MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జెస్సీ కడుపులో బిడ్డ బతకడం కష్టమే అని చెప్పిన డాక్టర్.. ఆనందంలో జ్ఞానాంబ కుటుంబం?

Janaki Kalaganaledu: జెస్సీ కడుపులో బిడ్డ బతకడం కష్టమే అని చెప్పిన డాక్టర్.. ఆనందంలో జ్ఞానాంబ కుటుంబం?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 15వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 15 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో జెస్సి వాళ్ళ నాన్న జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. అప్పుడు రామచంద్ర,జ్ఞానాంబ వాళ్ళు వెళ్లి ప్రేమగా పలకరిస్తారు. ఇంతలోనే అక్కడికి అఖిల్ వచ్చి జెస్సి వాళ్ళ నాన్నను పలకరిస్తాడు. అప్పుడు జ్ఞానాంబ జానకి లోపలికి పిలుచుకొని వెళ్ళి కాఫీ ఇవ్వు అని అంటుంది. మరికొవైపు మల్లికా ఒకచోట కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాధపడకు మల్లిక అని చెబుతూ ఉండగా అప్పుడు మల్లిక అబ్బా నాకు ఈ కడుపు పోయే విషయం ఏమో కానీ ఆ మాట విని విని నేను పేషెంట్ అయిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది.
 

27

ఇంతలోనే జెస్సి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. అతన్ని చూసి బాధగా నటిస్తుంది మల్లిక. జానకి మల్లిక ఓవరాక్షన్ చూడలేక మీరు పదండి బాబాయ్ గారు అని లోపలికి పిలుచుకుని వెళ్తుంది. మరొకవైపు జ్ఞానాంబ ఇంకా ముత్తైదువులు  రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు గోవిందరాజులు వస్తారులే జ్ఞానం నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు. అప్పుడు జానకి ఎక్కడికి వెళ్ళింది జెస్సిని రెడీ చేసిందా లేదా బాధ్యతలు తెలిసిన మనిషికి బాధ్యత గురించి చెప్పాల్సిన పనిలేదు అని అంటాడు గోవిందరాజు. నువ్వేం టెన్షన్ పడకు జానకి చూసుకుంటుందిలే అని చెప్పి వెళ్ళిపోతాడు గోవిందరాజులు.
 

37

మరొకవైపు జెస్సి రెడీ అవుతూ ఉండగా ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి రావడంతో ప్రేమతో హత్తుకుంటుంది. అప్పుడు జెస్సీ వాళ్ళ నాన్న జెస్సీకి జాగ్రత్తలు చెబుతూ ఉండగా జెస్సి ఎప్పటికీ అలా చేయదు బాబాయ్ అని అంటుంది జానకి. ఇప్పుడు మల్లికా అదంతా చూసి వెదవ సోది అనుకుంటూ కుళ్లుకుంటూ ఉంటుంది. ఇంతలోనే జ్ఞానాంబ అక్కడికి వచ్చి జెస్సికి నగలు ఇవ్వడంతో అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈ శ్రీమంతం అయిపోయాక కడుపు పోయిందని అబద్ధం చెప్పి ఉంటే ఆ నగలు నాకి దక్కుండేవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ జెస్సి ఇద్దరు క్లోజ్ గా ఉండడం చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది.
 

47

 ఇప్పుడు జ్ఞానాంబ మల్లిక విషయం గురించి మాట్లాడడంతో జానకి భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత జానకి జస్ట్ ని రెడీ చేస్తూ ఉండగా చికిత వచ్చి మీకు ఫోన్ వస్తుంది అని చెప్పడంతో జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చెప్పండి డాక్టర్ గారు అనగా జెస్సి రిపోర్ట్స్ వచ్చాయి జానకి అనగా రిపోర్ట్స్ లో అంతా బాగోనే ఉందా డాక్టర్ అనగా సారీ జానకి గారు కడుపులో బిడ్డ 80 శాతం బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనడంతో జానకి షాక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ ఏమీ మార్గాలు లేవు జానకి అని అంటుంది డాక్టర్. అప్పుడు డాక్టర్ జెస్సి కి మీరు అసలు విషయం కూల్ గా అర్థం అయ్యేలా చెప్పండి అని చెబుతుంది.
 

57

జెస్సి రిపోర్ట్స్ ఇంటికి పంపాను అనడంతో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే రిపోర్ట్స్ తీసుకుని ఒక ఆమె ఇంటికి వస్తుంది. అప్పుడు మల్లిక, జానకి ఫోన్ వస్తే ఎందుకు పక్కకు వచ్చింది ఎందుకు టెన్షన్ పడుతోంది ఏదో నిజం దాస్తోంది ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ రిపోర్ట్స్ తీసుకుని వచ్చిన ఆమె దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు అని అడగగా జెసి ప్రేగ్నెన్సీ కి సంబంధించిన రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను జానకి గారిని పిలవండి అని అంటుంది. అప్పుడు ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చిన ఆమెకు అవి ఇచ్చి మా కోడలు కండిషన్ ఎలా ఉందో చూసి చెప్పమ్మా అనగా జానకి టెన్షన్ గా అక్కడికి వస్తుంది.
 

67

అప్పుడు మల్లిక జానకి ఎందుకు ఆ రిపోర్ట్స్ చూసి టెన్షన్ పడుతోంది దాంట్లో ఏదో ఉంది ఎలా అయినా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి నాకు డాక్టర్ గారు ఫోన్లో అని చెప్పారు అత్తయ్య కడుపులో బిడ్డ పరిస్థితి అంతా బాగానే ఉంది అని అనగా జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది. జానకి రిపోర్ట్స్ ని తీసుకొని లోపలికి వెళ్లగా మల్లిక జానకిని ఫాలో అవుతూ లోపలికి వెళుతుంది. రిపోర్ట్స్ జానకి జాగ్రత్తగా దాచిపెట్టడంతో అందులో ఏదో ఉంది అనుకుంటూ ఉంటుంది అనుకొని జానకి అటు పక్కకు వెళ్లగానే మల్లిక లోపలికి వెళ్తుంది.
 

77

ఇంతలోనే పనిమనిషి చికిత వచ్చి అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తుంది. తర్వాత జెస్సిని తీసుకుని వచ్చి ఫంక్షన్ని మొదలుపెడతారు. ఫంక్షన్ జరుగుతూ ఉండగా అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ శ్రీమంతం గురించి అందరికీ వివరిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర దానికి వైపు చూస్తూ నా మనసులో మాట మీకు ఎప్పుడూ చెప్పలేదండి నాకు పిల్లలంటే చాలా ఇష్టం మీకు కూడా ఇలా ఫంక్షన్ ఎప్పుడెప్పుడు చేస్తారా అని నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని అంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved