- Home
- Entertainment
- Youtuber Nandu: 4 వేల వీడియోతో, 120 ఛానెల్స్ మాపై దాడి చేశాయి, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన నందూస్ వరల్డ్ రమా నందన
Youtuber Nandu: 4 వేల వీడియోతో, 120 ఛానెల్స్ మాపై దాడి చేశాయి, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన నందూస్ వరల్డ్ రమా నందన
Youtuber Nandu: గత 4 నెలలుగా రకరకాల కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందిపడుతున్న ఫేమస్ యూట్యూబర్ నందూ.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. తమపై వస్తున్న ఆరోపణపై చురకలంటిస్తూనే ఆమె ట్రోలర్స్ కు ఇచ్చిపడేసింది.

నందూస్ వరల్డ్ రమా నందన రీ ఎంట్రీ..
సామాజిక మాధ్యమాలు (Social Media) మనిషిని ప్రపంచానికి దగ్గర చేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నాయో, కొన్నిసార్లు అవే వేదికలు కొందరి జీవితాల్లో అశాంతిని, మనశ్శాంతిని దూరం చేయడంలోనూ ముందుంటున్నాయి. తాజాగా ప్రముఖ యూట్యూబర్.. ‘నందుస్ వరల్డ్’ (Nandu's World) నిర్వాహకులు రమ నందన పరిస్థితి కూడా అలానే అయ్యింది.
యూట్యూబర్ గా తాను సంపాదించుకున్న పేరు.. తన ప్రపంచం అంతా ఒక్క సారిగా తలకిందులయ్యింది. గత నాలుగు నెలలుగా ఛానెల్ జోలికి వెళ్లకుండా.. కేసుల హడావిడిలో ఉన్నా నందు.. తాజాగా సోషల్ మీడియాలో తమపై వస్తున్న తప్పుడు ప్రచారాలు, చెడు వార్తల గురించి స్పందిస్తూ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి "అందరూ బాగున్నారా?" అని పలకరించడం వెనుక ఉన్న ఆవేదనను ఆమె షేర్ చేసుకుంది.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక వ్యక్తిగత ప్రపంచం, కుటుంబం, సంతోషాలు, సమస్యలు ఉంటాయి. అయితే, సోషల్ మీడియాలో కొందరు తమ వ్యక్తిగత అనుభవాలు, అభిరుచులను పంచుకుంటూ వీడియోలు చేస్తుంటారు. ‘నందుస్ వరల్డ్’ ఛానెల్ ద్వారా యూట్యూబర్ నందు కూడా దాదాపు 620కి పైగా వీడియోలను చేసింది.
ఆమె మాట్లాడుతూ.. '' మేమ ఎలాంటివారం, మా కుటుంబం, బ్యాక్ గ్రౌండ్, ఎంత కష్టపడి పైకి వచ్చాం అనేది 600 కు పైగా వీడియోస్ ద్వారా చెప్పుకొచ్చాను. కానీ ఈ నాలుగు నెలల్లోనే దాదాపు 4000 కు పైగా వీడియోలు, 120 పైగా సోషల్ మీడియా ఛానెల్స్ తమ గురించి తప్పుడు సమాచారంతో ఎన్నో తప్పుడు వార్తలు, రూమర్లు ప్రచారం చేశారు. '' అని నందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికి సమాధానం చెప్పాలి?
ఎలాంటి ఆధారాలు లేకుండా, వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా వచ్చే ప్రశ్నలకు అందరికీ సమాధానం చెప్పుకోవడం ఎవరికైనా సాధ్యం కాదని నందు అభిప్రాయపడ్డారు. మన గురించి బాగా తెలిసిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు లేదా ఏదైనా అధికారిక సంస్థ ప్రశ్నిస్తే వివరణ ఇచ్చుకోవడంలో అర్థం ఉంది. కానీ, పరిచయం లేని ఎవరెవరో మా పర్సనల్ విషయాలు.. అది కూడా బెడ్ రూమ్ లో మేం మాట్లాడుకునేవి, ఆస్తులు, సంపాదన, సీక్రెట్స్ అన్నింటికి స్పందించలేమని, అలాగని మౌనంగా ఉంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని నందన వాపోయారు.
నిజం ఎప్పటికీ నిలబడుతుంది
"ఎవరికి ఏది అనిపించినా, ఏది నమ్మాలనిపిస్తే అది నమ్ముతారు; కానీ నిజం ఏంటో, రైట్ ఏంటో మాకు తెలిస్తే చాలు" అనే భావనతో ముందుకు వెళ్తున్నట్లు నందు తెలిపారు. జీవితంలో ఎన్నో అనుభవాలు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ తమ దారిలో తాము ప్రయాణిస్తున్నామని, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను చూసి ఎవరూ తొందరపడి తప్పుడు నిర్ణయాలకు రావద్దని, ఇతరుల వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఈ వీడియో ద్వారా యూట్యూబర్ నందు అన్నారు.
నందూస్ వరల్డ్ వివాదం ఏంటి?
యూట్యూబర్ నందనకు ఉన్న ఫాలోయింగ్ ను ఉపయోగించి లండన్‌లో ఉద్యోగాలు, వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామంటూ నందన ఆమె భర్త పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వర్క్ పర్మిట్‌లకు సంబంధించి ‘స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్’ వీసాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. నందన తన భర్త లండన్‌లో వర్క్ పర్మిట్లు మంజూరు చేసే పలు సంస్థలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మోసపూరిత నెట్‌వర్క్ బాధితులు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలతో పాటు రాజస్థాన్, గుజరాత్, బిహార్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా ఈ దంపతుల మాటలు నమ్మి డబ్బులు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 50 మందికి పైగా అభ్యర్థులు వీరి చేతిలో మోసపోయినట్లు సమాచారం.
రీసెంట్ గా ఇండియా వచ్చిన నందుని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. ఆతరువాత బెయిల్ పై ఆమె విడుదల అయ్యారు. ఇక ప్రస్తతుం ఈ విషయం కోర్టు పరిదిలో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. నందు మాత్రం నాలుగు నెలలు తరువాత రీసెంట్ గా తిరిగి వీడియోలు స్టార్ట్ చేసింది.
