MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్, సముద్ర తీరం, కొండల నడుమ కుమ్టాలో భారీ సెట్టింగ్

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్, సముద్ర తీరం, కొండల నడుమ కుమ్టాలో భారీ సెట్టింగ్

చాలా లోకేషన్లు తిరిగిన తరువాత  ప్రశాంత్ నీల్ తో పాటు  ఆయన టీమ్ కు  కుమ్టాలోని ధారేశ్వర రామనగిండి లో షూటింగ్ లొకేషన్ దొరికింది.  విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశంలో షూటింగ్ కు రెడీ అయ్యారు టీమ్. 

Mahesh Jujjuri | Published : Apr 25 2025, 03:59 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుమ్టాలో

జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కుమ్టాలో

ప్రశాంత్ నీల్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీకి, షూటింగ్ లొకేషన్ దొరికింది. కర్నాటకలోని కుమ్టా ధారేశ్వర సమీపంలోని రామనగిండి సముద్ర తీరంలో వారు స్టే చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ ఉత్తర కన్నడ సముద్ర తీరంలో జరుగుతోంది.

Also Read:  సాయి పల్లవి పై భారీగా ట్రోలింగ్, పహల్గాం ఉగ్రదాడిపై హీరోయిన్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు

25
రామనగిండిలో భారీ సెట్

రామనగిండిలో భారీ సెట్

నిర్మానుష్యంగా ఉన్న రామనగిండి సముద్ర తీరంలో ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మించారు. పెద్ద తుపాకులు, ఇల్లు, హెలికాప్టర్, రైలు సెట్లు వేశారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా షూటింగ్ జరుగుతోంది. ఇంకా చాలా రోజులు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.

Also Read:  మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

35
కుమ్టా ధారేశ్వర రామనగిండి

కుమ్టా ధారేశ్వర రామనగిండి

ఎన్నో ప్రదేశాలు వెతికిన తర్వాత ప్రశాంత్ నీల్ బృందానికి కుమ్టా ధారేశ్వర రామనగిండి బాగా నచ్చింది. విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఈ కొండ కిందనే ఇప్పుడు భారీ సెట్ వేశారు.

Also Read: సైరా బానుతో విడాకులు, విమర్శలపై ఫస్ట్ టైమ్ నోరు విప్పిన ఏఆర్ రెహమాన్

45
క్లైమాక్స్, పాటల షూటింగ్

క్లైమాక్స్, పాటల షూటింగ్

సుమారు ఒక నెల నుండి ఇక్కడ సెట్ వేసే పని జరుగుతోంది. ఇప్పుడు షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు టీమ్. ఇక ఈసినిమాకు సంబంధించిన  క్లైమాక్స్ సీన్ తో పాటు రెండు పాటల షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుందని సమాచారం.

Also Read: స్టార్ హీరోయిన్ కు విలన్ గా, ప్రియుడి గా నటించిన చిరంజీవి, ఎవరా నటి?

55
జూ.ఎన్టీఆర్ 18 కిలోలు తగ్గారు

జూ.ఎన్టీఆర్ 18 కిలోలు తగ్గారు

ఈ సినిమా కోసం జూనియర్  ఎన్టీఆర్ గత ఐదు నెలల్లో 18 కిలోల బరువు తగ్గి పాత్రకు సిద్ధమయ్యారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను  వచ్చే ఏడాది మిడ్ వరకూ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: తినడానికి తిండి లేక పస్తులున్నా, జబర్దస్త్ చమ్మక్ చంద్ర నవ్వుల వెనుక విషాద కథ

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
ప్రశాంత్ నీల్
 
Recommended Stories
Top Stories