ్ళిపోండి అనడంతో మాట్లాడొద్దు అని అంటాడు కార్తీక్. ఇంతలోనే అక్కడికి హేమచంద్ర వస్తాడు. మీ అమ్మ అంత బాధ పడుతున్న మీ మనసు కరగడం లేదా అని అనడంతో లేదు హేమచంద్ర అమ్మని చూడగానే గట్టిగా వచ్చి హద్దుకొని ఏడవాలని ఉంది కానీ పరిస్థితుల వల్ల నేను ధైర్యం చేయలేకపోతున్నాను అని అంటాడు కార్తీక్. మరొకవైపు హిమ రోడ్డుపై కార్తీక్ దీపల ఫోటోలు చూపిస్తూ కార్తీక్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత వెతికి వెతికి ఒకచోట కూర్చుని ఎంత వెతికిన అమ్మానాన్నలు కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది హిమ.
 

37

తర్వాత పండరి అటుగా నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలో ఒక అతను వచ్చి కింద పడేయడంతో కూరగాయలను ఏరుకుంటూ ఉంటుంది పండరి. అప్పుడు హిమ వచ్చి పండరీకి సహాయం చేస్తూ ఉంటుంది. ఆ తరువాత హిమ పండరిని అడుగుదాము అనుకుంటే ఆమె అంతలోనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ దీప కోసం టాబ్లెట్ తీసుకొని వచ్చి టాబ్లెట్స్ వేసుకోవడంతో నాకు ఈ మందులు ఎందుకు డాక్టర్ బాబు ఆగిపోతున్న నా గుండెను కొట్టుకునేలా చేయగలవా అని అంటుంది. ఎలా కాపాడుకుంటారు డాక్టర్ బాబు ఏమాత్రం అవకాశం ఉందా మీరు నన్ను కాపాడుకునే ప్రయత్నం చేసేవారు కానీ ఇలా ఉండేవారు కాదు అనడంతో లేదు దీప ఎలా అయినా నిన్ను నేను కాపాడుకుంటాను అని అంటాడు కార్తీక్.
 

47

 ఇప్పుడు దీప ఏడుస్తూ నేను పోయిన తర్వాత మీరేం చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ నీకేం కాదని చెబుతున్న కదా అలా మాట్లాడకు అని అంటాడు. అప్పుడు వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దీప మాటలకు కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నీతో పాటు నేను వచ్చేస్తాను అనడంతో అలా మాట్లాడకు డాక్టర్ బాబు పిల్లలు అత్తయ్య వాళ్ళు ఉన్నారు వాళ్లతో సంతోషంగా ఉండు అనడంతో నువ్వు లేకుండా నాకు సంతోషం ఉండదు దీప అని అంటాడు. నీతో జీవితం పంచుకోలేకపోయినా కనీసం చావు అయిన పంచుకొనివ్వు అనగా డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది.
 

57

 అప్పుడు కార్తీక్, దీపతో ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అప్పుడు దూరం నుంచి పండరి వాళ్ళిద్దర్నీ చూసి బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు దీప కార్తీక్ తో నాకు ఏదైనా అయితే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తానని మాట ఇవ్వండి అని మాటఇవ్వండి అనడంతో కార్తీక్ దీపకు మాట ఇవ్వకుండా నచ్చ చెబుతాడు. నాకు ఏం కాదు నీకు ఏం కాదు దీప మనిద్దరం సంతోషంగా ఉంటాము నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు. అప్పుడు దీప తన పరిస్థితి తెలుసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పండరీ దీప వైపు చూస్తూ దీపమ్మ నిజంగానే నుండు నూరేళ్ల ఉండేలా చూడు దేవుడా అని కోరుకుంటూ ఉంటుంది. తర్వాత కార్తీక్ దీపకు టాబ్లెట్స్ ఇవ్వడంతో దీప టాబ్లెట్స్ మింగుతుంది. తర్వాత ఆనందరావు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. 
 

 

67

అప్పుడు ఇంద్రుడు చంద్రమ్మ తినమని చెప్పి కింద కూర్చుంటుండగా పైనే కూర్చుని తినమని చెబుతాడు ఆనందరావు. అప్పుడు హిమ దీప వాళ్ళను తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా తిను హిమ అనడంతో నాకేం నచ్చలేదు నేను తినను తాతయ్య అని అంటుంది. అప్పుడు సౌర్య సీరియస్ అవుతూ మా పిన్ని బాబాయిలు డైనింగ్ టేబుల్ పై కూర్చున్న తినడం నీకు ఇష్టం లేదు ఇదేం బుద్ధి నీకు అని సీరియస్ అవుతుంది. అప్పుడు హిమ నాతో చెప్పిన వినిపించుకోకుండా సౌర్య, హిమ మీద సీరియస్ అవుతుంది. అప్పుడు సౌర్య ఇంద్రుడు వాళ్ళను మనం సపరేట్ గా తిందాం లేండిగా అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరొకవైపు చారుశీల, మోనిత కు కార్తీక్ అంటే ఎందుకు అంత ఇష్టం పెళ్లి పదేళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంకా ఇష్టపడుతూనే ఉంది కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

77

 ఆస్తి కోసమైతే కాదు తనది నిజంగానే పిచ్చి ప్రేమే అనుకుంటూ ఉంటుంది. నేనైతే కోసం కార్తీక్ ని దగ్గర చేసుకుని ఆ కోట్ల ఆస్తి దక్కించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. దీప చనిపోయిన తర్వాత కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇదంతా జరగాలంటే మొదటి దీపం మనసు మార్చాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీప పూజ చేస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి నా ఇంటి దీపానివి నా ప్రాణానివి దీప కానీ ఆ దేవుడు దీపాన్ని ఆర్పేయాలని చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Aman: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు.. అమన్ మసూద్ కెరీర్ కష్టాలు, విశేషాలు ఇవే
Recommended image2
Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Recommended image3
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved