MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకిపై దొంగ అని ముద్ర వేసిన మల్లిక.. జ్ఞానాంబ మీద సీరియస్ అయిన మల్లిక?

Janaki Kalaganaledu: జానకిపై దొంగ అని ముద్ర వేసిన మల్లిక.. జ్ఞానాంబ మీద సీరియస్ అయిన మల్లిక?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 9వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
Published : Feb 09 2023, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఎవరు తీశారు అని నువ్వు అనుమానిస్తున్నావు అని అనడంతో అవసరాలు ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళు చేస్తారు. మా ఆయన పని చేస్తున్నారు. నేను పెట్టినది తిని ఉంటున్నారు మా ఆయనకు అలాంటి అవసరం ఏమీ లేదు అని అంటుంది. అఖిల్ కి ఉద్యోగం వచ్చింది జెస్సి కూడా ఇంట్లో నుంచి కదలదు కాబట్టి తాను కూడా తీసి ఉండదు అంటుంది మల్లిక. అప్పుడు వెన్నెల, గోవిందరాజులు మరి ఎవరి మీద నీ అనుమానం అని అడగడంతో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఎవరికి ఉన్నాయి జానకి తప్ప అని అనడంతో జానకి, రామచంద్ర షాక్ అవుతారు. అందుకే నాకు జానకి మీద అనుమానంగా ఉంది అని మల్లిక అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అప్పుడు రామచంద్ర మల్లిక ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీ ఉంగరం దొంగలించాల్సిన అవసరం జానకి గారికి ఏంటి అని సీరియస్ అవుతాడు. జానకి అక్కని పట్టుకుని అంత మాట అనడం ఏం బాగోలేదు అక్క అని అంటుంది జెస్సి. జానకి బావ గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను ఎవరితోనో కాలేజ్ ఫీజ్ కోసం అప్పు చేసిందంట. ఆ బండి మీద వచ్చిన డబ్బులతో ఇల్లు గడవడానికి సరిపోదు. వేలకు వేలు ఫీజులు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి పనులు చేస్తే తప్పడంతో అలాంటి కర్మ జానకికి ఇంకా పట్టలేదు అంటాడు గోవిందరాజులు. రామచంద్ర కూడబెట్టి జానకిని చదివిస్తున్నాడు అనడంతో కూడబెట్టే అంత ఆదాయం ఎక్కడ వస్తుంది మామయ్య గారు అంటుంది.
 

39

అప్పుడు అందరూ మౌనంగా ఉండడంతో మల్లిక నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర తమ్ముడు భార్యని మర్యాదగా వదిలిపెడుతున్నాను. నీకు అనుమానం ఉంటే వెళ్లి చెక్ చేసుకో అని అంటాడు. అప్పుడు ఆ చెక్ చేసుకుంటాను నాకు ఎలాగో అనుమానం ఉంది అని మల్లిక కిచెన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు మల్లిక కిచెన్ మొత్తం వెతుకుతూ ఉండగా అందరూ మల్లికవైపు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక కిచెన్ మొత్తం వెతికి వచ్చి అంతా వెతికాను ఆ బ్యాగులో ఉందేమో అని నా అనుమానం అనడంతో రామచంద్ర ఆ బ్యాగు తీసి మల్లికకు ఇస్తాడు. అప్పుడు మల్లిక, జానకి బ్యాగులో నుంచి ఉంగరం తీయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

49

ఇప్పుడేమంటారు ఇదే నా ఉంగరం నేను అనుమానించినట్టే జానకి దగ్గరే నా ఉంగరం ఉంది అని అంటుంది మల్లిక. ఇప్పుడేమంటారు బావగారు మీ భార్య నిప్పు అన్నారు కదా కొద్దిసేపు అయి ఉంటే ఆ నిప్పులోనే పడి ఈ ఉంగరం కాలిపోయేది అని అంటాడు. అప్పుడు ఇంట్లో అందరూ జానకికి సపోర్ట్ గా మాట్లాడతారు. అప్పుడు మల్లిక, విష్ణు వైపు దొంగ ఏడుపులు ఏడుస్తూ చూశారా నా ఉంగరం పోయింది అంటే ఇంట్లో ఎవరికీ బాధ లేదు అందరూ నన్నే అనుమానిస్తున్నారు అని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారని అలా మాట్లాడుతున్నావు అనడంతో దొంగ ఏడుపులు ఏడుస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది మల్లిక.
 

59

ఇప్పుడు గోవిందరాజులు,జ్ఞానాంబ నీ భార్య అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి విష్ణు అని అడుగుతారు. ఇంకా అడగడం ఏంటి అత్తయ్య గారు దొంగతనం చేసిన కోడలిని ఏమీ అనరు కానీ ఏమి అన్నా కూడా ఇంట్లో మాటలు పడుతూ మేము ఉండాలా అని అంటుంది మల్లిక. ఇంట్లో ఒక క్షణం కూడా ఉండము అనడంతో జ్ఞానాంబ వెళ్లడానికి వీల్లేదు అనడంతో ఇంకా ఉండమని ఎలా అంటున్నావ్ అమ్మా అని అంటాడు విష్ణు. దొంగతనం చేసిన వదిన్ని ఏమీ అనకుండా నా భార్యని అంటున్నావు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మల్లిక మంచి రోజు చూసుకొని వెళ్ళిపోతాము అనడంతో ఏంటి అంతా నీ ఇష్టమైన అని జ్ఞానాంబ అనడంతో ఊరుకుంటున్నాం కదా అని మీ పెద్దరికాన్ని, పెత్తనాన్ని మా మీద చూపించకండి అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది మల్లిక.
 

69

మేము వెళ్లకుండా అడ్డుపడ్డారంటే మీరు అత్తయ్య అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది అనడంతో  జ్ఞానాంబ షాక్ అవుతుంది. దయచేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి అని చెప్పి మల్లిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెన్నెల నువ్వేం పట్టించుకోవద్దు వదిన అనడంతో నన్ను దొంగ అన్నదానికంటే అత్తయ్యను అన్ని మాటలు అన్నదానికే నాకు బాధగా ఉంది అంటుంది జానకి.  ఆ తరువాత జ్ఞానాంబ జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే గోవిందరాజులు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఏంటి జ్ఞానం వాళ్ళ మనసులో మాటలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నావు అని అంటాడు.
 

79

అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉండగా వారి మాటలు జానకి విని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అఖిల్ ,జ్ఞానాంబ వాళ్ల దగ్గరికి వెళ్లి అమ్మ నాకు ఆఫీసు నుండి రావడానికి రోజు లేట్ అవుతుంది కొత్తగా జాయిన్ అయ్యాను కదా, జెస్సి కూడా నా గురించి ఆలోచిస్తుంది అని అనడంతో ఇప్పుడు ఏం చేయమంటావు అని జ్ఞానాంబ అడగగా ఆఫీస్ నుంచి మా మామయ్య వాళ్ళ ఇంటికి దగ్గర అందుకని నేను జెస్సి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పోదాం అనుకుంటున్నాము అనడంతో జ్ఞానాంబ, గోవిందరాజులు షాక్ అవుతారు. ఆ మాటలు జానకి కూడా షాక్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ ఏంట్రా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా కావాలంటే వేరే పని చూసుకో కానీ ఇంట్లో నుంచి వెళ్లడానికి వీల్లేదు అంటుంది.
 

89

అప్పుడు జ్ఞానాంబ అందరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేము ఏం చేయాలి అనడంతో మేమేమి ఊరు వదిలి వెళ్ళిపోవాలి కదా అమ్మ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాము అంతే అని అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి మీరిద్దరూ వెళ్లడానికి నేను ఒప్పుకోను అని అంటుంది జ్ఞానాంబ. జెస్సి కూడా ఈ విషయం మీతో చెప్పమని చెప్పింది మా మామయ్య గారు కూడా రమ్మని చెప్పారు. ఎక్కువ రోజులు ఏం లేదు నెలరోజులే ఆ తర్వాత ఆఫీస్ లో పని తగ్గిపోతుంది అప్పుడు మళ్లీ ఇక్కడికే వస్తాము అంటాడు అఖిల్. అప్పుడు జెస్సి అక్కడికి వస్తుంది. అప్పుడు గోవిందరాజులు సరే జ్ఞానం వాళ్ళని వెళ్ళనివ్వు అని అంటాడు. సరే రా వెళ్ళండి అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జెస్సి మాట్లాడడానికి ప్రయత్నించగా అఖిల్ అది కాదు నేను చెప్పేది విను అని లోపలికి పిలుచుకొని వెళ్తాడు.

99

అప్పుడు జెస్సీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని అనడంతో ఇలాగే ఉంటే మన బతుకులు ఎప్పటికీ మారవు నేను చెప్పేది విను అని అంటాడు అఖిల్. ఇన్ని రోజులు ఉద్యోగం లేక బాధపడ్డాను ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఇంట్లో ఒక్కడి నుంచి కూడా ఉండదలచుకోలేదు అని అఖిల్ స్వార్థంగా మాట్లాడుతాడు. అప్పుడు నీకు నేను వద్దు అనుకుంటే వీళ్ళతో ఇక్కడే ఉండిపో నేను వెళ్ళిపోతాను అంటాడు అఖిల్. నా మాట కాదు అన్నావు అంటే నన్ను వద్దనుకో జెస్సి అని అంటాడు. ఇలా మారిపోతావని ఇలా మాట్లాడతావని ఎప్పటికి అనుకోలేదు అనడంతో నేను ఇలాగే ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత మలయాళం జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటాడు. తర్వాత జ్ఞానాంబ జరిగిన విషయాలు తలచుకొని బాధపడుతూ ఉంటుంది.  ఇంతలోనే అక్కడికి రామచంద్ర వస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved