- Home
- Entertainment
- ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకి లేదని ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా.. చిరంజీవి ముందే మొత్తం జరిగింది
ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకి లేదని ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా.. చిరంజీవి ముందే మొత్తం జరిగింది
ఓ లెజెండ్రీ నటుడి మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకు ఇంకా రాలేదని తెలిపాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జూ.ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ లోనే తారక్ తన నటన, డ్యాన్స్ లతో తిరుగులేని గుర్తింపు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా తన సీనియర్ హీరోల గురించి మాట్లాడుతుంటారు. ఓ అవార్డు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
చిరంజీవి చేతుల మీదుగా
ఆ సందర్భంలో తారక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చాలా ఏళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినిమా అవార్డు దక్కింది. ఆ అవార్డుని ఎన్టీఆర్.. చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ తర్వాత తారక్ మాట్లాడుతూ ఈ అవార్డుని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
వాళ్ళని చూస్తూ ఎదిగాం
ఎందుకంటే మేమంతా చిన్నప్పటి నుంచి బాలయ్య బాబాయ్, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాం. వారి నుంచే నటన, డ్యాన్సులు నేర్చుకున్నాం అని తారక్ తెలిపారు. అదే సమయంలో లెజెండ్రీ నటుడు శోభన్ బాబు మరణించడంతో ఆ విషయాన్ని తారక్ స్టేజీపైనే ప్రస్తావించారు.
ఆయన శవాన్ని చూసే అర్హత కూడా లేదు
శోభన్ బాబు గారు మరణించడం జరిగింది. ఆఖరి చూపు కోసం నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన శవాన్ని కూడా చూసే అర్హత నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నా. అందుకే ఈ అవార్డుని ఆయనకే అంకితం ఇస్తున్నా అని చిరంజీవి ముందే తారక్ ప్రకటించారు. ఈ అవార్డుని శోభన్ బాబు కుటుంబ సభ్యులకు అందేలా చేయాలని కోరుతూ చిరంజీవి గారికే వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
చిరంజీవి ప్రశంసలు
ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అవార్డుని శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలి అనే ఆలోచన తారక్ కి రావడం అతడి సంస్కారాన్ని సూచిస్తుంది అంటూ ప్రశంసలు కురిపించారు.

