- Home
- Entertainment
- శ్రీదేవి నిర్మించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? చిరంజీవి హీరోగా చేస్తే చివరికి జరిగింది ఇదే
శ్రీదేవి నిర్మించిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? చిరంజీవి హీరోగా చేస్తే చివరికి జరిగింది ఇదే
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో మంచిసినిమాలే వచ్చాయి. కానీ మరో భారీ సినిమాని ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం శ్రీదేవి ఏకంగా నిర్మాతగా మారారు. కట్ చేస్తే

థియేటర్లలో సునామీ సృష్టించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి`
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి కలిసి నాలుగైదు సినిమాలు చేశారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `ఎస్పీ పరశురాం`, `మోసగాడు`, `రాణికాసుల రంగమ్మ` వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వాటిలో ప్రధానంగా చెప్పుకునే మూవీ `జగదేక వీరుడు అతిలోక సుందరి`.
ఇది అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓ వైపు అప్పుడు రాష్ట్రంలో తుఫాన్ విజృంభించగా, మరోవైపు థియేటర్లలో ఈ మూవీ తుఫాన్‌లా కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమాల్లో ఇదొక క్లాసిక్‌గా నిలిచిపోయింది.
చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో మరో సినిమా
ఈ మూవీ తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో మరో సినిమా స్టార్ట్ అయ్యింది. `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ సక్సెస్ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించాలని ఫిక్స్ అయ్యారు.
యాక్షన్ అడ్వెంచర్ కథని రెడీ చేసుకుని సినిమా కూడా ప్రారంభించారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. చెన్నైలో స్టూడియోలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఎంజీఆర్ ఈ మూవీ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు, క్లాప్ కొట్టారు. ఈ మూవీనే `వజ్రాలదొంగ`.
`వజ్రాల దొంగ` చిత్రంతో నిర్మాతగా మారిన శ్రీదేవి
`జగదేక వీరుడు అతిలోక సుందరి` తర్వాత చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో స్టార్ట్ అయిన చిత్రమిది. ఈ మూవీతోనే శ్రీదేవి నిర్మాతగా మారారు. తన చెల్లి శ్రీలత పేరుతో లతా ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి `వజ్రాలదొంగ` చిత్రాన్ని నిర్మించారు.
బప్పిలహరి సంగీతం అందించిన ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని చిత్రీకరించారు. అందుకోసం చెన్నైలో ఒక సెట్ కూడా వేశారు. సాంగ్ షూటింగ్ అయ్యాక ఈ మూవీని ఆపేశారు.
`వజ్రాల దొంగ` మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే
దీనికి కారణం సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. బయ్యర్లు షూటింగ్ దశలోనే సినిమాని కొనేందుకు వచ్చారు. హక్కుల కోసం పోటీ పడ్డారు. సినిమాపై హైప్ పెరిగింది, కానీ కథలో అంత దమ్ము కనిపించడం లేదు.
దీంతో దర్శకుడు కోదండరామిరెడ్డి శ్రీదేవితో ఈ విషయం చెప్పారు. ఆమెకి కూడా డౌట్ వచ్చింది. ఆ తర్వాత మరో సబ్జెక్ట్ తో చేద్దామనుకున్నారు. `మిస్టర్ ఇండియా` రీమేక్ అనుకున్నారు కానీ, అది చిరంజీవికి నచ్చలేదు.
ఇలా కొంత కాలం కథల కోసం వెయిట్ చేశారు. కానీ ఎక్కడా `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమాని మించిన కథ దొరకలేదు. దీంతో మూవీని ఆపేశారు. అలా శ్రీదేవి నిర్మాతగా మారి చేసిన తొలి ప్రయత్నం ప్రారంభ దశలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత మళ్లీ నిర్మాణం సైడ్ ఆలోచించలేదు శ్రీదేవి. ఈ మూవీ రూపొంది సక్సెస్ అయితే నిర్మాతగా శ్రీదేవి బిజీ అయ్యేది, ఇంకా అనేక చిత్రాలు నిర్మించేది.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి
కానీ శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బాలీవుడ్‌లో అనేక చిత్రాలను నిర్మించారు. సౌత్‌లోనూ పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు.
ఇక శ్రీదేవి 2018లో దుబాయ్‌లో ఓ హోటల్‌లో మరణించిన విషయం తెలిసిందే. బాత్ రూమ్‌లో పడి ఆమె చనిపోయింది. ఆమె మరణించినా ఇప్పటికీ అతిలోక సుందరిగా ఇండియన్ ఆడియెన్స్ ని తన సినిమాలతో, తన అద్భుతమైన నటనతో, అత్యద్భుతమైన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. అలరిస్తూనే ఉంది శ్రీదేవి.