MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: అసలు విషయం తెలుసుకొని షాకైన జానకి.. సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం?

Janaki Kalaganaledu: అసలు విషయం తెలుసుకొని షాకైన జానకి.. సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 26 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 26 2022, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఎపిసోడ్లు తరుణ్, అఖిల్ కి ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు మా కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాము. 25వేలు శాలరీ ఉంటుంది వారం రోజుల్లో వచ్చే జాయిన్ అవ్వాలి అనడంతో అఖిల్ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత అఖిల్ ఆ సంతోషాన్ని జ్ఞానాంబ  వాళ్ళతో పంచుకోవడానికి అక్కడికి వెళ్లి అమ్మానాన్న నాకు జాబ్ వచ్చింది అనడంతో వాళ్లు కూడా సంతోష పడుతూ ఉంటారు. ఎంతమంచి శుభవార్త చెప్పావు అని అంటుండగా ఇంతలోనే అక్కడికి మల్లిక విష్ణు వస్తారు. శాలరీ అంటున్నావు ఏంటి అఖిల్ అనే మల్లిక అడగగా నాకు జాబు వచ్చింది వదిన అనడంతో సంతోషపడుతూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు విష్ణు మంచి ఉద్యోగమేనా అని అడిగి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. అప్పుడు గోవిందరాజులు అఖిల్ కి ఉద్యోగం వచ్చింది అని చెప్పగా ఏ కంపెనీలో అని అడిగి కంగ్రాట్యులేషన్స్ అని చెబుతుంది జానకి. ఇంతలోనే రామచంద్ర అక్కడికి రావడంతో అన్నయ్య నాకు జాబ్ వచ్చింది అన్నయ్య నువ్వు విసిటింగ్ కార్డు ఇచ్చావు కదా అదే కంపెనీలో జాబ్ వచ్చింది అనడంతో రామచంద్ర కూడా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మొన్న నీ కొడుకు మాత్రమే ఉద్యోగం వచ్చింది నా కొడుకు రాలేదని మాట్లాడావు కదా ఇప్పుడు నా కొడుకు ఉద్యోగం వచ్చింది 25 వేలు జీతం అని అంటాడు గోవిందరాజులు.
 

36

అప్పుడు అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా అఖిల్ కి స్వీట్ తినిపిస్తారు. తర్వాత రామచంద్ర లోపలికి వెళ్లి జానకి గారు చూశారా అఖిల్ కి జాబ్ వచ్చేసరికి అమ్మా నాన్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని అంటాడు. నా కూడా సంతోషంగా ఉంది కానీ అఖిల్ కు జాబ్ రావడానికి మీకు ఏం సంబంధం లేదు కదా అని అంటుంది జానకి. మీరు మా నాన్న ఆప్తికం దగ్గర కూడా రాలేదు అనడంతో ఏదో పని ఉండి రాలేదు అనగా లేదు రామచంద్ర గారు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని అంటుంది జానకి. మీరు అక్కడికి ఎందుకు రాలేదు నాకు చెప్తాను అన్న ముఖ్యమైన విషయం ఏమిటి అని అడుగుతుంది జానకి.
 

46

అప్పుడు రామచంద్ర తలుపులు వేసి అసలు విషయం చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు రామచంద్ర గారు ఉద్యోగం కోసం 20 లక్షలు కట్టడం ఏంటి అని షాక్ అవుతుంది జానకి. అన్ని లక్షలు మీకు ఎక్కడివి అన్నంతో ఇల్లు తాకట్టు పెట్టాను అని అంటాడు రామచంద్ర. దాంతో జానకి ఆశ్చర్య పోతుంది. జోక్ చేస్తున్నారు కదా అనగా లేదు జానకి గారు నిజమే చెబుతున్నాను అని రామచంద్ర జరిగింది మొత్తం వివరిస్తాడు. అంటే ఈ విషయం నువ్వు అఖిల్ కు చెప్పలేదా రామ గారు అనగా అఖిల్ కే కాదు ఇంట్లో ఎవరికీ తెలియదు అని అంటాడు రామచంద్ర. మీరు మోసపోయారు రామచంద్ర గారు అనగా లేదండి వాడు నా చిన్నప్పటి స్నేహితుడు అలా చేయడు అని అంటాడు రామచంద్ర.
 

56

అప్పుడు ఇదే విషయం అత్తయ్య గారికి చెప్తాను అని అక్కడికి వెళ్లొద్దు అని బ్రతిమలాడుతుండగా జానకి వినిపించుకోకుండా అక్కడికి వెళుతుంది. ఏమైంది జానకి అని అడగగా రామచంద్ర అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. అప్పుడు జానకి నిజం చెప్పకుండా రామచంద్ర అక్కడి నుంచి చేయి పట్టుకుని పిలుచుకుని వెళ్తాడు. ఆ తర్వాత జెస్సి అఖిల్ ఆనందంతో ఒకరు హత్తుకొని సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి ఫుల్లలు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు మల్లిక ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది. మల్లిక కావాలనే అఖిల్ ని రెచ్చగొడుతూ జానకి ఇప్పటినుంచి వడ్డీతో సహా చెల్లించాలి అనడంతో జెస్సి అలా మాట్లాడకు అక్క అని అంటుంది.
 

66

 ఆ తర్వాత జానకి మీరు ఎన్ని చెప్పినా ఈ విషయంలో మాత్రం నేను కన్విన్స్ అవ్వను రామ గారు అని అంటుంది. జానకి టెన్షన్ తో మాట్లాడగా రామచంద్ర మాత్రం కూల్ గా ఏం జరగదు జానకి గారు మీరు అనుకున్నట్టుగా కూల్ గా ఉండండి అంటాడు. అప్పుడు ఆ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు అని జానకితో మాట తీసుకుంటాడు రామచంద్ర. మీరు నాకు మాట ఇచ్చారు ఈ విషయాన్ని బయట చెబితే ఇక నా మీద ఒట్టే అని అంటారు రామచంద్ర. అప్పుడు జానకి రామచంద్ర చేసిన పనికి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved