- Home
- Entertainment
- Karthika Deepam: 'నిరుపమ్'తో ప్రేమలో పడ్డ శౌర్య.. జ్వాలా చేతిపై పచ్చబొట్టు చూసిన హిమ?
Karthika Deepam: 'నిరుపమ్'తో ప్రేమలో పడ్డ శౌర్య.. జ్వాలా చేతిపై పచ్చబొట్టు చూసిన హిమ?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం(Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌందర్య,ఆనంద్ రావు లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సౌందర్య(soundarya),ఇంటికి జ్వాలా వస్తుంది. లక్ష్మి అనే ఆమె సౌందర్య ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. అయితే ఆమె ఆటోలో ఏదో భాగం మర్చిపోవడంతో బ్యాగును తిరిగి ఇవ్వడానికి జ్వాల(jwala)సౌందర్య ఇంటి వరకు వెళుతుంది. కానీ అక్కడే ఉన్న కార్తీక్, దీప ల ఫోటోలు చూడకుండా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత బ్యాగ్ తిరిగి ఇచ్చినందుకు సౌందర్య ఎవరో మంచి అమ్మాయిలా ఉంది అని జ్వాలా ని పోగొడుతుంది. ఆ తరువాత సౌందర్య, ఆనందరావు లు హిమ(hima) గురించి ఆలోచిస్తూ స్వప్న(swapna) అన్న మాటలకు హిమ బాధపడుతోంది అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు ప్రేమ్ ఫోన్ లో హిమ ఫొటో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు.
హిమ ఫోటోని చూస్తూ హిమ(hima) ని పొగుడుతూ ఉంటాడు. మరొకవైపు జ్వాల నిరూపమ్(nirupam) ని తలచుకుని ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి రావడంతో నిరూపమ్ అనుకోని డాక్టర్ సాబ్ అని పిలుస్తూ చెయ్ పట్టుకొని పిలుచుకుని వచ్చి ఆటోలో కూర్చోబెడుతుంది.
ఇదంతా నా భ్రమ అని ఆ తర్వాత జ్వాలా అనుకుంటుంది. రోడ్ లో ఎవరు వెళ్తున్నా కూడా అందరిని డాక్టర్ సాబ్ అని పలకరిస్తూ ఉంటుంది. అవును నేను ఎందుకు ఇంతలా డాక్టర్ సాబ్ గురించి ఆలోచిస్తున్నాను అంటూ తనలో తానే మురిసి పోతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ గుర్తుతెచ్చుకొని హిమ(hima) నిన్ను వదిలిపెట్టేది లేదు అని అంటుంది.
మరొకవైపు నిరూపమ్, హిమ(hima) కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. హిమ బస్తిలో మెడికల్ క్యాంపు ని ఎందుకు ఏర్పాటు చేసావు అని నిరూపమ్ అడగగా అది నా స్వార్థం కోసమే బావ అని అంటుంది హిమ. సౌర్య(sourya) వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నీకు తెలుసు కదా బావ అని అంటుంది.
అప్పుడే మొత్తం తన ఫ్లాష్ బ్యాక్ గురించి నిరూపమ్ కి వివరిస్తుంది సౌర్య. ఇద్దరూ కారులో వెళుతూ సౌర్య ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు జ్వాల పద్ధతిగా చీర కట్టుకొని బస్తి లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు దగ్గరికి వెళుతుంది.
అక్కడ సౌర్య(sourya) చేతి పై ఉన్న పచ్చబొట్టు ని చూసి ప్రేమ్,నిరూపమ్ ఎవరు అని అడగగా, నా శత్రువు అని అనడంతో అది విన్న హిమ(hima) షాక్ అవుతుంది. అంటే జ్వాలా,సౌర్య ఒకటే అని హిమ కి తెలిసిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.