- Home
- Entertainment
- Charan Eliminate: బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం డబుల్ ఎలిమినేషన్.. చరణ్ ఎలిమినేట్
Charan Eliminate: బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం డబుల్ ఎలిమినేషన్.. చరణ్ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్ అయినట్టు తెలిపింది. ఇక ఇప్పుడు చరణ్ కూడా ఎలిమినేట్ అయ్యాడట.

ఐదో వారం డబుల్ ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో వారంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ వారంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలిమినేషన్‌కి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఈ వారంలో నామినేషన్‌లో షాలిని, నరేష్, చరణ్, రోహిత్, ముఖేష్, అపూర్వ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందట. ఇప్పటికే అపూర్వ ఎలిమినేట్ అయ్యిందని తెలిసింది.
చరణ్ ఎలిమినేట్
ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అందులో భాగంగా చరణ్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం. బయటకు వచ్చింది. వైల్డ్ కార్డ్ ఉన్న నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. అందులో భాగంగా అపూర్వతోపాటు చరణ్ కూడా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు చరణ్. మూడో వారంలో మళ్లీ తీసుకొచ్చారు. కానీ ఆయనలో పెద్దగా మార్పు లేదు. ఆట తీరు మారలేదు. పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఆయన్ని ఇంటికి పంపించారట.
ఐదో వారం చరణ్, అపూర్వ ఔట్
ఐదో వారంలో అపూర్వతోపాటు చరణ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా ఈ సమాచారం లీక్ అయ్యింది. ఇది ఆదివారం టెలికాస్ట్ కాబోతుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి షూటింగ్ కూడా జరిగింది. ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారు. వారిలో రామకృష్ణ, శివకుమార్, స్వేత నాయుడు, దక్షి, నీతూ నటరాజ్ రాబోతున్నారట. మరి వీళ్లు ఎంత వరకు మెప్పిస్తారు. కంటెంట్ ఇస్తారో చూడాలి.
అపూర్వ, చరణ్ ఎలిమినేట్ అయితే హౌజ్‌లో రామ్ ప్రసాద్, నరేష్, దేబ్జానీ, టెంపర్ వంశీ, ముఖేష్ గౌడ, సుధీర్ రెడ్డి, రోహిత్, అమన్, త్రిగుణ్, సింగర్ ఝాన్సీ, షాలిని, వర్షిణి ఉంటారు. వీరికి ఇప్పుడు కొత్తగా రాబోతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు యాడ్ అవుతారు. ఇప్పటికే హౌజ్ నుంచి శ్రష్టి, మిథిలేష్, కృష్ణుడు, చైత్ర రాయ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

