- Home
- Entertainment
- ఉపరాష్ట్రపతి సర్వేపల్లి తో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా? చిన్నప్పుడే జాతీయ అవార్డ్ పొందిన హీరో ఎవరు?
ఉపరాష్ట్రపతి సర్వేపల్లి తో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా? చిన్నప్పుడే జాతీయ అవార్డ్ పొందిన హీరో ఎవరు?
ఈ పోటోలో కనిపిస్తున్న బాబును చూశారా? మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తో అవార్డ్ అందుకుంటున్నఈ బాలుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరో. ఇంతకీ ఎవరా హీరో?

సర్వేపల్లి రాధాకృష్ణతో ఉన్న బాలుడు ఎవరు?
ఒక్కోసారి సెలబ్రిటీ స్టార్స్ కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మన దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో పాటు ఓ చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. ఇంతకీ ఎవరా నటుడు?
KNOW
మహానటి సావిత్రి కొడుకుగా
ఈ ఫోటోలో ఉన్న చిన్న కుర్రాడు ఇంకెవరో కాదు... ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘లోకనాయకుడు’గా పేరుగాంచిన కమల్ హాసన్. దక్షిణ భారతదేశ సినీ రంగంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఎంతో గౌరవం సంపాదించుకున్న కమల్ హాసన్ సినిమాల్లోకి బాల నటుడిగా ప్రవేశించారు. కమల్ హాసన్ తన నాలుగో ఏటనే 1959లో విడుదలైన ‘కలత్తూర్ కనమ్మ’ అనే తమిళ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాలో ఆయన మహానటి సావిత్రి కుమారుడి పాత్రలో నటించారు.
బాలనటుడిగా రాష్ట్రపతి అవార్డు
ఈ సినిమాలో ఆయన చూపిన అద్భుత నటనకు గాను భారత రాష్ట్రపతి మెడల్ లభించింది. అప్పట్లో భారతదేశపు ఉపరాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కమల్ హాసన్ బంగారు పతకాన్ని స్వీకరించారు. ఆ పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో టీచర్స్ డే సందర్భంగా కమల్ ఈ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ, కమల్ హాసన్ కు సంబంధించిన ఈ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకుంటున్నారు.
వరుసగా రెండు ప్లాప్ లు
ఈ సినిమాలో ఆయన పోషించిన ‘సుప్రీం యాస్కిన్’ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కల్కీ సీక్వెల్‌లో కమల్ హాసన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం. బాల నటుడిగా బంగారు పతకం అందుకున్న కమల్, ఇప్పుడు భారత సినిమా రంగంలో గర్వించదగ్గ స్థాయికి ఎదగడం సినీ అభిమానులను గర్వపడేలా చేస్తోంది.
నటనలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న కమల్ హాసన్
ఇక ప్రస్తుతం కమల్ హాసన్ భరతీయుడు 3 ని కంప్లీట్ చేసేపనిలో ఉన్నాడు. అంతే కాదు రీసెంట్ గా ఆయన DMK సపోర్ట్ తో రాజ్యసభకు కూడా వెళ్లారు. ఇటు సినిమాలు, అటు పాలిటిక్స్ రెంటింటిని బ్యాలన్స్ చేస్తూ.. వెళ్తున్నారు. 70 ఏళ్ల కమల్ హాసన్, 60 ఏళ్ల సినిమా జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నారు.

