MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్ కామెంట్స్.. ధురంధర్ 2 చూసిన ఆమె ఏమని పోస్ట్ చేసిందంటే?

రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్ కామెంట్స్.. ధురంధర్ 2 చూసిన ఆమె ఏమని పోస్ట్ చేసిందంటే?

రణ్‌వీర్ సింగ్ నటనకు కాజల్ అగర్వాల్ ఫిదా అయ్యారు. ' ధురంధర్ 2 లో రణ్‌వీర్ చేసిన మ్యాజిక్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నానని, అతని నటన, కష్టం అద్భుతమని ప్రశంసించారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధురంధర్ : ది రివెంజ్ సంచలనం..
Image Credit : Instagram

ధురంధర్ : ది రివెంజ్ సంచలనం..

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ : ది రివెంజ్' సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. సినీ ప్రముఖుల మనసులను కూడా గెలుచుకుంటోంది. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమా మేకింగ్, రణ్‌వీర్ నటనకు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా చేరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ధురంధర్ : ది రివెంజ్ పై కాజల్ రివ్యూ..
Image Credit : Instagram

ధురంధర్ : ది రివెంజ్ పై కాజల్ రివ్యూ..

ఇటీవల 'ధురంధర్ 2' సినిమా చూసిన కాజల్ అగర్వాల్, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సినిమాపై చాలా ఎమోషనల్ రివ్యూను పంచుకున్నారు.సినిమాలోని ప్రతీ అంశాన్ని ఆమె ప్రశంసించారు. 'ధురంధర్ : ది రివెంజ్... ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి, ఈ సినిమా మీ మనసు లోతుల్లోకి వెళ్లనివ్వండి' అని రాస్తూ సినిమా తీవ్రతను వివరించారు.

36
రణ్‌వీర్ సింగ్ నటనకు  ఫిదా
Image Credit : Instagram

రణ్‌వీర్ సింగ్ నటనకు ఫిదా

ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నటనకు కాజల్ ఫిదా అయ్యారు. 'రణ్‌వీర్, ఈ సినిమాలో మీరు చేసిన మ్యాజిక్ నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నా. మీ పాత్రలోని తీవ్రత, భావోద్వేగాలు, మీ కష్టం అద్భుతం. సినిమాపై మీకున్న ప్యాషన్ ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. జస్‌కిరత్, హమ్జా పాత్రలు మాతో పాటు చాలా కాలం ఉంటాయి. మీరు మా తరం నిజమైన లెజెండ్' అని రణ్‌వీర్‌ను ఆమె ప్రశంసించారు.
46
డైరెక్టర్ గురించి ఏమంటుందంటే?
Image Credit : Instagram

డైరెక్టర్ గురించి ఏమంటుందంటే?

కాజల్ కేవలం రణ్‌వీర్‌నే కాదు, మొత్తం చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఆర్. మాధవన్ పాత్రలోని 'ప్రశాంతమైన శక్తి', 'అధికారయుత నటన'ను ఆమె మెచ్చుకున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి మాట్లాడుతూ, 'ఇది సినీ ప్రియులకు దొరికిన అతిపెద్ద సినిమాటిక్ ఎక్స్‌టసీ ప్రో మాక్స్. మొదటి భాగం మరపురానిది అయితే, రెండో భాగం మనల్ని భావోద్వేగాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీరు సినిమా నాణ్యతను మరో స్థాయికి తీసుకెళ్లారు' అని అన్నారు.
56
యామీ గౌతమ్ గురించి మాట్లాడుతూ..
Image Credit : Instagram

యామీ గౌతమ్ గురించి మాట్లాడుతూ..

ఈ సినిమాలో నటించిన యామీ గౌతమ్ 'ప్రభావవంతమైన నటన', సారా అర్జున్ 'చార్మింగ్ పెర్ఫార్మెన్స్'ను కూడా కాజల్ మెచ్చుకున్నారు. శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం గురించి చెబుతూ, 'సంగీతం సినిమాకు కేవలం సపోర్ట్ ఇవ్వడమే కాదు, ఆ సినిమాలోనే జీవిస్తుంది' అని రాశారు.
66
700 కోట్ల కలెక్షన్స్..
Image Credit : Instagram

700 కోట్ల కలెక్షన్స్..

గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్ ' మొదటి భాగం లాగే, 'ధురంధర్ : ది రివెంజ్' కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.700 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. సెలబ్రిటీల ప్రశంసలు సినిమా విజయానికి మరింత ఊపునిస్తాయని సినీ నిపుణులు అంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
5 రోజుల్లో 800 కోట్లు.. ధురంధర్ 2 సినిమా చూసి రజినీకాంత్ ఏమన్నారంటే?
Recommended image2
చిరంజీవి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? కటౌట్ చూసి షాక్ అయిన మెగాస్టార్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved