- Home
- Entertainment
- Hyper Aadi: హైపర్ ఆదికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన క్రేజీ హీరో, అసలు అతడు ఎవరో కూడా తెలియదన్న డైరెక్టర్
Hyper Aadi: హైపర్ ఆదికి ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన క్రేజీ హీరో, అసలు అతడు ఎవరో కూడా తెలియదన్న డైరెక్టర్
కమెడియన్ హైపర్ ఆదికి సినిమాలో ఛాన్స్ ఇవ్వమని ఓ క్రేజీ హీరో రెకమండ్ చేశారు. హైపర్ ఆది అంటే ఎవరు, నేను ఇంత వరకు వినలేదు అంటూ డైరెక్టర్ షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Hyper Aadi
బుల్లితెరపై హైపర్ ఆది స్టార్ కమెడియన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. జబర్దస్త్ కామెడీ షో హైపర్ ఆదికి తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. జబర్దస్త్ షోలో హైపర్ ఆది కామెడీ పంచ్ లు ప్రేక్షకులకి రీఫ్రెషింగ్ గా అనిపించాయి. బాగా నవ్వించాయి. జబర్దస్త్ షో మాత్రమే కాదు ఏ షోలో కనిపించినా హైపర్ ఆది కామెడీ పంచ్ లు, ప్రసంగాలు ఒక ప్రవాహంలా సాగిపోయాయి. సినిమాల్లో నటించకపోయినా జబర్డస్త్ తో హైపర్ ఆది గురించి అందరికీ బాగా తెలిసింది.
నాగబాబుతో అనుబంధం
జబర్దస్త్ ఇచ్చిన గుర్తింపుతో హైపర్ ఆది సినిమాల్లో కూడా నటించడం ప్రారంభించారు. ఆ ప్రారంభ దశలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నాగబాబు జబర్దస్త్ షోకి జడ్జీగా వ్యవహరించారు. దీనితో నాగబాబుతో, ఆయన ఫ్యామిలీతో హైపర్ ఆదికి అనుబంధం ఏర్పడింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి .. వరుణ్ తేజ్ తొలి ప్రేమ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హైపర్ ఆది నటించారు. ఆ సినిమాలో అవకాశం తనకు ఎలా వచ్చింది అనే విషయాన్ని హైపర్ ఆది ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
హైపర్ ఆది ఎవరో తెలియదన్న దర్శకుడు
తొలిప్రేమ మూవీలో ఓ పాత్ర కోసం హైపర్ ఆదిని తీసుకోమని వరుణ్ తేజ్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి రెకమండ్ చేశారు. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడుతుంది అని వరుణ్ తేజ్ అన్నారట. కానీ తనకు అసలు హైపర్ ఆది ఎవరో కూడా తెలియదు అని వెంకీ అట్లూరి అన్నారట. దీనితో వరుణ్ తేజ్ షాక్ అయ్యారు అని హైపర్ ఆది తెలిపారు. హైపర్ ఆది జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్ అని వరుణ్ తేజ్ చెప్పారు. అసలు తనకు జబర్దస్త్ అనే షో ఉందని కూడానా తెలియదు అంటూ వెంకీ అట్లూరి ట్విస్ట్ ఇచ్చారు.
తొలిప్రేమలో ఛాన్స్
లక్కీగా నేను నటించిన తొలి చిత్రం మేడ మీద అబ్బాయి అనే మూవీ అప్పుడే రిలీజ్ అయి ఉంది. వెంకీ అట్లూరి గారు ఆ సినిమా చూశారు. అప్పుడు వెంకీ అట్లూరి వరుణ్ తేజ్ తో మాట్లాడుతూ మీరు చెప్పిన హైపర్ ఆది మన సినిమాకు సెట్ అవుతాడు.. ఈ మూవీలో మనం అతడిని తీసుకుంటున్నాం అని చెప్పారు. ఆ విధంగా తొలి ప్రేమ మూవీలో నాకు ఛాన్స్ వచ్చింది.
వెంకీ అట్లూరికి సెంటిమెంట్ గా మారిన హైపర్ ఆది
ఆ తర్వాత వెంకీ అట్లూరి ప్రతి సినిమాలో నేను సెంటిమెంట్ గా మారాను అని హైపర్ ఆది అన్నారు. ఇటీవల విడుదలైన విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీలో కూడా హైపర్ ఆది నటించారు. తనకు దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం అని హైపర్ ఆది తెలిపారు. త్రివిక్రమ్ ప్రభావం తనపై చాలా ఉంది అని హైపర్ ఆది అన్నారు.

