- Home
- Entertainment
- Brahmamudi: కూతురి పరిస్థితిని తట్టుకోలేకపోతున్న కనకం.. రాహుల్ గుట్టు బయటపెట్టిన స్వప్న?
Brahmamudi: కూతురి పరిస్థితిని తట్టుకోలేకపోతున్న కనకం.. రాహుల్ గుట్టు బయటపెట్టిన స్వప్న?
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ చేస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అత్యాశకు పోయి తప్పటడుగు వేసి అవమానాల పాలైన ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎపిసోడ్ ప్రారంభంలో మీరు లోపలికి వస్తే మేనేజర్ గుర్తుపట్టేస్తాడేమో నేను ఒక్కర్తినే వెళ్లి రానా అంటుంది శృతి. వద్దు నేను కూడా వస్తాను అతని దగ్గర తేల్చుకోవలసినవి చాలా విషయాలు ఉన్నాయి అంటుంది కావ్య. మరి ఎలా అంటుంది శృతి. ఇలా అంటూ కళ్ళజోడు పెట్టుకుని మొహానికి మాస్క్ తగిలించుకుంటుంది కావ్య. లోపలికి వెళ్లి మేనేజర్ తో రాహుల్ పంపించారు అని చెప్తారు.
మెల్లగా అతన్ని మాటల్లో పెట్టి సి సి ఫుటేజ్ తీసుకుందాం అనుకుంటారు. కానీ రాహుల్ లంచమిచ్చి ఆ ఫుటేజ్ ని డిలీట్ చేయించాడు అని తెలుసుకొని ఉన్న ఒక్క ఆధారాన్ని నాశనం చేశావు అంటూ మేనేజర్ చంప చెళ్ళుమనిపిస్తుంది కావ్య. నిరాశ గా బయటికి వచ్చిన కావ్య నువ్వే ఏదైనా దారి చూపించాలి అని భగవంతుడిని వేడుకుంటుంది. ఎదురు బిల్డింగ్ లో ఉన్న సి సి కెమెరా కనిపించడంతో ఆనందపడుతుంది.
అక్కడ ఫుటేజ్ దొరుకుతుందేమో ప్రయత్నిద్దాం అంటుంది కావ్య. వాళ్లు ఎందుకు ఇస్తారు మేడం అంటుంది శృతి. నాతో రా అని శృతిని తనతో పాటు తీసుకెళ్లి మేము పోలీసులం.. మొన్న ఇక్కడ దొంగతనం జరిగింది సి సి ఫుటేజ్ చూడాలి అని మాయ మాటలు చెప్పి సిసి ఫుటేజ్ చెక్ చేస్తుంది కావ్య. అందులో రాహుల్ కి సంబంధించిన వీడియో కనిపించడంతో ఆనందపడుతుంది.
దానిని తన ఫోన్ లోకి ఎక్కించమని శృతికి చెప్తుంది. కావ్య చెప్పినట్లే చేస్తుంది శృతి. మరోవైపు నిశ్చితార్థంలో కూర్చోబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది స్వప్న. ఇంట్లో అందరూ కంగారు పడతారు. అదే సమయానికి స్వప్నని తీసుకు వెళ్ళటం కోసం కళ్యాణ్, అప్పు కూడా వస్తారు. పెళ్ళికొడుకుని స్వప్న కి ఏం జరిగిందో చూడమంటుంది మీనాక్షి. స్వప్న ని చెక్ చేసిన పెళ్ళికొడుకు తను ప్రెగ్నెంట్ అని చెప్పి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాడు.
మరోవైపు ఎంగేజ్మెంట్ అవ్వకుండానే లగ్నపత్రిక రాసుకుందాము అంటుంది రుద్రాణి. ఎందుకంత కంగారు ముందు ఎంగేజ్మెంట్ అవ్వనీ అంటుంది అపర్ణ. ఎందుకు అంతలా కుళ్ళు కుంటావు. నీ కొడుక్కి జరిగినట్లుగా కాకుండా నా కొడుక్కి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి పంతులు గారికి మంచి ముహూర్తం చూడమని చెప్తుంది రుద్రాణి. ఇక్కడ ఎవరూ ముసుగు వేసి పెళ్లిళ్లు చేసే మాయల మరాఠీలు లేరు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అపర్ణ.
