- Home
- Entertainment
- Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ టాప్ 5 బెస్ట్ మూవీస్.. ఫ్లాప్ సినిమాల్లో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ టాప్ 5 బెస్ట్ మూవీస్.. ఫ్లాప్ సినిమాల్లో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్
కాజల్ అగర్వాల్ దాదాపు 2 దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇన్నేళ్ల కెరీర్ లో కాజల్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కాజల్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

Kajal Aggarwal
టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ల లిస్ట్ లో కాజల్ అగర్వాల్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. నాలుగైదు సినిమాలకు కెరీర్ ముగిసిపోయే రోజుల్లో కూడా కాజల్ దాదాపు 2 దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తోంది. ఓ దశలో టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ అని కూడా అనిపించుకుంది. ఆ స్థాయిలో ఆమెకి అవకాశాలు వచ్చాయి. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలతో నటించింది. కాజల్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
చందమామ
కాజల్ అగర్వాల్ కి కెరీర్ బిగినింగ్ లో దక్కిన తొలి సక్సెస్ ఈ చిత్రం. ఈ మూవీ టైటిల్ కాజల్ కి బిరుదుగా మారిపోయింది. కాజల్ ఈ మూవీలో తన పెర్ఫెర్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచే కాజల్ ని అభిమానులు చందమామ అని ప్రారంభించారు.
మగధీర
కాజల్ ని రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మార్చేసిన మూవీ ఇది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ యువరాణి మిత్రవిందగా అద్భుతంగా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ మూవీలో కాజల్, రాంచరణ్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.
డార్లింగ్
ఈ సినిమాకి కాజల్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రభాస్, కాజల్ మధ్య వచ్చే క్యూట్ అల్లరి సన్నివేశాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాజల్, ప్రభాస్ జోడికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఆర్య 2
ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్. కానీ కాజల్ గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ అందించింది. క్లైమాక్స్ లో ఆమె పాత్ర ఎమోషనల్ గా మారుతుంది. సినిమా మొత్తం అల్లు అర్జున్ పెట్టే ప్రేమ టార్చర్ ని భరిస్తూ కాజల్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అద్భుతం అనే చెప్పాలి.
నేనే రాజు నేనే మంత్రి
కాజల్ ని నటిగా మరో స్థాయికి చేర్చిన సినిమా ఇది. ఈ మూవీలో కాజల్ రానాకి పోటీగా నటించింది. జోగేంద్ర ని నడిపించే రాధగా కాజల్ మెస్మరైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ లో కాజల్ నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

