MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. ఆందోళన పడుతున్న గోవిందరాజు దంపతులు?

Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. ఆందోళన పడుతున్న గోవిందరాజు దంపతులు?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 27 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Dec 27 2022, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ ఆరుబయట భోజనాలకు సిద్ధం చేస్తూ ఉండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి ఏంటి జ్ఞానం అప్పుడప్పుడు పెళ్లయిన కొత్తలో ఏర్పాటు చేస్తావు ఇప్పుడు మళ్లీ పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయా అని అడుగుతాడు. చాల్లే ఊరుకోండి పిల్లలు వింటే నవ్వుతారు అక్కడ పిల్లలు వస్తున్నారు మౌనంగా కూర్చుండి అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు విష్ణు ఏంటమ్మా ఏంటి స్పెషల్ ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశావు అని అడగగా కూర్చొని చెప్తాను అని అంటుంది. ఈ మధ్యకాలంలో మనం సంతోషంగా ఉండి చాలా రోజులు అయింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అఖిల్ అయితే జైలుకు వెళ్లి వచ్చాడు. ఒకరికొకరం కలిసి మెలిసి గడిపింది లేదు అనగా వెంటనే మల్లిక అదేంటి అత్తయ్య గారు అందరూ ఒకే ఇంట్లో ఉన్నాం కదా అనగా గోవిందరాజులు మల్లికకు వెటకారంగా సమాధానం చెబుతాడు. అప్పుడు జ్ఞానాంబ చాలు ఆపండి ఎప్పుడు మామ కోడల్లా కాకుండా తోటి కోడళ్లాగా కొట్లాడుతూ ఉంటారు అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు రామచంద్ర అమ్మ ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అవును రామచంద్ర మొన్నటి వరకు అఖిల్ గురించి నాకు కొంచెం బాధగా ఉంది ఈరోజుతో ఆ భయాలన్నీ వెళ్ళిపోయాయి అని అంటుంది.
 

36

ఈ ఇంట్లో సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆ బాధ్యత అంతా నీదే రామా అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజులు నువ్వేం భయపడకు జ్ఞానాంబ బంగారం లాంటి కొడుకుల్ని ముత్యాలు లాంటి కోడళ్ళని ఇచ్చాడు ఆ దేవుడు అని అంటాడు. అప్పుడు గోవిందరాజులు ఒక్కొక్కరు గురించి గొప్పగా చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు జానకి మౌనంగా ఉండడంతో ఏమైంది జానకి అని జ్ఞానాంబ అడగగా ఏం లేదమ్మా అని రామచంద్ర కవర్ చేస్తాడు. అప్పుడు అఖిల్ పొద్దున చిన్న వదిన చెప్పింది నిజమే నాకు జాబ్ వచ్చింది అన్న సంతోషం పెద్ద వదిన ముఖంలో అస్సలు కనిపించడం లేదు అనుకుంటూ ఉంటాడు.
 

46

అప్పుడు మల్లిక సెటైర్స్ వేయడంతో  అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ అందరికీ గోరుముద్దలు పెట్టడానికి అన్నం కలుపుతూ ఉండగా అప్పుడు అఖిల్ అమ్మ ముద్దుల కొడుకు సంతోషానికి కారణం నేనే కాబట్టి అమ్మ ఫస్ట్ గోరుముద్దులు నాకే తినిపిస్తుంది అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అందరికీ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఉండగా జానకి మాత్రం బాధపడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం జ్ఞానాంబ దంపతులు పూజ చేయించడానికి గుడికి వెళ్తారు. అప్పుడు జ్ఞానాంబ గుడిలో టెంకాయ కొట్టడంతో కుళ్ళిపోతుంది.
 

56

అది చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది. అప్పుడు గోవిందరాజు దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు మళ్లీ పంతులు గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు గుడిలో పూజారి కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే ఆ పరమేశ్వరుడు ఏదో దోషం సూచిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు పూజారి పరిహారం చెప్పడంతో సరే అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు గుడిలో దేవుడు ముందు పెట్టిన కలిశం ని తీసుకొని గోవిందరాజులుకు ఇస్తాడు పూజారి. మరొకవైపు మల్లిక చీరలు కుట్టుకుంటూ ఉంటుంది. అది చూసి చికిత సెటైర్లు వేస్తూ ఉంటుంది.
 

66

అప్పుడు రామచంద్ర షాప్ కి వెళ్తుండగా జానకి సేవలు చేస్తుండడంతో అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పుడు జ్ఞానాంబ చేతుల్లో కలశం చూసి మల్లిక ఏంటది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లిక వెళ్లేటప్పుడు ఏమో వీళ్ళు బాగా హుషారుగా వెళ్లారు కానీ ఇలా దిగాలిగా వస్తున్నారు. ఇందులో కలశం కూడా ఉంది అసలు ఏం జరిగిందో చూద్దాం పద అని చెప్పి చికితను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Recommended image2
Kangana Ranaut: నువ్వొక యూజ్‌లెస్‌.. పనిచూసుకో, కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది, ఎవరికో తెలుసా?
Recommended image3
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved