MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కన్నప్ప` ఐదు రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు సేఫ్‌ అయ్యాడా? ఆ రూపంలో 20కోట్లు, ఊహించని సర్‌ప్రైజ్‌

`కన్నప్ప` ఐదు రోజుల కలెక్షన్లు, మంచు విష్ణు సేఫ్‌ అయ్యాడా? ఆ రూపంలో 20కోట్లు, ఊహించని సర్‌ప్రైజ్‌

మంచు విష్ణు, ప్రభాస్‌ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కన్నప్ప` చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. మరి ఐదు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళు చేసిందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2025, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`కన్నప్ప` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు
Image Credit : instagram

`కన్నప్ప` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు

మంచు విష్ణు హీరోగా రూపొందిన `కన్నప్ప` మూవీ గత శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన మూవీ కావడంతో ఈ చిత్రానికి మంచి హైప్‌ వచ్చింది. 

అది తొలి రోజు కలెక్షన్ల పరంగానూ హెల్ప్ అయ్యింది. ఈ మూవీ ఫలితం విషయంలో మంచు విష్ణు కూడా హ్యాపీ అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత హిట్‌ రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోమవారం నుంచి తగ్గిన `కన్నప్ప` కలెక్షన్లు
Image Credit : instagram

సోమవారం నుంచి తగ్గిన `కన్నప్ప` కలెక్షన్లు

`కన్నప్ప` మూవీ ఫస్ట్ వీకెండ్‌ మంచి వసూళ్లని రాబట్టింది. ఆదివారం వరకు కలెక్షన్లు బాగున్నాయి. కానీ వీక్‌ డేస్‌లో ఇది డల్ అయ్యింది. సాధారణంగా సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గిపోతాయి. 

కానీ మండే కలెక్షన్లని హోల్డ్ చేయగలిగినా చిత్రాలు మాత్రమే సక్సెస్‌ అవుతాయి. `కన్నప్ప` చిత్రానికి సోమవారం కలెక్షన్లు పడిపోయాయి. సోమవారంతో పోల్చితే మంగళవారం మరికాస్త తగ్గినట్టు తెలుస్తోంది. 

అయితే ఇటీవల సినిమాలు కేవలం మూడు రోజులకే పరిమితమవుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఆడుతున్నాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లని రాబట్టలేకపోతున్నాయి.

35
`కన్నప్ప` ఐదు రోజులు వసూళ్లు
Image Credit : Asianet News

`కన్నప్ప` ఐదు రోజులు వసూళ్లు

ఇప్పుడు ఆడియెన్స్ థియేటర్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంట్లో నుంచి కదలడం లేదు. దీంతో అది సినిమాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.

 `కుబేర` మూవీ విషయంలో అదే జరిగింది. పాజిటివ్ టాక్‌ వచ్చినా, కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు `కన్నప్ప` విషయంలోనూ అదే జరుగుతుంది. సోమవారం నుంచి దీనికి కూడా వసూళ్లు తగ్గాయి. 

ఇక ఐదు రోజుల్లో ఈ మూవీ ఎంత వసూళు చేసిందనేది చూస్తే ఇప్పటి వరకు రూ.32కోట్ల షేర్‌ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అరవై కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఇది మంచు విష్ణు కెరీర్‌లోనే అత్యధికమైనా, ఈ మూవీకి అవి సరిపోవు.

45
హిందీ శాటిలైట్‌ రైట్స్ క్రేజీ రేట్‌
Image Credit : x/production house

హిందీ శాటిలైట్‌ రైట్స్ క్రేజీ రేట్‌

`కన్నప్ప` సినిమాకి సుమారు వంద కోట్ల బడ్జెట్‌ అయ్యింది. సినిమా మొత్తాన్ని సొంతంగానే విడుదల చేశారు. దీంతో నిర్మాతలు సేఫ్‌ కావాలంటే రెండు వందల కోట్ల కలెక్షన్లు రావాలి. కానీ ఈ మూవీ ఆస్థాయి వసూళ్లని రాబట్టడం కష్టమే అని చెప్పొచ్చు.

 కానీ ఓటీటీ, శాటిలైట్‌ రూపంలో మాత్రం భారీగానే వచ్చేలా ఉంది. హిందీ శాటిలైట్‌ రూపంలో `కన్నప్ప` చిత్రానికి ఇరవై కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. ఇతర లాంగ్వేజెస్‌ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉంది, అలాగే ఓటీటీ డీల్‌ కూడా సెట్‌ కావాల్సి ఉంది. 

దీనికి కూడా భారీగానే ఆశిస్తున్నారు. యాభై కోట్లకుపైగానే డీల్‌ కుదిరితే నిర్మాతలు సేఫ్‌ అవుతారు, లేదంటే కొంత నష్టాపోవాల్సి వస్తుంది. మరి అది ఎంతకు సెట్ అవుతుందో చూడాలి.

55
`కన్నప్ప` మూవీ స్టోరీ ఇదే
Image Credit : Social Media

`కన్నప్ప` మూవీ స్టోరీ ఇదే

ఇక `కన్నప్ప` మూవీ స్టోరీ ఏంటనేది చూస్తే.. శ్రీకాళహస్తిలో జన్మించిన తిన్నడికి దేవుడంటే నమ్మకం లేదు. శివలింగాన్ని రాయిగానే భావిస్తాడు. కానీ తన భార్య తప్పిపోవడంతో ఆయనలో మార్పు వస్తుంది. 

రుద్ర ఆయనలో మార్పు తీసుకొస్తాడు. శివుడి గొప్పతనం తెలియజేస్తాడు. ఆ తర్వాత శివ భక్తుడిగా మారడమే ఈ మూవీ కథ. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటించారు. తిన్నడిలో దైవభక్తి తెప్పించే రుద్రపాత్రలో ప్రభాస్‌ నటించారు. 

కీరాత(శివుడు) పాత్రలో మోహన్‌లాల్‌ నటించగా, శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ నటించారు. పూజారి మహదేవ శాస్త్రిగా మోహన్‌ బాబు నటించారు. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన `కన్నప్ప` చిత్రాన్ని మోహన్‌ బాబు సుమారు వంద కోట్లతో నిర్మించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
Comedian AVS: చెప్పకుండా కమెడియన్ హాస్పిటల్ బిల్ కట్టేసిన స్టార్..తండ్రిని బతికించడం కోసం కూతురు పడ్డ కష్టం
Recommended image3
Paradise Team Remunerations: ప్యారడైజ్‌ మూవీ టీమ్‌ పారితోషికాలు.. నానికి కెరీర్‌లోనే హైయ్యెస్ట్.. ఎంతంటే?
Related Stories
Recommended image1
పవన్‌ కళ్యాణ్‌ తలుచుకుంటే మహేష్‌ బాబు కంటే నాలుగు రెట్లు అలా సంపాదించగలడు.. వాళ్లంతా కమర్షియల్‌
Recommended image2
శ్రీదేవి నిర్మించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? చిరంజీవి హీరోగా చేస్తే చివరికి జరిగింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved