- Home
- Entertainment
- Brahmamudi: సేటు ని కిడ్నాప్ చేసిన కనకం.. స్వప్నని అనుమానిస్తున్న దుగ్గిరాల కుటుంబం!
Brahmamudi: సేటు ని కిడ్నాప్ చేసిన కనకం.. స్వప్నని అనుమానిస్తున్న దుగ్గిరాల కుటుంబం!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. డబ్బున్న ఇంటికి కోడలుగా వచ్చి పెత్తనం వెలగబెడుతున్న ఒక పేదింటి ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇంట్లో ఒక టైం ఉంటుంది ఆ టైం కి అందరూ వచ్చి టిఫిన్ చేయాలి. అంతేకానీ ఎవరూ బొట్టు పెట్టి పిలవరు అంటుంది అపర్ణ. కావ్య కూడా స్వప్నని మందలించి టిఫిన్ గా ఇడ్లి పెడుతుంది. ఈ టిఫిన్ నేను చేయను నా ఫిజిక్ పాడైపోతుంది ఇందులో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటూ సలాడ్, జ్యూస్ తలా రూమ్ కి తీసుకురమ్మని కావ్యకి ఆర్డర్ వేసి పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
రుద్రాణి.. అత్త కి తగ్గ కోడలు అని వెటకారంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. ఈ ఇంట్లో అత్తకు మాత్రం ఏం విలువ ఉంది లెండి అని నిష్టూరంగా మాట్లాడుతుంది రుద్రాణి. మరోవైపు సేటుని ఇంటికి తీసుకువస్తుంది మీనాక్షి. డబ్బులు కడతాను అన్నావు కదా ఏవి డబ్బులు అని కనకాన్ని అడుగుతుంది మీనాక్షి. ఇప్పుడు కాదు ఒక ఐదు ఆరు నెలల తర్వాత అంటుంది కనకం ఆ మాటలకి సేటు మీనాక్షి ఇద్దరు షాక్ అవుతారు.
ఈ మాట చెప్పటానికే మీ అక్కని పంపించావా అని కోపంగా అడుగుతాడు సేటు. మరి ఏం చేసేది నువ్వు ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టమని పీకల మీద కూర్చుంటే ఏం చేయాలి దయచేసి నాకు కాస్త గడువు ఇవ్వు అంటుంది కనకం. అందుకు ఒప్పుకోడు సేటు. కోపం పట్టలేక సేటు నెత్తిమీద కర్రతో ఒక్కటిస్తుంది కనకం. దెబ్బకి స్పృహ తప్పి పడిపోతాడు సేటు. అది చూసిన మీనాక్షి కంగారు పడిపోతుంది ఏం చేస్తున్నావు అంటూ చెల్లెల్ని మందలిస్తుంది.
ఇప్పుడు ఏం చేద్దాం అని చెల్లెల్ని అడుగుతుంది. మా ఆయన వచ్చే టైం అయింది ప్రస్తుతానికి వీడిని దాచేద్దాము అని చెప్పి సేటుని స్టోర్ రూమ్ లో బంధించేస్తారు అక్క చెల్లెలు ఇద్దరు. మరోవైపు పనమ్మాయ్ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది అనుకోకుండా ఆ నీడు స్వప్న మీద పడతాయి. ఆమెదే నీళ్లు పోస్తావా నువ్వేంటి నీ లెవెల్ ఏంటి అంటూ పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. పనమ్మాయి తప్పైపోయింది క్షమించండి అని చెప్పిన వినిపించుకోదు.
అంతలోనే అక్కడికి వచ్చిన కావ్య తనేమీ నీ బానిస కాదు నువ్వు చెప్పినట్లు వినటానికి. తనకి తను చేసే పనికి విలువ ఇవ్వు అమ్మాయికి సారీ చెప్పు అంటుంది కావ్య. ఆ అమ్మాయికి నేను ఎందుకు సారీ చెప్పాలి నా లెవెల్ ఏంటి కావాలంటే నువ్వు చెప్పుకో సారి ఏదో అని చెప్పి పొగరుగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఇదంతా పైనుంచి గమనిస్తూ ఉంటాడు రాజ్. కావ్య పనమ్మాయికి క్షమాపణ చెప్తుంది.
కావ్య సారీ చెప్పేటప్పటికి పనమ్మాయి కూడా ఎమోషనల్ అవుతుంది. కావ్య ఇంట్లోకి వెళ్ళబోతు అనుకోకుండా రాజ్ ని చూస్తుంది. రాజ్ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోవడం చూసి ఈయన నేను అక్క తో మాట్లాడిన మాటలు విన్నారా ఆయనతో మాట్లాడాలి లేకపోతే ఈ టెన్షన్ నేను భరించలేను అని రాజ్ దగ్గరికి వెళ్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఆ విషయం నాకు ముందే తెలుసు కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే మీ అక్క పెళ్ళికి ముందు నుంచి ఇంతేనా ఎక్కడికి వచ్చాక ఎలా ప్రవర్తిస్తుందా అని అడుగుతాడు రాజ్.
రాజ్ స్వప్న కడుపు గురించి తెలుసుకోలేదు అని రిలాక్స్ ఫీల్ అవుతుంది కావ్య. అమ్మ తనని కాస్త గారాబం చేసింది అందుకే ఇలా మొండిగా తయారైంది కానీ చాలా మంచిది తనని అపార్థం చేసుకోవద్దు అంటుంది కావ్య. అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి తనతో నాకేం సంబంధం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. మరోవైపు కిడ్నాప్ చేసిన సేటిని స్టోర్ రూమ్ లో కుర్చీకి కట్టేసి మూతికి ప్లాస్టర్ వేస్తారు కనకం, మీనాక్షి. నా ఇంటిని లాక్కుందామనుకుంటున్నావా అంటూ సేటు మీద కోప్పడుతుంది కనకం.
ఇంతలో ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి కనకాన్ని పిలుస్తాడు. బయటికి వచ్చిన భార్య వదిన ఏదో తప్పు చేసిన వాళ్ళ లాగా కనిపిస్తూ ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఏమీ లేదు అంటూ మాట వేస్తారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన అప్పుని ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తుంది స్వప్న. నీకు పుల్ల మామిడికాయలు ఇమ్మని నాన్న పంపించాడు అంటుంది అప్పు.
నాకెందుకు తినాలనిపిస్తుంది అంటూ పరధ్యానంగా మాట్లాడేస్తుంది స్వప్న. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అదేంటి ఈ టైంలో అందరికీ పులుపు తినాలనిపిస్తుంది కదా అని అనుమానంగా అంటుంది ధాన్యలక్ష్మి. అలా అనిపించకపోతే చెప్పు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము అంటుంది చిట్టి.