- Home
- Entertainment
- సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Pawan Kalyan: ఓజీ చిత్రం హిట్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ సుజీత్ కి కారు గిఫ్ట్ గా ఇవ్వలేదు. దీని వెనుక ఎంతో ఎమోషనల్ కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

ఓజీతో పవన్ అభిమానులు ఖుషీ
హరి హర వీరమల్లు చిత్రంతో పవన్ అభిమానులు నిరాశ పడ్డప్పటికీ ఓజీతో ఫుల్ ఖుషీ అయిపోయారు. ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని సుజీత్ ప్రజెంట్ చేసిన విధానం, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ తో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘనవిజయం సాధించిన ఓజీ చిత్రం టాలీవుడ్ లో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
సుజీత్ కి పవన్ గిఫ్ట్
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజీత్ కి ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి సుజీత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు అని అంతా భావించారు. కానీ అసలు నిజం అది కాదు. దాని వెనుక సుజీత్ త్యాగం, ఎంతో ఎమోషనల్ అనిపించే కారణం ఉంది.
జపాన్ లో షూటింగ్
ఓజీ షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాలని జపాన్ లో చిత్రీకరించాలని సుజీత్ అనుకున్నారు. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా నిర్మాణ సంస్థ ఫారెన్ షెడ్యూల్ కి అంగీకరించలేదు. కానీ సుజీత్ మాత్రం చాలా గట్టిగా కమిటయ్యారు. ఆ సీన్లు చిత్రీకరిస్తేనే సినిమాకి పర్ఫెక్ట్ ఫినిష్ ఉంటుందని భావించాడు. దీనితో పెద్ద త్యాగానికి సిద్దమయ్యాడు.
సుజీత్ చేసిన త్యాగం ఇదే
జపాన్ షెడ్యూల్ ఖర్చుల కోసం తనకున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని సుజీత్ అమ్మేశారు. ఆ డబ్బుతోనే జపాన్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ దశలో తెలిసింది. సినిమా కోసం కమిట్మెంట్ తో ఇంత త్యాగం చేసిన సుజీత్ పట్ల పవన్ కి అభిమానం పెరిగింది. అందుకే అదే మోడల్ వాహనాన్ని పవన్ సుజీత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఈ కారుకి సంబంధించిన ఈఎంఐ లని పవన్ కళ్యాణ్ చెల్లిస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
