MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi Remake: కృష్ణ, బాలకృష్ణ సేఫ్.. పాపం రాజశేఖర్.. రీమేక్ మూవీతో ప్రకంపనలు సృష్టించిన చిరంజీవి

Chiranjeevi Remake: కృష్ణ, బాలకృష్ణ సేఫ్.. పాపం రాజశేఖర్.. రీమేక్ మూవీతో ప్రకంపనలు సృష్టించిన చిరంజీవి

Chiranjeevi Remake: చిరంజీవి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా నటించిన సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ మూవీకి పోటీగా కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 15 2026, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు రీమేక్ సినిమాలతో కూడా ప్రకంపనలు సృష్టించేవారు. ఖైదీ చిత్రం చిరంజీవిని టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మార్చేసింది. కానీ చిరంజీవి నటించిన ఓ రీమేక్ మూవీ టాలీవుడ్ లో అతడిని అధికారికంగా నంబర్ 1 హీరోగా నిలబెట్టింది. ఆ సినిమా మరేదో కాదు.. పసివాడి ప్రాణం. ఇది రీమేక్ సినిమా మాత్రమే కాదు ఒక చిన్నపిల్లాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీమేక్ పై చిరంజీవికి ఆసక్తి లేదు
Image Credit : our own

రీమేక్ పై చిరంజీవికి ఆసక్తి లేదు

'పూవిను పుతియా పొంతన్నాల్' అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా చేయమని చిరంజీవి, అల్లు అరవింద్ లకు సూచించింది. జి నారాయణరావు. ఆయన చిరంజీవి స్నేహితుడే. చిరంజీవికి ఈ సినిమా అంతగా ఆసక్తి లేదు. సినిమాలో పాటలకు ఆస్కారం లేదు. పైగా హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు. ఈ కారణాల వల్ల చిరంజీవి ఇంట్రెస్ట్ చూపించలేదు.

35
కృష్ణ కూడా వదిలేశారు
Image Credit : Youtube/@etvteluguindia

కృష్ణ కూడా వదిలేశారు

ఈ చిత్రానికి దర్శకుడిగా కోదండరామిరెడ్డి ఫిక్స్ అయ్యారు. పాటలు లేని సినిమా కథని 5 పాటలు వచ్చేలా జంధ్యాల కథలో మార్పులు చేశారు. హీరో చనిపోయే క్లైమాక్స్ ని కూడా మార్చేశారు. ఆ విధంగా చిరంజీవి ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ ప్రారంభించి చిరంజీవి చేస్తున్నాడు అని తెలుసుకుని వదిలేశారు.

45
ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసిన పసివాడి ప్రాణం
Image Credit : Asianet News

ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెట్టేసిన పసివాడి ప్రాణం

మొత్తానికి పసివాడి ప్రాణం చిత్రం 1987 జూలై 23న రిలీజ్ అయింది. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక చిన్న పిల్లాడి కథలో హీరోయిజం తగ్గకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మాస్ సాంగ్స్ ఉండేలా కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. విజయశాంతి గ్లామర్ ఈ చిత్రానికి మరో ప్లస్. ఇండస్ట్రీ రికార్డులు తుడిచిపెడుతూ ఈ చిత్రం అప్పట్లోనే 4 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తిరుపతిలో ప్రతాప్ థియేటర్ లో ప్రతి రోజూ 5 ఆటలతో 175 రోజులు ఆడిన సినిమాగా ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది.

55
కృష్ణ, బాలకృష్ణ సేఫ్ కానీ..
Image Credit : Asianet News

కృష్ణ, బాలకృష్ణ సేఫ్ కానీ..

ఈ సినిమాకు పోటీగా వారం గ్యాప్ లో కృష్ణ శంఖారావం, బాలకృష్ణ రాము చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు యావరేజ్ గా ఆడి సేఫ్ అయ్యాయి. కానీ వారం గ్యాప్ లో రిలీజ్ అయిన రాజశేఖర్ 'ఇదా ప్రపంచం' మూవీ పసివాడి ప్రాణం ధాటికి నిలబడలేకపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Subbulakshmi: రష్మిక 'ఎంఎస్ సుబ్బులక్ష్మి' బయోపిక్, మరో శంకరాభరణం గ్యారెంటీ.. జోస్యం చెప్పిన రజనీకాంత్
Recommended image2
Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్
Recommended image3
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Related Stories
Recommended image1
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image2
Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved