MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ తలుచుకుంటే మహేష్‌ బాబు కంటే నాలుగు రెట్లు అలా సంపాదించగలడు.. వాళ్లంతా కమర్షియల్‌

పవన్‌ కళ్యాణ్‌ తలుచుకుంటే మహేష్‌ బాబు కంటే నాలుగు రెట్లు అలా సంపాదించగలడు.. వాళ్లంతా కమర్షియల్‌

పవన్‌ కళ్యాణ్‌ కమర్షియల్‌ యాడ్స్ కి దూరంగా ఉంటారు. అదే మహేష్‌ బాబు యాడ్స్ చేయడంలో టాప్‌లో ఉన్నారు. అయితే మహేష్‌పై దర్శకుడు షాకింగ్‌ కామెంట్‌ చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2025, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యాడ్స్ కి దూరంగా పవన్‌, టాప్‌లో మహేష్‌
Image Credit : connect my india

యాడ్స్ కి దూరంగా పవన్‌, టాప్‌లో మహేష్‌

పవన్‌ కళ్యాణ్‌ టాలీవుడ్‌లో తిరుగులేని టాప్‌ స్టార్‌గా ఎదిగినప్పటికీ ఆయన ఎప్పుడూ ఒక్క కమర్షియల్‌ యాడ్‌ కూడా చేయలేదు. ఇండియన్ సినిమాల్లో ఇలా కొందరు హీరోలు మాత్రం యాడ్స్ కి దూరంగా ఉన్నారు. 

అదే సమయంలో మరికొందరు హీరోలు యాడ్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహేష్‌ బాబు కూడా అందులో ఒకరు. టాలీవుడ్‌లో ఆయన చేస్తున్న యాడ్స్ మరెవ్వరూ చేయడం లేదు. ఓ రకంగా టాప్‌లో ఉన్నారని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 యాడ్స్ చేయడంలో స్టార్స్ పాలసీ ఇదే
Image Credit : mahesh insta

యాడ్స్ చేయడంలో స్టార్స్ పాలసీ ఇదే

యాడ్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పాలసీ, తాము వాడనివి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రొడక్ట్ లను ప్రమోట్‌ చేయలేమని పవన్‌ కళ్యాణ్‌, కమల్‌ హాసన్‌, సాయిపల్లవి లాంటి కొందరు స్టార్స్ చెబుతుంటారు.

 తాము వాడేవి, తమ రేంజ్‌ని బట్టి, బ్రాండ్‌, క్వాలిటీని బట్టి ప్రమోట్‌ చేస్తుంటామని మరికొందరు తారలు చెబుతుంటారు. అదే సమయంలో డబ్బుల కోసమే యాడ్స్ చేసేవారు కూడా ఉంటారు. 

ఈ విషయంలో ఎవరి వాదన వారిదే. అయితే కొన్నిసార్లు పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్‌ చేసిన ప్రొడక్ట్ నెగటివ్‌ రిజల్ట్ ని ఇవ్వడంతో బ్లేమ్‌ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి.

36
పవన్‌ తలుచుకుంటే మహేష్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు
Image Credit : hyderabad mail

పవన్‌ తలుచుకుంటే మహేష్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు

తాజాగా మహేష్‌ బాబుపై టాలీవుడ్‌ డైరెక్టర్‌ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ తలుచుకుంటే మహేష్‌ బాబు కంటే నాలుగు రెట్లు సంపాదించగలరు అని, కానీ ఆ పని ఆయన చేయరని తెలిపారు. 

ఈ విషయంలో మహేష్‌ బాబు కమర్షియల్‌ అని తెలిపారు. దర్శకుడు గీతా కృష్ణ ఏం చెప్పాడంటే `మహేష్‌ బాబు చాలా కమర్షియల్‌. ఒక్క సినిమా ఆడితే, రూ.20-30కోట్ల యాడ్స్ వస్తాయి. 

అలానే ఒప్పుకుంటే పవన్‌ కళ్యాణ్‌ కి నాలుగు రెట్లు ఎక్కువొస్తాయి. కానీ నేను చేయను అని, చేస్తే ఫ్రీగా చేస్తానని, చేనేత వస్త్రాలు వంటి వాటికి అని తెలిపారు.

46
 మహేష్‌కి యాడ్‌ ఇన్‌కమ్‌ ముఖ్యం, కానీ పవన్‌ కి కాదు
Image Credit : prime telugu

మహేష్‌కి యాడ్‌ ఇన్‌కమ్‌ ముఖ్యం, కానీ పవన్‌ కి కాదు

పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రతి ఒక్కరు బ్యాడ్‌గా మాట్లాడేవారే. మంచి గుణాలను ఎవరూ చెప్పరు. సినిమాల్లో ఎంత సంపాదిస్తున్నాడో, దానికి మించి బయట సంపాదించవచ్చు మహేష్‌ బాబులాగా, కానీ ఒప్పుకోడు. 

మహేష్‌ కి యాడ్ ఇన్‌కమ్‌ చాలా ముఖ్యం. మహేష్‌, ఆయన భార్య నమ్రత చాలా ప్లాన్‌ చేసి హిట్‌ అయ్యే సినిమాలే చేస్తారు. మూడేళ్లయినా రాజమౌళి మూవీని ఎందుకు చేస్తున్నారు ఆ తర్వాత యాడ్స్ పరంగా ఆయన ఎక్కడితో వెళ్తాడు` అని తెలిపారు దర్శకుడు గీతా కృష్ణ. 

ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. గీతా కృష్ణ `సంకీర్తన`, `కీచురాళ్లు`, `కోకిల`, `కాఫీ బార్‌` వంటి చిత్రాలను రూపొందించారు.

56
రాజమౌళి సినిమాతో మహేష్‌ బిజీ
Image Credit : Instagram

రాజమౌళి సినిమాతో మహేష్‌ బిజీ

మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంక చోప్రా వంటి భారీ కాస్టింగ్‌తో ఇంటర్నేషన్‌ స్టాండర్డ్స్ లో ఈ మూవీ రూపొందుతుంది. 

ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. పారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీ రూపొందుతుంది. 

66
ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్‌ చేసే పనిలో పవన్‌
Image Credit : Asianet News

ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్‌ చేసే పనిలో పవన్‌

పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ నెల 24న విడుదల కానుంది. 

అలాగే `ఓజీ` సైతం షూటింగ్‌ పూర్తయ్యింది. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్‌. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Recommended image3
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
ఆగస్ట్ లో కాదు, `బిగ్‌ బాస్‌ తెలుగు 9` ప్రారంభమయ్యేది ఆ రోజే, ఈ సారి మూడో హీరోకి ఛాన్స్?
Recommended image2
దిల్‌ రాజుకి రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఫైనల్‌ వార్నింగ్‌, ఇంకోసారి తప్పుగా మాట్లాడితే.. రచ్చ మొదలైంది ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved