- Home
- Entertainment
- Karthika Deepam: జ్వాలా సూపర్ ప్లాన్.. భర్తతో మ్యారేజ్ డే జరుపుకునేందుకు ఒప్పుకున్న స్వప్న!
Karthika Deepam: జ్వాలా సూపర్ ప్లాన్.. భర్తతో మ్యారేజ్ డే జరుపుకునేందుకు ఒప్పుకున్న స్వప్న!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 6వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రేమ్ (Prem) అమ్మ నాన్న కలిస్తే హిమను పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ అని అనుకుంటాడు. ఇక ప్రేమ్ హిమకు ఫోన్ చేసి రమ్మంటాడు. మరోవైపు సౌందర్య (Soundarya) సత్యం స్వప్నల పరిస్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత హిమ (Hima), నిరూపమ్, ప్రేమ్ లు తింటూ ఉండగా జ్వాల వాళ్ళకు వడ్డీస్తుంది. ఆ క్రమంలో నిరూపమ్ ఇలా మనం అందరం కలిసి తిన్నట్టే.. మమ్మీ డాడీ లతో కలిసి తినాలి అని ప్రేమ్ తో అంటాడు. ఇక ఈలోపు సత్యం వచ్చి జ్వాల (Jwala) అన్నం పెడుతుంది రా.. బంగారం అంటూ పొగుడుతాడు.
ఇక ప్రేమ్ (Prem) ఎక్కువయిందా.. బంగారం బంగారం అని అంటున్నావ్ అని సత్య ను అంటాడు. ఇక ఫుల్ గా తాగేసిన సత్య నేను వెళ్తున్నాను అందరూ కడుపునిండా తినండి అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జ్వాలా నిరూపమ్ (Nirupam) కి తనకి పెళ్లైనట్టు ఊహించుకుంటుంది.
ఆ తర్వాత నిరూపమ్ (Nirupam) మమ్మీ డాడీల మ్యారేజ్ యానివర్సరీ రూపంలో వాళ్ళిద్దర్నీ కలిపితే మనం భవిష్యత్తులో ఆనందంగా ఉంటామని అంటాడు. ఈ విషయం గురించి ప్రేమ్, హిమ (Hima) లు సౌందర్య తో కూడా చర్చిస్తారు. ఈ ఫంక్షన్ ని అడ్డుపెట్టుకొని హిమకు ఐ లవ్ యూ చెప్పాలని ప్రేమ్ అనుకుంటాడు.
ఇక జ్వాల (Jwala) చిత్తు పేపర్లు కొనడానికి వెళ్లగా.. అక్కడ తన ఆటలో ఒక వ్యక్తి తన డబ్బులు కొట్టేస్తాడు. అది గమనించిన సౌందర్య (Soundarya) డబ్బు లాక్కొని జ్వాల కు చెబుతుంది. ఇక జ్వాల ఆ వ్యక్తి ని గట్టిగా లాగి చెంపమీద కొడుతుంది.
ఇక తరువాయి భాగం లో జ్వాల (Jwala) చిత్తు కాగితాలు తీసుకుని వెళుతుండగా అక్కడ జ్వాలా చిత్రం ఉంటుంది. ఇక నిరూపమ్ వాళ్ళ అమ్మకు వెడ్డింగ్ అనివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతాడు. దీనికి అమ్మమ్మ నాన్న అందరూ ఉండాలి అనగా స్వప్న (Swapna) వాళ్ళిద్దరు పేర్లు చెప్పగానే మండిపడుతుంది
ఆ తర్వాత మ్యారేజ్ డే ఫంక్షన్ ను జ్వాల (Jwala) మా బస్తీలో జరుపుతాను అని అంటుంది. దాంతో సప్న ఛీ ఛీ.. నేను చెబుతున్నాను మా మ్యారేజ్ డే ఫంక్షను నా కొడుకు జరుపుతాడు అని నిరూపమ్ ను అంటుంది. ఇక జ్వాల మీద కోపం తో స్వప్న (Swapna) ఆ విధంగా ఫంక్షన్ ను యాక్సెప్ట్ చేస్తుంది