- Home
- Entertainment
- Jr NTR: చుట్టమల్లే సాంగ్ పై దారుణమైన ఏఐ వీడియో, కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ కోపం.. ఆ నీచుల్ని అస్సలు వదలను
Jr NTR: చుట్టమల్లే సాంగ్ పై దారుణమైన ఏఐ వీడియో, కట్టలు తెంచుకున్న ఎన్టీఆర్ కోపం.. ఆ నీచుల్ని అస్సలు వదలను
Chuttamalle Song: దేవర సినిమాలోని చుట్టమల్లె పాటను ఏఐతో మార్ఫింగ్ చేసి జాన్వీ కపూర్‌ను కించపరిచేలా వీడియో రూపొందించడంపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చుట్టమల్లె పాట ఏఐ వీడియో
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లె పాటను ఉపయోగించి కొందరు వ్యక్తులు ఏఐతో మార్ఫింగ్ చేసిన వీడియోను రూపొందించారు. జాన్వీ కపూర్ గౌరవానికి భంగం కలిగించేలా ఈ వీడియోను రూపొందించినట్లు సమాచారం. నిన్నటి నుంచి ఈ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహనటి జాన్వీ కపూర్‌కు అండగా నిలుస్తూ ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించారు.
ఏఐతో మహిళను కించపరచడం సిగ్గుచేటన్న ఎన్టీఆర్
ఎక్స్ లో ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే దేశంలో, మాతృదేవోభవ అనే మాట కేవలం ఒక పదబంధం కాకుండా సంస్కృతిలో భాగమైనప్పటికీ కొందరు ఇంత దిగజారి ఏఐని ఉపయోగించి ఒక మహిళను అత్యంత అవమానకరమైన రీతిలో కించపరుస్తున్నారని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను రూపొందించేందుకు ఏఐని ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఆ నీచుల్ని అస్సలు వదలను
చుట్టమల్లె మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారిని తాను వదిలిపెట్టబోనని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్య తీసుకుంటానని తెలిపారు. ఇలాంటి కంటెంట్‌ను ఎవరూ చూడవద్దని, షేర్ చేయవద్దని, దానితో ఎలాంటి విధంగానూ స్పందించవద్దని ప్రజలను కోరారు. ఈ రోజు మరొకరి తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తె బాధితురాలైతే రేపు అదే పరిస్థితి మన కుటుంబంలోని మహిళలకు ఎదురుకావచ్చని ఎన్టీఆర్ హెచ్చరించారు.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…— Jr NTR (@tarak9999) October 3, 2026
ఏఐ దుర్వినియోగంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొన్న ఎన్టీఆర్, ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత ప్రభుత్వం కూడా బలమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐని దుర్వినియోగం చేసే విధానాలపై కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా పలువురు నటీమణులు కూడా ఏఐ దుర్వినియోగానికి బాధితులుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం చౌకైన ఎంగేజ్‌మెంట్ కోసం ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్‌ను సృష్టించే వారితో పాటు, అలాంటి కంటెంట్‌ను కోరుకునే వ్యక్తుల విషయంలోనూ చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

