- Home
- Entertainment
- Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్.. పూజా టీమ్ చెప్పిన నిజం ఏంటంటే
Pooja Hegde కారవాన్‌లోకి వెళ్లిన పాన్ ఇండియా హీరో ఎవరు.. కావాలనే బ్యాడ్.. పూజా టీమ్ చెప్పిన నిజం ఏంటంటే
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ఓ స్టార్ హీరోపై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై పూజా హెగ్డే టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో నిజం ఏంటనేది చెప్పింది.

తెలుగుకి దూరమైన పూజా హెగ్డే
తెలుగు ఆడియెన్స్ పూజా హెగ్డే ని ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటారు. తెలుగులో ఆమె నటించిన `అల వైకుంఠపురములో` సినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ఆమెపై ఉండటంతో అదే పేరుని పూజాకి తగిలించారు. అయితే పూజా ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తెలుగులో నటించి చాలా ఏళ్లు అవుతుంది. చివరగా ఆమె `ఆచార్య`లో నటించింది. ఆ తర్వాత కనిపించలేదు. `ఎఫ్3`లో స్పెషల్ సాంగ్ చేసింది.
ఆగిపోయిన పూజా `జననాయకుడు` మూవీ
తెలుగులో పూజా ఎందుకు సినిమాలు చేయడం లేదనే చర్చ ఆ మధ్య బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. పూజా కూడా తెలుగులో కంటే హిందీ, తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. ఇటీవల ఆమె `రెట్రో`, `కూలీ`(స్పెషల్ సాంగ్)లో మెరిసింది. హిందీలో మూడు సినిమాలు చేసింది. కానీ టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో ఓ మూవీకి కమిట్ అయ్యిందని సమాచారం. దీంతోపాటు విజయ్ తో చేసిన `జన నాయకుడు` విడుదల కావాల్సి ఉంది. మరోవైపు `కాంచన 4`లో నటిస్తోంది. అలాగే ఓ హిందీ చిత్రంలో నటిస్తుంది పూజా.
క్యారవాన్‌లోకి వచ్చిన హీరోని చెంప చెళ్లుమనిపించిన పూజా
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియా వైడ్‌గా పూజా హెగ్డే చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఓ పాన్ ఇండియా హీరోని చెంపదెబ్బ కొట్టినట్టుగా చేసిన కామెంట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకి పూజా ఏం చెప్పిందంటే, `ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా మేం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు మా అనుమతి లేకుండా హీరోలు కారవాన్‌లోకి వచ్చేస్తారు. చాలా ఏళ్ల క్రితం నేను ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సమయంలో ఒక హీరో నా అనుమతి లేకుండా, కనీసం పిలవకుండా లోపలికి వచ్చేశాడు. వెంటనే అతని చెంప చెళ్లుమనిపించాను. అప్పటి నుంచి అతను నాతో మరో సినిమా చేయలేదు. ఆ మూవీ షూటింగ్‌లో నేను పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో డూప్‌ని పెట్టి షూట్ చేశారు` అని పూజా హెగ్డే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. పలు మీడియా మాధ్యమాలు ఈ వార్తని ప్రసారం చేశాయి.
పూజా మేనేజర్ క్లారిటీ
అయితే ఈ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. అన్ని మీడియా సంస్థలు ఓ ఇంటర్వ్యూలో అని మెన్షన్ చేస్తున్నాయి, కానీ పూజా ఏ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసిందనేది క్లారిటీ లేదు. అయితే దీనిపై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ఈ వార్తలను ఖండించారు. ఇందులో నిజం లేదని, పూజా హెగ్డే ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఇవన్నీ తప్పుడు ప్రచారంగా చెబుతున్నారు. ఈ వార్తలను పూజా మేనేజర్ కొట్టిపారేశారు. దీంతో ఇదంతా కొందరు కావాలనే చేస్తున్నారని, ఒక హీరోని టార్గెట్ చేసి, కావాలనే ఆయన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ పూజా కామెంట్లని చూసి పలువురు హీరోలు అభిమానులు వార్ కి దిగారు. మీ హీరో అంటే మీ హీరో అని సోషల్ మీడియాలో వార్‌ని ప్రకటించడం గమనార్హం.
పూజా హెగ్డే చేసిన తెలుగు సినిమాలు
ఇక పూజా హెగ్డే తెలుగులో `ఒక లైలా కోసం`, `ముకుందా` చిత్రాలతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత `డీజే`, `రంగస్థలం`(స్పెషల్ సాంగ్), `సాక్ష్యం`, `అరవింద సమేత`, `మహర్షి`, `గద్దల కొండ గణేష్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`, `రాధేశ్యామ్`, `ఆచార్య`, `ఎఫ్3`(స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక్క పాన్ ఇండియా మూవీ చేసింది. అది ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` కావడం విశేషం.

