MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జ్ఞానాంబ దంపతులను చూసి బాధపడుతున్న జానకి.. నిజం తెలుసుకునే పనిలో మల్లిక?

Janaki Kalaganaledu: జ్ఞానాంబ దంపతులను చూసి బాధపడుతున్న జానకి.. నిజం తెలుసుకునే పనిలో మల్లిక?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 16వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 16 2022, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈ రోజు ఎపిసోడ్ లో జెస్సికి ప్రేగ్నెన్సీ ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు రామచంద్ర జానకి వైపు చూసి సంతోషంగా ఉండగా మీకు ఇన్ని రోజులు ఒక విషయం చెప్పకుండా దాచానండి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కూడా అలా ఫంక్షన్ చేస్తే చూడాలని ఉంది అని అనుకుంటూ జానకి ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఉంటాడు రామచంద్ర. ఇంతలో జానకి ఏమైంది ఏం ఆలోచిస్తున్నారు రామచంద్ర గారు అని అడగగా ఏమీ లేదు అని అంటాడు రామచంద్ర.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పర్లేదు రామచంద్ర గారు చెప్పండి అని అనడంతో మీరు ఏమీ అనుకోకూడదు జానకి గారు అని అంటాడు పర్లేదు చెప్పండి రామా గారు అని జానకి అడగగా మీకు శ్రీమంతం చేస్తున్నట్టు ఊహించుకున్నాను అని అనగా జానకి సిగ్గుపడుతూ నాకు శ్రీమంతం చేయాలని అనుకుంటున్నారు అన్నమాట అనగా వెంటనే రామచంద్ర లేదు జానకి గారు దానికి ఇంకా చాలా సమయం ఉంది అని తప్పించుకుంటాడు. మీరు చదవాలి పరీక్షలు రాయాలి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వాలి ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని అంటాడు. మరొకవైపు మల్లిక ఒక ముసలావిడ దగ్గర కూర్చొని పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు ఇక్కడే కూర్చో అని పక్కనే ఉన్న వారికి నీళ్లు తీసుకురామని చెబుతుంది.
 

36

 అప్పుడు మల్లికా టెన్షన్ పడుతూ ఎలా అయినా రిపోర్ట్స్ చదవాలి ఈమె చూస్తే పంపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటుండగా పక్కనే ఉన్న ఆవిడ మల్లిక ను అక్కడి నుంచి వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. దాంతో మల్లిక సన్నగా పక్కకు జరుగుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి జానకి దాచిన ఆ రిపోర్ట్స్ని చూడాలి అనుకొని రూమ్ లోకి వెళుతుంది మల్లిక. ఆ తర్వాత జానకి ఫంక్షన్ జరుగుతూ ఉండగా మల్లిక కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

46

మరొకవైపు మల్లిక ఆ రిపోర్ట్స్ తీసుకొని జానకి గదిలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జానకి గదిలోకి వెళ్లి ఆ రిపోర్ట్స్ చూడగా అక్కడ కనిపించకపోవడంతో షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్లాయి ఏమైపోయాయి అని వెతుకుతూ ఉంటుంది జానకి. కొంపతీసి మల్లిక ఏమైనా తీసి ఉంటుందా అని మల్లిక ని వెతుకుతూ బయటికి వెళ్తుంది జానకి. మరోవైపు శ్రీమంతం జరుగుతూ ఉండగా అప్పుడు జానకి, మల్లిక కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లిక ఇప్పటివరకు నాతో ఆడుకున్నావు కదా ఇకనుంచి నీతో నేను ఆడుకుంటాను చూడు జానకి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జానకి టెన్షన్ పడుతూ ఉండగా రామచంద్ర ఏం జరిగింది అనడంతో ఏమీ లేదు అని అబద్ధం చెబుతుంది జానకి.
 

56

తర్వాత శ్రీమంతం ఫంక్షన్ ని ముగిస్తారు. ఆ తర్వాత జానకి రిపోర్ట్స్ ఏమయ్యాయ అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి జ్ఞానాంబ మాటలు తలచుకుని జెస్సి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు పనిమనిషి చికిత ఏమైంది జానకమ్మ గారు ఫంక్షన్ లో నుంచి మీరు ఏదోలా ఉన్నారు అని అనగా ఏం లేదు చికిత అని అంటుంది. ఫంక్షన్ బాగా గ్రాండ్గా జరిగినందుకు జ్ఞానాంబ దంపతులు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు జెస్సీ గురించి మాట్లాడుకుంటూ సంతోషపడుతూ ఉండగా జానకి అక్కడికి వచ్చి వారి మాటలు విని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జానకి వెళుతుంది.
 

66

 అప్పుడు జ్ఞానాంబ జానకి జెస్సిని మళ్లీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావు అని అడగగా కొద్దిరోజులు ఆగిన తర్వాత మళ్ళీ పిలుచుకొని వెళ్లాలి అని అంటుంది జానకి. ఆ తర్వాత జానకి తన గదిలోకి వెళ్లి అత్తయ్య గారు మీకు నిజం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. జెస్సి కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదు అని తెలిస్తే మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది జానకి. తర్వాత జానకి రిపోర్ట్స్ ఏమయ్యాయి అని తన గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు రిపోర్ట్స్ ఓపెన్ చేసిన మల్లిక అందులో ఇంగ్లీష్ ఉండడంతో అర్థం కాక ఏడుపుముఖం పెడుతుంది. మరి ఇందులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది మల్లిక. ఆ తర్వాత ఆ రిపోర్ట్ అర్థం కాకపోవడంతో బయటకు వెళ్లి జెస్సీకి చూపించాలి అనుకుంటుంది. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి మల్లికని చూస్తూ ఉంటుంది. అప్పుడు మల్లిక జెస్సీ దగ్గరికి వెళుతుండడం చూసిన జానకి ఎలా అయినా  మల్లికను ఆపాలి అనే అక్కడికి వెళుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved