- Home
- Entertainment
- Karthika Deepam: సూపర్ ట్విస్ట్.. తింగరి గురించి నిజం తెలుసుకున్న శౌర్య.. స్టేజిపైనే హిమను కొట్టిన జ్వాల!
Karthika Deepam: సూపర్ ట్విస్ట్.. తింగరి గురించి నిజం తెలుసుకున్న శౌర్య.. స్టేజిపైనే హిమను కొట్టిన జ్వాల!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నిరుపమ్ మాట్లాడుతూ హిమ ఎందుకు ఇంత బాధగా ఉన్నావ్.. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటాడు. అతర్వాత కొబ్బరి బొండాలు అతనికి డబ్బులు ఇవ్వాలని వెళ్తే శౌర్య ఇచ్చిన నోటును ఇస్తే తిరుకోరు.. ఈ నోట్ ఎన్ని సార్లు ఇవ్వాలని చూసిన వదలడం లేదని శౌర్యను ఇన్ డైరెక్ట్ గా అంటాడు.
ఇక మరో సీన్ లో శోభ బ్యాంక్ వాళ్ళని రిఖ్వెస్ట్ చేస్తుంటుంది.. లోన్ అంత క్లియర్ చేస్తాను కొంచం టైమ్ ఇవ్వండి అని రిఖ్వెస్ట్ చేస్తే.. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీ అస్పత్రి సీల్ చేస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అతర్వాత సీన్ లో ఏంటో ఈ బ్యాంక్ లోన్స్ అన్ని పెద్ద తలనొప్పిగా మారాయి.. నిరుపమ్ ను పెళ్లి చేసుకుంటే తప్ప సమస్యలు తిరేలా లేవు కానీ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తుంది.
ఇక తర్వాత సీన్ లో హిమను సౌందర్య హైదరాబాద్ క్లబ్ అవార్డు ఫంక్షన్ కు తీసుకొస్తుంది. ఎందుకు నానమ్మ తీసుకోచ్చావ్ అని అడిగితే అందిరిలో కలవాలి లేదంటే నిల తయారవుతారు అని సౌందర్య అంటుంది. నీకు అవార్డు వస్తుందిలే హిమ అని ఆనంద్ రావు అంటే నాకు శౌర్య ఇంటికి రావడమే కావాలి ఇంకేం వద్దు అని హిమ అంటుంది. అందుకే కదా నిన్ను ఇక్కడికి తీసుకోచ్చింది అని చెప్తారు.
ఇక తర్వాత వాళ్ళను ఇన్వైట్ చేసి ముందు కూర్చోబెడుతారు. హైదరాబాద్ క్లబ్ అవార్డు ఫంక్షన్ మొదలవుతుంది. ఆనంద్ రావు, సౌందర్యలే ఆ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ లు.. అవార్డు తీసుకునేది కూడా ఆమె మనవరాలు జ్వాలానే అనే విషయం ఎవరికి తెలియదు. సౌందర్య స్పీచ్ ఇస్తున్న సమయంలోనే శౌర్య సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళని చూసి వీళ్ళు వచ్చారు ఏంటి అనుకుంటూ వెళ్తుంది.
హిమను చూసి ఇది వచ్చింది ఏంటి అని శౌర్య అనుకోని వెనక్కు వెళ్ళిపోవాలి అనుకుంటుంది.. కానీ నేను ఎందుకు భయపడాలి అని మళ్లీ అక్కడే కూర్చుంటుంది. అతర్వాత శౌర్యను చూసి ఇక్కడకు ఎందుకు వచ్చిందని ఆనంద్ రావు, సౌందర్య అనుకుంటారు. అతర్వాత ఒకొక్కరికి సౌందర్య అవార్డు ఇస్తుంటుంది. అప్పుడు శౌర్య చేసిన గొప్ప పని చెప్పి అవార్డు తీసుకోడానికి రావాలని పిలుస్తారు.
అది చూసిన హిమ ఆనంద పడుతుంది. వావ్ గ్రేట్.. శౌర్యకు అవార్డు ఇస్తున్నారా అని ఆనందిస్తుంది. నేను అవార్డు ఇచ్చేది నా మానవరాలికే అయిన చెప్పుకోలేని పరిస్థితి అని సౌందర్య ఫీల్ అవుతుంది. ఇక తర్వాత శౌర్య తన ఫ్రెండ్ అని చెప్పి తెగ పొగిడేస్తుంది. నానమ్మ అని పిలిపించుకోవాలని ఉన్నా ఫ్రెండ్ లా సీనియర్ సిటిజన్ అని ముద్దుగా పిలుస్తుంది అని సౌందర్య చెప్తుంది.
అయితే సరిగ్గా అవార్డు ఇచ్చే సమయానికి మేడమ్ మీరు ఈ అవార్డు ఇవ్వడం లేదు.. వేరే వారు ఇస్తారని చెప్పి.. డాక్టర్ అని హిమను పిలుస్తారు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అక్కడే ఉన్నా శౌర్య సీరియస్ లుక్ ఇస్తుంది. హిమనే సీరియస్ గా చూస్తూ ఉంటుంది.. అప్పుడే హిమ ఎవరో అక్కడ చెప్పేస్తారు. హిమ సౌందర్య మనవరాలు అని తెలుసుకున్న శౌర్య షాక్ అవుతుంది.
ఇదేంటి ఇలా జరిగింది.. ఇన్నాళ్లు ఏది జరగకూడదు అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది అని హిమ ఫీల్ అవుతుండగా స్టేజిపైనే శౌర్యకి ఒక్కటి ఇస్తుంది. నువ్వు హిమవా.. ఇన్నాళ్లు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. శౌర్య అది అంటే.. చంపేస్తాను.. నా పక్కనే ఉంటావ్.. నా స్టోరీ వింటావ్.. నా ప్రేమను లాగేసుకుంటావ్ అని కన్నీళ్లు పెడుతుంది.. నా డాక్టర్ సాబ్ ని దూరం చేస్తావ్.. పెళ్లి చేసుకుంటావ్.. నువ్వు మహా మోసగత్తేవే అని తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.