MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: అఖిల్ ని జెస్సి గురించి ప్రశ్నించిన జానకి.. తల్లిదండ్రులకు నిజం చెప్పిన జెస్సి!

Janaki kalaganaledu: అఖిల్ ని జెస్సి గురించి ప్రశ్నించిన జానకి.. తల్లిదండ్రులకు నిజం చెప్పిన జెస్సి!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Sep 05 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి నిద్రపోతూ ఉంటుంది.ఏడు అయిన సరే నిద్ర లేవదు,రామా వెళ్లి జానకిని లేపుతాడు. అప్పుడు జానకి లేచి  అమ్మో ఇంత టైం అవుతుంది అని నేను అనుకోలేదు అని వెంటనే బయలుదేరుతుంది. అప్పుడు రామా ఈ రోజు నాకు స్వీట్ షాప్లో ఒక బేరం కుదిరింది కనుక నాకు దింపడానికి వీలు అవ్వదు,ఈరోజుకు మీరే కాలేజీకి వెళ్లిపోండి అని అంటాడు. ఆ తర్వాత సీన్లో మల్లికా విష్ణుతో, అప్పుడు అత్తయ్య గారు మనకు డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తానన్నారు కదా దాని గురించి అడగండి అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

విష్ణు ఇప్పుడు వద్దు అని అంటాడు,కానీ మల్లి బలవంతంగా వెళ్లి అడిగిపిస్తుంది. అప్పుడు జ్ఞానాంబ, నాకు జానకి చదువు విషయం అప్పుడు తెలియదు కాబట్టి మీకు ఇస్తానన్నాను కానీ ఇప్పుడు ఏ నిమిషం ఏ అవసరం వస్తుందో తెలీదు. ఒకవేళ ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చినట్టు అయితే తర్వాత అవసరానికి నేను ఇంకొకరి దగ్గర డబ్బులు కోసం చేయి చాచాలి, అది నాకు నచ్చదు. పైగా ఈ మధ్య అఖిల్ కూడా రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నాడు. పై చదువులు చదవాలని ఆశ కూడా ఉన్నది అని చెప్పాడు.
 

37

దానికి కూడా డబ్బులు కావాలి అని అంటుంది.అప్పుడు విష్ణు మల్లికతో, నీ వల్ల మా అమ్మ ముందు నాకు మాట వచ్చింది అని అంటాడు.తర్వాత సీన్ లో జానకి అఖిల్ దగ్గరికి వెళ్లి, ఉదయం నుంచి నా దగ్గర నుంచి బాగా తప్పించుకుంటున్నావు, ఇంత తప్పు చేసి ఏం తెలియనట్టు ఉన్నావు అయినా ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత రచ్చ అవుతుందో తెలుసా అని అడగగా జెస్సీ ఇదంతా కావాలని చెప్తుంది వదిన దానికి నాకు ఏం సంబంధం లేదు అని అంటాడు.
 

47

తను నిన్ను అంత ప్రేమించి పెళ్లికి ముందు తప్పు చేసింది అఖిల్. కానీ నువ్వు తన్ని ఇంత మాట అంటావా అసలు నీకు బాధ్యత లేదా ఇప్పుడు ఒప్పుకుంటే నేను నీకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాను లేకపోతే ఇప్పుడే అందరి ముందు నిజం చెప్తాను. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి అని ఫోటోలు చూపిస్తూ ఉండగా అక్కడ ఫోటోలు లేకపోవడం గమనిస్తుంది.ఓహో ఈమధ్య ఇంత ఎదిగి పోయావా ఫోటోలు తీసేసినంత మాత్రాన నిజం చెరిగిపోదు అఖిల్, DNA రిపోర్ట్ లు ఉంటాయి.
 

57

దానికి నువ్వు ఏ సమాధానం ఇస్తావు?నీకు సాయంత్రం కల్లా టైం ఇస్తున్నాను. నువ్వే తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జెస్సి వాళ్ళ అమ్మానాన్న, జెస్సిని, నీకు కడుపు కారణమైన మనిషి ఎవరు అని అడుగుతారు. జెస్సి,మనసులో ఇప్పుడు అఖిలే అని చెప్తే అఖిల్ చనిపోతాడు అని అన్నాడు.కొన్ని రోజులు ఆగి చెబుదాము అని అనుకుని, నాకు ఇంకొంచెం సమయం కావాలి అని అంటుంది. మాకు విషయం ఇప్పుడే తెలియాలి.
 

67

చెప్పకపోతే మేము విషయం తాగి చచ్చిపోతాము అని వాళ్ళిద్దరూ విషం తాగుబోతుండగా జెస్సి వాళ్ళని వెళ్లి ఆపి జ్ఞానాంబ గారి మూడో కొడుకు అఖిల్ అని అంటుంది.అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు.ఆ తర్వాత సీన్లో మల్లిక జంతికలు చేగోడీలు, కుంకుమ పువ్వు పాలు అన్నీ చికీత చేత తెప్పించుకుంటుంది. అప్పుడు చికిత,అసలు మీకు నిజంగా కడుపు ఉందా అమ్మగారు? కడుపున వాళ్ళకి ఏం తినబుద్ధి వెయ్యదు కానీ మీరు ఇలా తింటున్నారు.
 

77

బ్రహ్మదేవుడు మీకు కడుపు చేయడానికి ఎక్కువ సమయం కేటాయించి తయారు చేసినట్టున్నాడు అని అనగా అన్ని వేల్లు ఒకేలా ఉండవు చికిత. అలాగే అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు అని అంటుంది. ఇంతలో జానకి వచ్చి అఖిల్ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు చికిత తన గదిలో ఉన్నాడు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి
Recommended image3
Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved