25 ఏళ్ళుగా స్వీట్స్ కు దూరంగా స్టార్ హీరో, 50 ఏళ్ళు ఉన్నాయంటే నమ్మలేరు..
ఓ స్టార్ హీరో.. 50 ఏళ్ళు దాటాయి...అయినా సిక్స్ ప్యాక్ తో కండలు తిరిగి ఉంటారు. పూర్తిగా వెజిటేరియన్.. పైగా 25 ఏళ్ళుగా స్వీట్ అంటూ ముట్టుకోని ఆ హీరో ఎవరో మీకు తెలుసా..?
కోట్లు సంపాదించినా సరే హీరో, హీరోయిన్ కడుపునిండా తినే అదృష్టం ఉండదు. మంచి కెరీర్ కోసం, ఫిజిక్ మెయింటేన్ చేయడం కోసం ఎప్పటి కప్పుడు కడుపు మాడ్చుకుని ఇష్టమైన ఫుడ్ కు దూరంగా ఉండాలి. మహేష్ బాబు లాంటి హీరోలు డైరీ ప్రాడెక్టస్.. అంటే పాలు, పెరుగు, నెయ్యిలాంటివి అస్సలు ముట్టుకోరు.
కొంత మంది స్వీట్స్ ముట్టుకోరు.. ఇష్టం ఉన్నా వేపుడు కూరలు తినరు..ఇలా ఫ్యాట్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్ లాంటివి తినడానికి లేదు. అలా ఉండబట్టే.. బయస్సు పెరిగినా.. ఏమాత్రం కనిపించకుండా.. కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు కొంత మందిస్టార్లు. ఓ స్టార్ హీరో అయితే 52 ఏళ్లు వచ్చినా.. అదే సిక్స్ ప్యాక్.. అదే టోన్డ్ బాడీ.. అదే కండలు తిరిగిన శరీరంతో అమ్మాయిన మనసుల్లో గిలిగింతలు పెడుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?
John Abraham's butt
కెరీర్ ప్రారంభంలో అతను అమ్మాయిల కలల రాకుమారుడు. బాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈమధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు. విలన్ పాత్రల వైపు మనసు మళ్లిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ఈ హీరో గుర్తుండే ఉంటాడు. రోమాంటిక్ హీరోలలో ముందు వరసలో ఉండేది జానే. హాట్ హాట్ సీన్స్ చేయడంతో జాన్ అబ్రహంకు తిరుగులేదు. ఇప్పటికీ అతిని సినిమాల్లో లిప్ లాక్ లేకుండా ఉండడు మరి.
52 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న జాన్ అబ్రహం...రోజువారి పనులలో ఏది మర్చిపోయినా జిమ్ ను మాత్రం మర్చిపోడు.. వర్కౌట్లు చేయకుండా ఆరోజు నిద్రపోడు. 52 ఏళ్ల జాన్అబ్రహం... ను ఇప్పుడు చూసినా సరే 25 ఏళ్ళు అంటేనమ్మేస్తారు..
ఇలా తన ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడుతున్న ఈ హీరో.. ఫిల్ నెస్ కోసం స్వీట్లు మానేసి దాదాపు 25 ఏళ్ళు అవుతుందట. తన కు ఎంతో ఇష్టమైన స్వీట్లు.. తన ఫిట్ నెస్ కు ఇబ్బంది అవుతున్నాయని భావించిన జాన్ అబ్రహం.. స్వీట్లను దూరం పెట్టాడట.
జాన్ అబ్రహం హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్‌లో విలన్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. పఠాన్ లో షారుఖ్ ఖాన్ కు విలన్ గా ఆకట్టుకున్నాడు.అయితే ఇంత ఏజ్ వచ్కచినా.. ఇలా ఉండటం వెనుక రహస్యం ఏంటి..? తన ఫిట్ నెస్ కు కారణమేంటని ఓ ఇంటర్వ్యూలో జాన్ అబ్రహంకు ప్రశ్న ఎదురయ్యింది.
అయితే ఈ విషయంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. స్వీట్స్ తినకపోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బరువు పెరగరు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉండదు, మధుమేహం రాదు, గుండె సమస్యలు రావు, పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు జాన్ అబ్రహం.
తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు జాన్. అంతే కాదు ఆయన్ను చూసినవారు ఎవరైనా నాన్ వేజ్ ప్రియుడేమో, గట్టిగా తింటాడేమో అనుకుంటారు. కాని జాన్ అబ్రహం ప్యూర్ వెజిటేరియన్. మరీ ముఖ్యంగా వెజ్ సలడ్స్ అంటే ఎంతో ఇష్టంగా తింటాడట జాన్ అబ్రహం. తిండి మార్చిపోయినా.. వర్కౌట్ చేయడం మాత్రం మర్చిపోడు స్టార్ హీరో. అందుకే ఇప్పటికీ అలాగే ఉన్నాడు. 60 ఏళ్ళు దాటినా అలాగే ఉంటాడు.