వేదిక మీద ఏంటి రుద్రాణి ఈ తొందరపాటు కాస్తయినా బుద్ధుండక్కర్లేదా అయినా జరిగేది నీ కొడుకు ఎంగేజ్మెంట్ కాస్త నిదానించు అంటూ మందలిస్తుంది చిట్టి. పంతులుగారు కూడా లగ్నపత్రికి సంగతి తర్వాత చూద్దాము ముందు తాంబూలాలు మార్చుకోండి మీ తరఫున ఎవరు తాంబూలాలు అందుకుంటారు అని రుద్రాణిని అడుగుతారు. నేనే అందుకుంటాను అంటుంది రుద్రాణి. తాంబూలాలు దంపతులు అందుకోవాలి ఆ మాత్రం కూడా తెలియదా అని వెటకారంగా మాట్లాడతారు పంతులుగారు.
నా తరఫున అపర్ణ వాళ్ళు తీసుకుంటారు కన్యాదానం కూడా ఆ దంపతులే చేస్తారు అంటుంది అరుంధతి. నా తరఫున మా అమ్మానాన్న తీసుకుంటారు అంటుంది రుద్రాణి. మంత్రోచ్ఛారణ మధ్య తాంబూలాలు మార్చుకుంటారు అపర్ణ దంపతులు, సీతారామయ్య దంపతులు. మరోవైపు కూతురు పరిస్థితికి కన్నీరు పెట్టుకుంటుంది కనకం. ఇప్పుడు దీన్ని చంపి నేను చావాలా.. లేకపోతే ఈ దరిద్రాన్ని బయటకి పంపించేసి బరువుని దింపుకోవాలా?
దీని బ్రతుకు బాగోవాలని అడ్డమైన పనులు చేశాను కానీ ఇది తప్పు తోవ లో వెళ్లి ఇలా నెత్తి మీదకి తీసుకువచ్చింది. దేవుడు లాంటి నా భర్త కి ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి ఆడపిల్ల బాగోకపోతే తల్లిదే బాధ్యత. ఏడవటానికి కన్నీరు కూడా లేదు ఆ మనిషి కళ్ళల్లో అంటూ భర్తను చూస్తూ తలబాదుకుంటుంది కనకం. మీరేమీ బాధపడకండి. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. మోసం చేసినవాడు అక్కడ ఆనందంగా ఉన్నాడు మేము అందుకే వచ్చాము మాతో తీసుకువెళ్తాము.
కావ్య వదిన కూడా ఇదే పని మీద వెళ్ళింది. తను అనుకుంటే కచ్చితంగా రుజువులు సంపాదిస్తుంది అని చెప్పి స్వప్నని అక్కడ నుంచి తీసుకువెళ్తారు అప్పు, కళ్యాణ్. మరోవైపు అదే సమయంలో వేదిక మీద ఉన్న వెన్నెలకి ఉంగరం తొడగబోతూ నువ్వే నా జీవితంలో నేను కన్నెత్తి చూసిన మొదటి అమ్మాయివి. నా అదృష్టం ఏమిటంటే నేను ఇష్టపడిన మొదటి అమ్మాయే నన్ను కూడా ఇష్టపడటం. నీకు నాకు నిశ్చితార్థం అంటే నమ్మలేకపోతున్నాను.
ఈ వెన్నెలని పెళ్లి చేసుకుంటే నాకు జీవితమంతా పగలు కూడా వెన్నెలే అంటూ తీయగా మాట్లాడుతాడు రాహుల్. సాల్ట్ బిస్కెట్ కి క్రీం రాస్తున్నాడు రాస్కెల్ అని కొడుకుని ముద్దుగా తిట్టుకుంటుంది రుద్రాణి. అప్పటికే స్వప్న వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. తరువాయి భాగంలో సాక్షాధారాలను తీసుకువస్తుంది కావ్య. రాహుల్ గుట్టు బయటపెడుతుంది స్వప్న.