- Home
- Entertainment
- Prema Entha Madhuram: వశిష్ఠకు నరకం చూపిస్తున్న జిండే.. రాగసుధ కోసం వెయిట్ చేస్తున్న అను.. అసలు ట్విస్ట్?
Prema Entha Madhuram: వశిష్ఠకు నరకం చూపిస్తున్న జిండే.. రాగసుధ కోసం వెయిట్ చేస్తున్న అను.. అసలు ట్విస్ట్?
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తల్లిదండ్రులతో గత జన్మ పరిచయం అని చెప్పిన అను తర్వాత గతంలో పరిచయం అని కవర్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ నాన్న తో రాగసుధ (raga sudha) ను తీసుకురమ్మని చెబుతుంది.

మరోవైపు జిండే, వశిష్ఠ (Vasista) ను ఒక చోట బందించి రాగసుధ ఎక్కడ ఉంది అని అడుగుతూ..కొడుతూ ఉంటాడు. ఈలోగా అక్కడకు ఆర్య వచ్చి మనకు కావాల్సింది రాగ సుధ ఇతడిని వదిలేయ్ అని చెబుతాడు. ఒకవైపు నీరజ్ (Neeraj) వాళ్ళ అమ్మని జిండే, వశిష్ట లు రెండు రోజుల నుంచి కనపడటం లేదు అని అడగగా 'వశిష్ట మనకు చేసిన మంచికి గాను జిండే, వశిష్ఠ రుణం తీర్చుకుంటున్నాడు అని కవర్ చేస్తుంది.
మరోవైపు అను (Anu) వాళ్ల తండ్రితో రాగసుధను తీసుకు రమ్మని చెప్పి టిఫిన్ సెంటర్ దగ్గర అను, వాళ్ళ మమ్మీ, ఎస్సై ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా లేట్ అవడంతో అను వాళ్ళ అమ్మ పై విరుచుకు పడుతుంది. ఆలోగా సుబ్బు (Subbu) వచ్చి తను కనిపించలేదు అమ్మ అని చెబుతాడు.
దాంతో అను (Anu) ..తెగ కంగారు పడిపోతు కనిపించక పోవడం ఏంటి? అని వాళ్ల నాన్న పై కోపడుతుంది. ఈలోగా అక్కడకు ఆర్య వస్తాడు. అను లేటవుతుంది వెళ్దామా అని అడగగా.. నేను ఇంకా తనని కలవలేదు సార్ అని టెన్షన్లో అనేస్తుంది. తనెవరు అని ఆర్య (Arya) అడగగా తను నా ఫ్రెండ్ అని కవర్ చేసుకుంటుంది.
ఇక అను (Anu) వెళ్లక తప్పదు అని ఆర్య చెప్పడంతో అక్కడి నుంచి అను వెళ్లిపోతుంది. తను వస్తే నాకు చెప్పండి అని వాళ్ళ అమ్మానాన్నలతో ఒకటికి పది సార్లు చెబుతుంది. ఆ తర్వాత సుబ్బు పద్దులు వాళ్ళ ఇంటికి వెళ్లగా.. రాగ సుధ (Raga sudha) వాళ్ళింట్లో ఎదురుచూస్తూ ఉంటుంది. రాగసుధ కు వాళ్ళిద్దరు జరిగినదంతా చెబుతారు.
కానీ రాగసుధ (raga sudha) అనుతో నాకు ఎటువంటి పరిచయం లేదు బాబాయ్ అని చెబుతుంది. ఒకసారి అనుకి కాల్ చేయమంటావా అమ్మా.. అని అడగగా రాగసుధ చేయండి అంటుంది. ఈలోపు పద్దు (Paddu) ఆ ఫోన్ లాక్కొని రాగసుధ ను రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడదాం అంటుంది. ఇన్ని ట్విస్ట్ ల మధ్య నడుస్తున్న ఈ సీరియల్ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.