- Home
- Entertainment
- `కన్నప్ప`లో హైలైట్ ఇదే, డైరెక్టర్ లీక్.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్‌లవి గెస్ట్ రోల్స్ కావు
`కన్నప్ప`లో హైలైట్ ఇదే, డైరెక్టర్ లీక్.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్‌లవి గెస్ట్ రోల్స్ కావు
ప్రభాస్, మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు వంటి భారీ కాస్టింగ్‌తో వస్తోన్న `కన్నప్ప` సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటో లీక్ చేశారు దర్శకుడు.

జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న `కన్నప్ప` మూవీ
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం `కన్నప్ప`. మంచు విష్ణు కన్నప్పగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మంచు మోహన్ బాబు నిర్మించారు. దేవుడిని నమ్మని కన్నప్ప ఆ శివుడికి భక్తుడు ఎలా అయ్యాడు, తన కంటిని ఎందుకు దానం చేశాడు, ఆయనలో రుద్ర తెచ్చిన మార్పేంటి అనేది `కన్పప్ప` కథగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి, ప్రభాస్‌తోపాటు ఇతర కాస్టింగ్, మంచు విష్ణు పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
`కన్నప్ప` సినిమాలో హైలైట్ ఇదే
దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, `కన్నప్ప` సినిమాలోని కోర్ అండ్ హైలైట్ పాయింట్‌ని బయటపెట్టారు. సినిమా మొత్తం చివరి గంటసేపే అని వెల్లడించారు. చివరి గంట మూవీ హైలైట్‌గా నిలుస్తుందని, ఆడియెన్స్ కి గూస్ బంమ్స్ తెప్పిస్తుందన్నారు.
మరోవైపు ప్రభాస్ పాత్ర గురించి వెల్లడించారు. ఆయన ఇందులో రుద్ర పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఆయనది గెస్ట్ రోల్ కాదని, అరగంటకు పైగానే ఉంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఇందులో ఎవరివీ గెస్ట్ రోల్స్ కాదన్నారు. ప్రతి పాత్రకి ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయని, ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశ చెందరని వెల్లడించారు.'
`కన్నప్ప`లో ప్రభాస్ వస్తే పూనకాలే
ప్రభాస్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందన్నారు. ఆయన ఉన్నంత సేపు ఫ్యాన్స్ ఫీస్ట్ అని వెల్లడించారు. ``కన్నప్ప` కోసం ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే తన పని చాలా ఈజీగా మారిపోయింది.
అక్షయ్ సర్, మోహన్‌లాల్ సర్, ప్రభాస్ సర్, మోహన్ బాబు గారు, విష్ణు గారు, బ్రహ్మానందం గారు ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు, నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవార`ని తెలిపారు దర్శకుడు.
ఆ విషయం చెప్పగానే మంచు విష్ణు నుంచి ఫోన్ రాలేదు
ఈ ప్రాజెక్ట్ లోకి తాను రావడం గురించి ఆయన చెబుతూ, ‘మహాభారతం’ సీరియల్ చాలా పెద్దది. అన్ని ఎపిసోడ్స్‌కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది ఇతర దర్శకులు కూడా పనిచేశారు.
ఓ సారి విష్ణు టీం నుంచి నాకు కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకా కొంత మంది కూడా `మహాభారతం` సీరియల్‌కు డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు.
అనూప్ సింగ్ ఠాకూర్ మంచు విష్ణు నటించిన `ఆచారి అమెరికా యాత్ర` సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్, విష్ణుకి మధ్య చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు. విష్ణు నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అ
ప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు.
అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు` అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్.
`కన్నప్ప` కథ విషయంలో కొంత లిబర్టీ తీసుకున్నాం
`కన్నప్ప` కథ గురించి చెబుతూ, `‘కన్నప్ప’ మీద ఇంత వరకు కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా ఈ మూవీకి న్యాయం చేయాలని అనుకున్నాను.
విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. సినిమా కోసం, రెండో శాతాబ్దం ఫ్లేవర్ కోసం మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. ఆయనతోపాటు మేం కూడా వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం.
అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం. కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్‌గా చూపించాం.
శ్రీకాళహస్తి అర్చకులు `కన్నప్ప` ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు
`కన్నప్ప` అనేది మైథలాజి కాదు. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే, ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర.
శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు. ఇప్పటి వరకు చాలా మందికి సినిమా చూపించినట్టు, అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించార`ని తెలిపారు దర్శకుడు.
ఇక నెక్ట్స్ తనకు మహాభారతం సీరియల్‌ని సినిమాగా తీయాలనే ఆసక్తిని వెల్లడించారు. మహాభారతం అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు. రాజమౌళి తీసుకోవచ్చు. ఆమిర్ ఖాన్ గారు తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సబ్జెక్ట్ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్.

