- Home
- Entertainment
- నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి ప్లీజ్, బ్రహ్మముడి కావ్య రిక్వెస్ట్, దీపిక రంగరాజుకు బిగ్ బాస్ అవకాశం దక్కేనా?
నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి ప్లీజ్, బ్రహ్మముడి కావ్య రిక్వెస్ట్, దీపిక రంగరాజుకు బిగ్ బాస్ అవకాశం దక్కేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో నాకు బిగ్ బాస్ అవకాశం ఇవ్వండి అని ఓ సీరియల్ హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అంతే కాదు ఈ రియాల్టీ షో ద్వారా చాలామంది బుల్లితెర తారలు మంచి ఇమేజ్ ను సాధించడంతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా పొందారు. అంతకు మించి ఫ్యాన్స్ బేస్ ను కూడా సాధిస్తున్నారు. ప్రతి సీజన్ లోను సీరియల్స్ నుంచి ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిందే. ఒకరు కాదు ఇద్దరు లేదా ముగ్గరు స్టార్ సీరియల్ నటీనటులు కూడా ఉంటారని తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ కి వెళ్లాలని, మరింత ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బయట జనాల్లో ఫేమ్ ఉన్నవాళ్ళని కొంతమందిని తెస్తారు.
ఇక కొంత మంది మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ముందు నుంచి ప్రయత్నాలు చేస్తుంటారు. రెమ్యునరేషన్ తక్కువ ఉన్నా పర్వాలేదు..ముందు బిగ్ బాస్ అవకాశం ఇవ్వండి అని అడిగేవారు కూడా లేకపోలేదు. ఈక్రమంలోనే ఓ సీరియల్ హీరోయిన్ కూడా తనకు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనేందకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని ఉంది. ప్లీజ్ నన్ను పిలవండి అంటూ అడుగుతుందట.
ఆ సీరియల్ యాక్ట్రస్ ఎవరో కాదు దీపిక రంగరాజు. బ్రహ్మముడి కావ్యగా బాగా ఫేమస్ అయిన దీపిక తన నటనతో ఆడియన్స్ మనసు దోచుకుంది. సీరియల్ తో తెలుగులో ఫుల్ ఫేమస్ అయ్యింది తమిళ భామ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ తో పాటు పలు టీవీ షోలు చేస్తూ మంచి ఇమేజ్ సాధించింది. అంతే కాదు తాను ఉన్న ప్రతీ చోట అల్లరి పనులుతో, పంచ్ లతో ప్రేక్షకుల మనసులను మెప్పిస్తుంది దీపిక. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడింది.
దీపికా రంగరాజు బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. చాలా మంది నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ కి వెళ్తారా అని. ప్రస్తుతం అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది కాబట్టి వెళ్ళను. ఆ సీరియల్ అయ్యాకే వెళ్తాను. నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు, వస్తే కచ్చితంగా వెళ్తాను. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, అవకాశం వస్తే వెళ్లాలని కూడా ఉంది. నన్ను పిలవాలి అని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి. నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అని తన మనసులో కోరిక బయటపెట్టింది దీపిక.
ఆమె చెప్పిన మాటలను బట్టి.. త్వరలో స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ సీజన్ 9 లో దీపిక ఉండదు అని తెలుస్తుంది. గత సీజన్ లో మాత్రం ఆమె గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేసింది. తెగ అల్లరి చేసింది. ఇక దీపికా లాంటి నటి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే.. ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి చూస్తే.. రీసెంట్ గా దీనికి సబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోయే స్టార్స్ ఎవరు అనే విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు కాని.. ఈ విషయంలో రకరకాల లిస్ట్ లు మాత్రం నెట్టింగ తెగ తిరుగుతున్నాయి. కొంత మంది స్టార్ యాక్టర్స్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.