MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Buchibabu: ఎన్టీఆర్‌కి కథ చెబితే, ఎక్కడ దొబ్బేశావ్‌ అన్నాడు.. బుచ్చిబాబుకి ఫ్యూజులు ఎగిరిపోయే సంఘటన

Buchibabu: ఎన్టీఆర్‌కి కథ చెబితే, ఎక్కడ దొబ్బేశావ్‌ అన్నాడు.. బుచ్చిబాబుకి ఫ్యూజులు ఎగిరిపోయే సంఘటన

`పెద్ది` దర్శకుడు బుచ్చిబాబు పేరు ఇప్పుడు ఇండియా వైడ్‌గా వినిపిస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌ విషయంలో ఆయనకు ఎదురైన ఒక సంఘటనని పంచుకున్నారు బుచ్చిబాబు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 05 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్దితో సంచలనంగా మారిన దర్శకుడు బుచ్చిబాబు
Image Credit : stockPhoto

పెద్దితో సంచలనంగా మారిన దర్శకుడు బుచ్చిబాబు

దర్శకుడు బుచ్చిబాబు.. `పెద్ది` సినిమాతో నేషనల్‌ వైడ్‌గా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. `పెద్ది` సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిదని చెప్పొచ్చు. రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శివ రాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు, జాన్‌ విజయన్‌ వంటి వారు నటించారు. ఈ గురువారం ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. దీనికి మిక్స్ డ్‌ టాక్‌ వచ్చిన తొలి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఈ వీకెండ్‌ వరకు మంచి వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉప్పెనతో స్టార్స్ అయిన వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి, బుచ్చిబాబు
Image Credit : our own

ఉప్పెనతో స్టార్స్ అయిన వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి, బుచ్చిబాబు

బుచ్చిబాబుకి `పెద్ది` రెండో చిత్రం. మొదట ఆయన `ఉప్పెన` మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించింది. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇది అటు వైష్ణవ్‌ తేజ్‌కి, ఇటు కృతి శెట్టికి మొదటి సినిమా కావడం విశేషం. ఒక్క మూవీతో వీరిద్దరు స్టార్స్ అయిపోయారు. ఈ సినిమా బుచ్చిబాబుకి కూడా ఫస్ట్ మూవీనే. దీంతో ఆయన కూడా స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడని చెప్పొచ్చు.

35
ఆగిపోయిన ఎన్టీఆర్‌, బుచ్చిబాబు మూవీ
Image Credit : our own

ఆగిపోయిన ఎన్టీఆర్‌, బుచ్చిబాబు మూవీ

ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. కథ కూడా నెరేట్‌ చేశారు. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో ఏమో ఆ మూవీ తారక్‌ చేయలేదు. కథ పరంగా వచ్చిన డిఫరెంట్స్ కారణంగా ఎన్టీఆర్‌ చేయలేకపోయారని అన్నారు. మరోవైపు డేట్స్ ఇష్యూ కారణంగా చేయలేదనే కామెంట్‌ కూడా వచ్చింది. దీంతో ఆ తర్వాత రామ్‌ చరణ్‌కి బుచ్చిబాబు కథ చెప్పడం, ఆయనకు నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. ఈ గురువారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఎన్టీఆర్‌కి చెప్పింది `పెద్ది` కథ కాదని బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

45
బుచ్చిబాబుకి షాకిచ్చిన ఎన్టీఆర్‌
Image Credit : our own

బుచ్చిబాబుకి షాకిచ్చిన ఎన్టీఆర్‌

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి బుచ్చిబాబు కథ చెప్పడం ఇప్పుడు కాదు, ఆయన దర్శకుడు కాకముందే ఓ కథ చెప్పాడట. ఎన్టీఆర్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో `నాన్నకు ప్రేమతో` చిత్రాన్ని చేశాడు. ఆ సమయంలో సుకుమార్‌ వద్ద బుచ్చిబాబు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో బుచ్చిబాబు వీలు చూసుకొని ఓ కథని నెరేట్‌ చేశాడు. ఆ టైమ్‌లో కథ విన్న ఎన్టీఆర్‌.. ఈ కథ ఎవరి వద్దో దొబ్బేశావ్‌ కదా అన్నాడట. అయితే అది సరదాగా అన్న మాట అని వెల్లడించారు బుచ్చిబాబు. ఎన్టీఆర్‌ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనతో ఉంటే తాను అసిస్టెంట్‌, ఆయన స్టార్‌ హీరో అనే తేడా ఉండదు, ఆ లైన్స్ ని చెరిపేస్తారని వెల్లడించారు.

55
కథ ఎవరి వద్ద దొబ్బేశావ్‌
Image Credit : Pinterest

కథ ఎవరి వద్ద దొబ్బేశావ్‌

ఒక కొత్త హీరోకి అనుకుంటున్నానని చెప్పి, లండన్‌లో `నాన్నకి ప్రేమతో` మూవీ షూటింగ్‌ టైమ్‌లో తారక్‌కి కథ చెప్పాడట బుచ్చిబాబు. అంతా విని, నిజం చెప్పు ఈ కథ ఎవరి వద్దనో దొబ్బేశావ్‌ కదా అన్నాడట. దెబ్బకి మతిపోయిందట బుచ్చిబాబుకి. అది తనకు పెద్ద కాంప్లిమెంట్‌ అని వెల్లడించారు. ఎందుకంటే   కథ బాగుంది, స్క్రీన్‌ ప్లే బాగుంది, మాటలు బాగున్నాయని అని చెప్పడం కంటే దొబ్బేశావ్‌ అని చెబితే అదొక గొప్ప కాంప్లిమెంట్‌ అని, అది గొప్ప కథ అవుతుందని, ఎన్టీఆర్‌ ఆ మాట చెప్పినప్పుడు తనకు ఆ విషయం అర్థమయ్యిందని వెల్లడించారు బుచ్చిబాబు. తాజాగా ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Related Stories
Recommended image1
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image2
Ram Charan Top 5 Movies: రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved