MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లోకి ఉప్పల్ బాలు, అగ్నిపరీక్షలో సందడి చేసిన సోషల్ మీడియా సంచలనం

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లోకి ఉప్పల్ బాలు, అగ్నిపరీక్షలో సందడి చేసిన సోషల్ మీడియా సంచలనం

Bigg Boss Telugu 10: సకెస్స్ ఫుల్ తెలుగు రియాల్టీషో బిగ్ బాస్ 10వ సీజన్ కు రెడీ అవుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరొస్తారా అనిఅంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టైమ్ లో.. ఉప్పల్ బాలు పేరు గట్టిగా వినిస్తోంది. బాలు బిగ్ బాస్ ఎంట్రీ పక్కానా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 13 2026, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ రియాల్టీ షో..
Image Credit : x/@starmaa

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ రియాల్టీ షో..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే 9 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 10వ సీజన్ కోసం రెడీ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ షో కోసం గతంలో మాదిరిగా సామాన్యుల ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష కార్యక్రమంల రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. సామాన్యులలోని టాలెంట్‌ను గుర్తించి హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహించే 'అగ్నిపరీక్ష' షో సీజన్ 2 ఆడిషన్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ ఆడిషన్స్‌లో అనేక మంది ఆసక్తికరమైన కంటెస్టెంట్లు పాల్గొనగా.. అందులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 'ఉప్పల్ బాలు' ప్రత్యక్షమవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉప్పల్ బాలు ఫాలోయింగ్..
Image Credit : Uppal Balu faceBook

ఉప్పల్ బాలు ఫాలోయింగ్..

టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు.. ఎంత పాపులర్ అయ్యాడో అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేయడం, బాలు బాడీ లాంగ్వేజ్ నచ్చక చాలామంది అతన్ని విమర్శించేవారు. ఎంత విమర్శించినా.. అంతకు రెట్టింపు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. పేదరికం నుంచి వచ్చిన బాలు.. కుటుంబాన్ని పోషించడానికి రకరకాల వేశాలు వేసేవాడు. ఎవరు ఎన్ని అన్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. వందకి వెయ్యికి ప్రమోషన్లు చేశాడు. కుటుంబాన్ని పోషించాడు. ఆతరువాత కాలంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఒక కంపెనీకి ప్రమోషన్లు చేసుకుంటూ.. డీసెంట్ గా ఉంటున్నాడు. తన లైఫ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసుకుని హ్యాపీగా ఉంటున్నాడు.

34
బిగ్ బాస్ లోకి రావాలని ప్రయత్నాలు..
Image Credit : Asianet News

బిగ్ బాస్ లోకి రావాలని ప్రయత్నాలు..

గతంలో బిగ్ బాస్ లోకి రావాలని ఉప్పల్ బాలు చాలాసార్లు ప్రయత్నించాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా బాలును బిగ్ బాస్ నిర్వహకులే పిలుస్తారన్న టాక్ వచ్చింది కానీ.. రెండు మూడు సీజన్లుగా ఆయన వస్తున్నాడన్న ప్రచారం జరుగుతుంది కానీ.. బాలు హౌస్ లోకి రావడంలేదు. ఇక ఈసారి బిగ్ బాస్ అవకాశాన్ని తానే సాధించాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు బాలు. అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ షూటింగ్ లొకేషన్‌లో ఉప్పల్ బాలు పాల్గోన్నాడు. ఆయన షోలో కనిపించిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒకవేళ ఆయన నిజంగానే అన్ని రౌండ్లు దాటుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే.. రచ్చ రచ్చ జరుగుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

44
బిగ్ బాస్ విన్నర్ గా సామాన్యుడు..
Image Credit : instagram.com/bigbossverse

బిగ్ బాస్ విన్నర్ గా సామాన్యుడు..

ఈ సీజన్ ఆడిషన్స్ కోసం వచ్చిన వేలాది అప్లికేషన్లలో నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్లకు వివిధ స్థాయిలలో ఆడిషన్లు నిర్వహించారు. పోటీదారుల ప్రతిభను అంచనా వేయడానికి జడ్జీలు వివిధ రకాల ప్రశ్నలు, టాస్కులు ఇచ్చి పరిశీలించారు. ఈ క్రమంలో ఉప్పల్ బాలు తనదన శైలిలో జడ్జీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. జడ్జీల రోస్టింగ్, హావభావాలు, ఉప్పల్ బాలు సమాధానాలకు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. గత సీజన్లలో సామాన్యులు బిగ్‌బాస్ వేదికపై సాధించిన విజయం, చూపించిన ప్రతిభ ఈసారి అగ్నిపరీక్షపై అంచనాలను భారీగా పెంచేసింది. లాస్ట్ సీజన్ లో సామాన్యుడిగా వెళ్లిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. దీంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అనేక మంది కామనర్లు, సోషల్ మీడియా స్టార్స్, ఆడిషన్లకు పోటెత్తారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnu Priya: విష్ణుప్రియ గ్లామర్‌కు ఇంత డిమాండా? ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా భారీ మొత్తం, నిజమేనా
Recommended image2
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image3
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Related Stories
Recommended image1
School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?
Recommended image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved