- Home
- Entertainment
- Janaki Kalaganaledu: తల్లికొడుకును కలిపి సీతారాములు..మళ్ళీ జ్ఞానాంబ పరువును గంగలో కలిపిన జానకి అన్న!
Janaki Kalaganaledu: తల్లికొడుకును కలిపి సీతారాములు..మళ్ళీ జ్ఞానాంబ పరువును గంగలో కలిపిన జానకి అన్న!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతోంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సీతా రాముల వారి కళ్యాణం లో జ్ఞానాంబ దంపతుల పక్కన జానకి (Janaki) దంపతులు కూడా కూర్చుంటారు. ఈ క్రమంలో రామచంద్ర (Ramachandra) తన తల్లి కాళ్లు పట్టుకుంటాడు. కానీ తన తల్లి కాలును వెనుకకు లాగేసుకుంటుంది. ఆ తర్వాత పంతులుగారు జానకి దంపతులను మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు.
ఇక జానకి (Janaki) రామచంద్ర (Ramachandra) దంపతులు తన తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం పొందుతారు. ఇక రామచంద్ర మా అమ్మ ఆశీర్వాదం తీసుకునే అవకాశం ఇచ్చావు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను స్వామి అని వేడుకుంటాడు. ఆ తర్వాత రామచంద్ర వాళ్ళ చిన్న తమ్ముడు రామచంద్ర దంపతులు అయోధ్య ఘట్టం స్టేజ్ పై వెళుతున్న సంగతి తెలుపుతాడు.
ఇక ఆ ఘట్టాన్ని జ్ఞానాంబ (Jnanamba) చూడానికి ఇష్ట పడక పోగా.. ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూద్దాం అని బ్రతిమి లాడుతారు. ఇక గోవిందరాజు (Govindaraju) కూడా నీ మనసులో ఉన్న ఆనందాన్ని చిన్న చిన్న పదాలు కోసం దాచుకోవడం మంచిది కాదు అని ఎలాగైనా ఒప్పించి తీసుకొని వెళ్తాడు.
ఇక అయోధ్య ఘట్టాన్ని రామచంద్ర (Ramachandra) స్టేజ్ పై తన తల్లి పై తనకు ఎంతో గౌరవం ఉందో ఇండైరెక్టుగా రామాయణం రూపంలో చెబుతాడు. అంతే కాకుండా ఇంటి నుంచి పంపించేసావు అన్న భాద కంటే మా అమ్మ నుంచి దూరంగా వెళ్ళిపోయినా బాధ ఎక్కువగా ఉంది అని అంటాడు. ఈ క్రమంలో జ్ఞానాంబ (Jnanamba) మనసు కొంతవరకూ కరిగినట్టి అనిపిస్తుంది.
స్టేజిపై రామచంద్ర (Ramachandra) పర్ఫామెన్స్ అచ్చం తన తల్లి చెప్పే మాటలు లాగా అనిపిస్తాయి. దాంతో జ్ఞానాంబ కంట కన్నీరు పెడుతుంది. ఇక జ్ఞానాంబ తట్టుకోలేక రామచంద్ర దగ్గరకు వెళుతుండగా ఏం నటిస్తున్నారు జ్ఞానాంబ (Jnanamba) అని ఒక ఆవిడ అక్కడికి వస్తుంది.
ఆవిడ పక్కన యోగి (Yogi) కూడా ఉంటాడు. నిన్ను వీళ్ళ దగ్గర నుంచి కాపాడటానికి వచ్చాను అని తన చెల్లి జానకి కి తో అంటాడు. ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanamba) పరువు తీసేట్టుగా యోగి కొన్ని మాటలు కూడా అంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.