- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: యష్ కి ఊహించని గిఫ్ట్ పంపించిన కైలాష్.. మ్యారేజ్ జర్నీ ఆపేద్దామంటూ షాకిచ్చిన యష్!
Ennenno Janmala Bandham: యష్ కి ఊహించని గిఫ్ట్ పంపించిన కైలాష్.. మ్యారేజ్ జర్నీ ఆపేద్దామంటూ షాకిచ్చిన యష్!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో మంచి రేటింగ్ ని ఇస్తున్నారు ప్రేక్షకులు. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయినప్పటికీ తన సొంతం చేసుకోవాలనుకుంటున్న ఒక సైకో కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీ ఫస్ట్ యానివర్సరీ లాస్ట్ యానివర్సరీ కావాలి అనుకుంటూ బ్యానర్ కి నిప్పు పెట్టేస్తాడు విన్ని. బ్యానర్ కి మంటలు అంటుకోవటంతో వేద పరిగెత్తుకొని వచ్చి ఆ మంటలను చేత్తో ఆపుతుంది. అక్కడ ఉన్నవాళ్లు వారిస్తున్నా ఊరుకోదు. మంటలు ఆరిపోయిన తర్వాత చూస్తే ఆమె చేతులు బొబ్బలెక్కి ఉంటాయి.
ఇలా ఎవరైనా చేతులతో మంటల్ని ఆర్పుతారా పోతే ఫ్లెక్సీ పోతుంది లేకపోతే ఇంకొకటి తెచ్చి పెడతాము అంతేకానీ ఇలా చేస్తావా అంటూ ప్రేమగా ఆమె చేతికి ఐస్ క్యూబ్స్ రాస్తాడు యష్. ఒకప్పుడు వేద అయితే అలాగే ఆలోచించేది కానీ ఇప్పుడు వేద వేరు. మనసుతో చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి బంధం అనుబంధం అంటే ఏంటో అర్థమైంది.
ఇప్పటి వేద మనసుతో ఆలోచిస్తుంది అందుకే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. నీకు సంబంధించిన ప్రతిదీ నాకు వ్యాల్యుబుల్ అది ఫ్లెక్సీ అయినా ఇంకా ఏదైనా కూడా అన్నింటినీ కాపాడుకునే బాధ్యత నాది వేద. ఓకే మమ్మీ సేఫ్ కాబట్టి ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం అంటూ ముందు ఖుషి డాన్స్ చేస్తుంది తర్వాత వేద దంపతులు డాన్స్ చేస్తారు.
మరోవైపు కైలాష్ ఏ వేద కోసమైతే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావో అదే వేద నీ జీవితంలో లేకుండా చేస్తాను. నాకు లేని సంతోషం నీకు మాత్రం ఎందుకు అంటూ మార్ఫింగ్ చేసిన ఫోటోలని ఒక వ్యక్తికి ఇచ్చి యష్ చేతికి ఇమ్మంటాడు. ఆ వ్యక్తి యష్ దగ్గరికి వచ్చి మీకు కొరియర్ వచ్చింది అంటూ ఫొటోస్ వున్న కవర్ ని ఇస్తాడు. కానీ ఫంక్షన్ హడావుడిలో ఉన్న యష్ వాటిని తన రూమ్ లో ఉన్న మంచం మీద పెట్టి ఆలోచనలో పడతాడు.
గడిచిన ఈ సంవత్సరం లో ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్లుగా సాగింది మన ప్రయాణం. కానీ ఇకమీదట అలా ఉండకూడదు మన గమ్యం మన గమనం ఒకటే అవ్వాలి అనుకుంటాడు. ఇంతలో వసంత్ వచ్చి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ వేద వదిన నీకోసం రెడీ చేసింది. ఆక్చువల్ గా తనే నీకు స్టేజ్ మీద ఇవ్వాలి కానీ నేను చూసేసాను. నీకు చూపించకుండా ఉండలేకపోయాను అందుకే తీసుకొచ్చేసాను అంటూ యష్ కి ఆ ఫోటో చూపిస్తాడు. ఈ సంభాషణ అంతా అనుకోకుండా వేద వింటుంది. నాకోసం ఎంత మంచి గిఫ్ట్ రెడీ చేసింది. ఇంతకంటే మంచి రిటర్న్ గిఫ్ట్ తనకి నేను ఏమీ ఇవ్వగలను. స్టేజ్ మీద అందరి ముందు నాలుగు మంచి మాటలు చెప్పటం తప్ప.
నాది ఎంత అదృష్టం వేద నా లైఫ్ లోకి వచ్చాక నేను బెస్ట్ సీఈఓని అయ్యాను. ఖుషి కూడా చాలా అదృష్టవంతురాలు వేద లాంటి అమ్మ దొరికింది తనకి. నా అదృష్ట దేవత వేద అంటూ ఎమోషనల్ అవుతాడు. ఈ మాటలు అన్ని విన్న వేద చాలా సంతోషపడుతుంది. మ్యారేజ్ సర్ మేడిన్ హెవెన్ అంటారు మీ ఇద్దరు విషయంలో అది నిజమే. నువ్వు వదిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాడు వసంత్. త్వరగా వచ్చేయి అంటూ వసంత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫోటోని చూస్తూ ఎస్ అలాగే ఉండిపోతాడు. యష్ని చూస్తూ వేద ఉండిపోతుంది.
ఇక ఈయన నా మీద చూపించే ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అనుకుంటూ ఆనందంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు స్టేజ్ మీదకి వచ్చిన యష్ రెడ్ రోజెస్ వేదకి ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యు చెప్తాడు. ఎమోషనల్ అయిన వేద మరొకసారి అంటుంది. ఐ లవ్ యు డాక్టర్ పండితారాధ్యుల వేదాస్విని అంటాడు యష్. అవి తీసుకున్న వేద తను కూడా ఒక రెడ్ రోజ్ ఇచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు అని చెప్పి ఐ లవ్ యు చెప్తుంది.
ఇంకోసారి చెప్పు అంటాడు యష్. ఐ లవ్ యు మలబార్ యశోదర్ గారు అంటూ ఫ్లవర్ చేతికి ఇస్తుంది. తరువాయి భాగంలో వేద వేసిన దండని తీసి పడేసి ఈ జర్నీని ఇంక ఇక్కడితో ఆపేద్దాము లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడడం నాకు చేతకాదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. అతని ప్రవర్తనకి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు.