MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: అభిమన్యుని రెచ్చగొట్టిన కైలాష్.. మాలిని మాటలకు బాధపడిన యష్?

Ennenno Janmala Bandham: అభిమన్యుని రెచ్చగొట్టిన కైలాష్.. మాలిని మాటలకు బాధపడిన యష్?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 25 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Nov 25 2022, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో మాలిని పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వస్తుంది. అప్పుడు వేదకి హారతి తీసుకోగా మాలిని ఏ ఆటంకం లేకుండా నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్ గా సాధించాలి అని అంటుంది. అప్పుడు వేద అత్తయ్య ఏ ఆడదానికి కూడా రాని సిచువేషన్ నాకు వచ్చింది తాళి కట్టిన భర్త మీదే పోరాటం చేయాల్సిన పరిస్థితి నాది అని అంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే ఆ తప్పని కప్పపుచ్చుకోవడానికి మోసం చేస్తూ వారిని బయట పడేయాలి అనుకోవడం ఇంకా పెద్ద తప్పు అని అంటుంది వేద. అటువంటి నేరస్థులకు న్యాయస్థానంలో కచ్చితంగా శిక్ష పడి తీరాలి అని అంటుంది వేద.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన మా అమ్మకు న్యాయం జరిగి తీరాలి దానికి మీ సపోర్ట్ కావాలి అని అనడంతో ఇంతలో అక్కడికి యష్ వస్తాడు. అప్పుడు యష్ అమ్మ ఈరోజు నాకు చాలా కీలకమైన రోజు ఈ కేసులో నేను గెలవాలి గెలిచి తీరాలి అని అంటాడు. అందుకు నాకు నీ దీవెనలు కావాలి అని యష్ మీద ఇద్దరు మాలిని ఆశీస్సులు తీసుకుంటారు. అప్పుడు మాలిని ఏ తల్లికి రాకూడని కష్టం నాకు వచ్చింది అని బాధపడుతూ వారిని దీవిస్తుంది. ఇప్పుడు వేద యష్ ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కోర్టుకి బయలుదేరగా ఇంతలో సులోచన ఎదురు పడుతుంది.
 

35

అప్పుడు యష్ నన్ను క్షమించండి అత్తయ్య మీకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పి ఇప్పుడు మీకు ఆపోజిట్ గా ఫైట్ చేస్తున్నాను అని యష్ అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వస్తుంది. అప్పుడు సులోచన ఆశీస్సులు తీసుకుంటాడు యష్. తర్వాత అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు. మరొకవైపు అభిమన్యు మాళవిక మీద కోపంతో రగిలిపోతూ నేను నేను నెత్తిన పెట్టుకున్నాను అలాంటిది ఈరోజు నేను నీకు పనికిరాకుండా పోయాను ఆ యష్ గాడు నిన్ను కాపాడుతాడా అనుకోని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి అభిమన్యుని రెచ్చగొడుతూ ఉంటాడు.
 

45

అప్పుడు అభిమన్యు కోపంతో రగిలిపోతూ ఉండగా మాళవిక గురించి మరింత బ్యాడ్ గా చెబుతూ అభిమన్యుని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు కైలాష్. మరొకవైపు వేద వాళ్లు కోర్టు దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు యష్ అక్కడికి వచ్చి మీరందరూ ఎందుకు చిత్రా అని అడగగా మా కోడలిని సపోర్ట్ చేయడానికి వస్తున్నాము అని అంటుంది మాలిని. సరే వెళ్దాం పదండి అందరూ కోర్టు కే కదా అని అనగా మాలిని అవసరం లేదు చిత్రాన్ని క్యాబ్ బుక్ చెయ్ అని అంటుంది. ఆ తర్వాత క్యాబ్ లు అన్ని బిజీ వస్తుండడంతో తప్పక యష్ కార్ లో అందరూ కలిసి కోర్టుకు వెళ్తారు.
 

55

వేద చీర కారుకీ తగులుకోవడంతో అప్పుడు యష్ వచ్చి దానిని తీసేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వేద యష్ ని పిలిచి కోర్టులో ఈరోజు జరిగే ఈ సంఘటన వల్ల మన మధ్య దూరం రాదు అని నాకు మాట ఇవ్వండి అని అంటుంది. ఇప్పుడు యష్ మాట ఇవ్వబోతుండగా ఇంతలోనే మాళవిక అక్కడికి వస్తుంది. దాంతో యష్ వేదకి మాట ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra Photos: వారణాసి షూటింగ్ బ్రేక్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న పని ఇదే..ఇంటర్నెట్ లో తుఫాన్
Recommended image2
Peddi Movie: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు ?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved