కమల్ హాసన్ వివాదం, రజినీకాంత్ రాయబారం, రిజల్ట్ ఏంటంటే?
కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈసినిమాకు సబంధించి సాలిడ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us

కమల్ హాసన్ నటించి 1996 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇండియన్. శంకర్ దర్శకత్వం వహించిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కమల్ హాసన్ కి జాతీయ అవార్డు కూడా లభించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా హిట్ సినిమాగా ఇండియన్ నిలిచింది. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాల తర్వాత దాని రెండవ భాగాన్ని తీశారు కమల్ హాసన్. 2017 లోనే ఇండియన్ 2 సినిమా గురించి ప్రకటించారు శంకర్ టీమ్.
ఆ తర్వాత ఇండియాన్ 3 లో ఏర్పడిన సమస్యల కారణంగా కొంత కాలం షూటింగ్ ఆగిపోయింది. సెట్ లో అగ్నిప్రమాదాలు, మరొక ప్రమాదంలో టెక్నీషియన్ మరణించడం, నిర్మాతలతో విభేదాలు, ఇలా రకరకాల కారణాల వల్ల ఇండియాన్ 2 ఆగిపోయింది. ఆతరువాత కొంత కాలానికి సమస్యలు పరిష్కారం అయ్యి.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి, షూటింగ్ పూర్తయి విడుదల కావడానికి 7 సంవత్సరాలు పట్టింది.
ఇండియన్ సినిమాకి రెండవ భాగం కావడంతో భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అయ్యింది. కానీ ఆ అంచనాలను ఆ సినిమా అస్సలు అందుకోలేకపోయింది. శంకర్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా ఇండియన్ 2 సినిమా నిలిచింది. అంతేకాకుండా ఆ సినిమాలోని సన్నివేశాలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఇండియన్ 2 సినిమా ఘోర పరాజయం కారణంగా ఇండియన్ 3 సినిమాకి సమస్య ఏర్పడింది.
ఇండియన్ 2 సినిమా తీస్తున్నప్పుడే దాని మూడవ భాగానికి సంబంధించిన 90 శాతం సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా ఒక పాట, కొన్ని సన్నివేశాలు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. ఇండియన్2 పరాజయం కారణంగా ఇండియన్ 3 సినిమాలోని మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించకుండానే దాన్ని విడుదల చేయడానికి లైకా ప్రయత్నించింది.
మరోవైపు కమల్ హాసన్, శంకర్ మిగిలిన సన్నివేశాలు కంప్లీట్ చేయడానికి పెండింగ్ రెమ్యునరేషన్ అడిగారట. దాంతో నిర్మాణ సంస్థకీ, చిత్ర బృందానికీ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇండియన్ 3 సినిమా పనులను నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో, ఇండియన్ 3 సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. .ఇండియన్ 3 సినిమాలో బ్యాలెన్స్ సీన్స్ ను షూట్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అవుతోంది. అంతే కాకుండా మిగిలిన షూటింగ్ కోసం శంకర్, కమల్ హాసన్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే పనిచేయడానికి అంగీకరించారట. వారి ఈ నిర్ణయానికి ప్రధాన కారణం రజనీకాంత్ అని తెలుస్తోంది.
రజినీకాంత్ స్వయంగా ఈ సమస్య విషయంలో జోక్యం చేసుకుని చర్చలు జరిపిన తర్వాతే సమస్యలు పరిష్కారమైయ్యిందట. అయితే ముందుగా కమల్ హాసన్, శంకర్ లు మాత్రం రెమ్యునరేషన్ తీసుకోమని ఒప్పుకున్నారట. ఇక ఇప్పుడు ఇండియాన 3 సినిమా పనులు మొదలవుతున్నాయని చెబుతున్నారు. ఈ సినిమా శంకర్, కమల్ హాసన్ లకు మంచి పునరాగమన చిత్రంగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.