NTR about depression: డిప్రెషన్ కు గురయ్యా, కెరీర్ పడిపోతున్న టైంలో.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురూ ఇండియా మొత్తం తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురూ ఇండియా మొత్తం తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ జనవరి 7 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కెరీర్ గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. కెరీర్ లో ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు తాను ఎలా డిప్రెషన్ కి గురయ్యానో ఎన్టీఆర్ వివరించాడు. ఎన్టీఆర్ 17 ఏళ్ల వయసులోనే నటుడిగా మారాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో తొలి సక్సెస్ దక్కింది.
సింహాద్రి చిత్రంతో ఎన్టీఆర్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కెరీర్ లో ఎప్పుడూ పైకి వెళుతూ ఉండడమే కుదరదు. వేగంగా ఎదిగినప్పుడు కెరీర్ లో డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. నాకు కూడా కెరీర్ పడిపోతున్న దశ ఎదురైంది. నేను నటించిన చిత్రాలు ఒక దశలో వర్కౌట్ కాలేదు. డిప్రెషన్ కు గురయ్యా. సినిమాలు వర్కౌట్ కానందుకు నేను డిప్రెషన్ కు గురవ్వలేదు. నటుడిగా నాకు నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని ఎన్టీఆర్ తెలిపాడు.
ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు. కానీ ఎప్పుడూ మన వయసు 17 ఏళ్ళు మాత్రమే ఉండదు. వయసు పెరిగింది. ఆ టైంలో ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచన వచ్చింది. అలాంటి టైంలో నాకు రాజమౌలి ఎంతో సాయం చేసారు. నా కెరీర్ కు ఆయన ఎప్పుడూ బౌన్సింగ్ బోర్డు లాగా ఉంటారు అని ఎన్టీఆర్ తెలిపాడు.
రాజమౌళి సాయంతో నటుడిగా నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నా కెరీర్ కూడా మారింది. నా విజయాల పట్ల నాకు సంతృప్తి లేదు. కానీ ఈరోజు నేను ఒక నటుడిగా సంతృప్తితో ఉన్నా అని ఎన్టీఆర్ తెలిపారు.
ఇప్పుడు మీ ముందుకు ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాబోతున్నా అని ఎన్టీఆర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రం ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. Also Read: Divi Photos: మాటల్లేవు ముద్దులే అంటున్న ఫ్యాన్స్.. కుర్రాళ్ల మతులు పోగొడుతూ విరహ వేదనతో దివి