- Home
- Entertainment
- Janaki Kalaganaledu: సీన్ అదిరిపోయింది.. జానకి లేకపోతే నేను లేను అమ్మ.. రామచంద్ర కోసం దిగివచ్చిన జ్ఞానంబ!
Janaki Kalaganaledu: సీన్ అదిరిపోయింది.. జానకి లేకపోతే నేను లేను అమ్మ.. రామచంద్ర కోసం దిగివచ్చిన జ్ఞానంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువు గల కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 20న ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో జానకి (Janaki), రామచంద్ర వేసిన రామాయణం కథలో రామచంద్ర మాటలకు జ్ఞానంబ కరిగిపోయి రామ దగ్గరికి వెళ్తుండగా.. ఆ సమయంలోనే సునందదేవి ఎంట్రీ ఇస్తుంది. అంతేకాకుండా జ్ఞానంబ (Jnanamba) కుటుంబ పరువును మొత్తం గంగ లో కలిపే ప్రయత్నం చేయాలని ప్రయత్నించింది.
ఇంటిదగ్గర బంధాలను దూరం పెట్టి ఇక్కడ అందరు ముందల కలిసినట్టుగా బాగా నటిస్తున్నారు జ్ఞానంబ అంటూ మాటలతో బాగా రెచ్చిపోతుంది సునంద. అయినా కూడా జ్ఞానంబ (Jnanamba) ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. జానకి (Janaki) మాత్రం మేము కలిసే ఉన్నామని అంటుంది.
కానీ సునంద (Sunandha) మాత్రం జ్ఞానంబను తన మాటలతో అస్సలు వదలట్లేదు. అంతలోనే యోగి కూడా వచ్చి సునంద మాటలకు మద్దతు పలుకుతాడు. తన చెల్లి చాలా బాధపడుతుంది అని అంటాడు. దాంతో గోవిందరాజులు, రామచంద్ర (Rama Chandra) షాక్ అవ్వగా జానకి మాత్రం తన అన్నయ్య మాటలను అస్సలు నిరాకరించదు.
అంతేకాకుండా తను మంచి జీవితం లో ఉన్నాను అనే చెప్పే ప్రయత్నం చేస్తున్న కూడా యోగి (Yogi) మాత్రం అస్సలు వినిపించుకోకుండా విడాకులు ఇప్పిస్తానని చెప్పి తన చెల్లిని అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. రామచంద్ర (Rama Chandra) ఎంత అడ్డు చెప్పిన కూడా అస్సలు పట్టించుకోడు యోగి.
ఈ సీన్ అంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మల్లిక (Mallika). జానకి ని యోగి తీసుకెళ్తుండగా రామచంద్ర బాగా ఎమోషనల్ అవుతాడు. జానకి లేకుంటే నేను ఉండలేను అని అనడంతో వెంటనే జ్ఞానాంబ తన కొడుకు కోసం తన కోడల్ని కలుపుకోవాలనుకుంటుంది. దాంతో జ్ఞానంబ యోగి (Yogi) దగ్గరికి వెళ్లి జానకి, రామచంద్రలను కలుపుతుంది.
దాంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఫీల్ అవుతారు. యోగి (Yogi) కూడా తన చెల్లి జీవితం చక్కబడిందని సంతోషంగా ఫీల్ అవుతాడు. అందరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోతారు. ఇక మల్లిక (Mallika) మాత్రం చిరాకు లో కనిపిస్తూ ఉంటుంది. రామచంద్ర, జానకిలకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది జ్ఞానంబ.
కానీ జ్ఞానంబ (Jnanamba) జానకిని పట్టించుకోకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా జానకి జ్ఞానంబ కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్న కూడా జ్ఞానంబ తన కొడుకు రామచంద్ర ఒక్కడిని దీవిస్తుంది. మొత్తానికి వనవాసం పూర్తయి ఇంట్లో అడుగుపెట్టిన కూడా జానకి (Janaki) కి మాత్రం ఇంకా కష్టాలు ఉన్నట్లు అర్థమవుతోంది.