- Home
- Entertainment
- Kantara Turns 4: 16 కోట్లు పెడితే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఎమోషనల్ అయిన హీరో, వైరల్ పోస్ట్
Kantara Turns 4: 16 కోట్లు పెడితే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఎమోషనల్ అయిన హీరో, వైరల్ పోస్ట్
కన్నడ సినిమా వైపు దేశం మొత్తం తిరిగి చూసేలా చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కాంతార'. ఈ సినిమా రిలీజ్ అయి అప్పుడే నాలుగు ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

కాంతార సినిమాకు నాలుగేళ్లు
కోస్తా కర్ణాటక అందాలను, అక్కడి సంస్కృతిని కళ్లకు కట్టిన 'కాంతార' సినిమా విడుదలై నాలుగు ఏళ్లు పూర్తయింది. ఇండియన్ సినిమా మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా ఈ మూవీ చేసింది. నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రిషబ్ శెట్టి ఎమోషనల్ అయ్యారు.
ఎమోషనల్ అయిన డివైన్ స్టార్
సినిమాకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పాత ఫోటోలను షేర్ చేశారు. అభిమానులను ఉద్దేశించి ఆయన కొన్ని ఎమోషనల్ మాటలు పంచుకున్నారు. ఆయన ఏమన్నారో మీరే చూడండి.
కాంతార - ఒక లెజెండ్
వెండితెరపై 'కాంతార' మ్యాజిక్ చేసి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత జరిగిందంతా చరిత్రే. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి. కానీ, మీరంతా ఈ సినిమాపై చూపించిన ప్రేమకు మాత్రం సాటిలేదు అని రిషబ్ అన్నారు.
ఇది నేను జీవించిన జీవితం
ఇది కేవలం నేను తీసిన ఒక సినిమా మాత్రమే కాదు. ఇది నేను జీవించిన ప్రపంచం. నాలో నేను మోసిన కథ. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన నమ్మకం అని రిషబ్ శెట్టి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
హృదయపూర్వక ధన్యవాదాలు
నా మనసులోని కథను తెరపైకి తీసుకురావడానికి నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాత్రింబవళ్లు కష్టపడిన మీ శ్రమ, నమ్మకం, ప్రేమే కాంతారను నాకంటే గొప్పగా మార్చాయి అని ఆయన టీమ్‌కు థాంక్స్ చెప్పారు.
ప్రతి ప్రేక్షకుడికీ రుణపడి ఉంటా
నా ప్రయత్నాన్ని మెచ్చుకుని, సరిహద్దులు దాటించి, కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ప్రతి ప్రేక్షకుడికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలుగేళ్ల తర్వాత కూడా మీ ప్రేమ అంతే బలంగా అనిపిస్తోంది అని రిషబ్ ఎమోషనల్ అయ్యారు.
ఈ విజయం మీ అందరిదీ
'కాంతార' సినిమాను నమ్మి, సెలబ్రేట్ చేసుకుని, మన మట్టి కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ అద్భుత విజయం మీ అందరిదీ అంటూ రిషబ్ శెట్టి భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
రూ.16 కోట్ల బడ్జెట్.. రూ.450 కోట్ల కలెక్షన్లు
కోస్తా కర్ణాటక నేపథ్యంతో వచ్చిన కాంతార సినిమాను కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది.

