Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో పరిణామాలు ఎప్పటికప్పుడు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో అపూర్వ, రోహిత్ టార్గెట్ గా కథ అంతా నడిచింది. రోహిత్ కు కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ నాగార్జున కూడా గట్టిగానే ఇచ్చుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో మారుతున్న పరిస్థితులు..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్ సీజన్ 10' వీకెండ్ ఎపిసోడ్‌లతో మరింత ఆసక్తికరంగా మారింది. వారంమొత్తం హౌస్‌లో జరిగే గొడవలు, డ్రామాలు, నామినేషన్ల వివాదాలపై హోస్ట్ అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ప్రసారమైన ఐదో వారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ షాలిని ప్రవర్తనపై నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం హౌస్‌మేట్స్‌తో పాటు వీక్షకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.

నామినేషన్ల గొడవలపై నాగార్జున సీరియస్ క్లాస్

ఐదో వారం నామినేషన్ల ప్రక్రియలో హౌస్‌లో తీవ్ర స్థాయిలో అరుపులు, గోలలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా షాలిని, అపూర్వ, రోహిత్‌ల మధ్య జరిగిన సంభాషణలు, హౌస్‌మేట్స్‌పై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో స్టేజ్ మీదికి వచ్చిన నాగార్జున ఎటువంటి మినహాయింపు లేకుండా నామినేషన్లలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. నామినేషన్ల సమయంలో షాలిని ప్రవర్తించిన తీరు, ఆమె మాట్లాడిన భాష, అనవసరపు డ్రామాపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

షాలినికి మైండ్ బ్లాంక్ అయ్యేలా వార్నింగ్

హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో వ్యవహరించేటప్పుడు హద్దులు దాటకూడదని నాగార్జున స్పష్టం చేశారు. "మీరు హౌస్‌లో ఏం చేస్తున్నారో, ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో ప్రేక్షకులు గమనిస్తున్నారు" అని హెచ్చరించారు. ఆటను పక్కనపెట్టి కేవలం అరుపులు, డ్రామాలు మరియు గ్రూపిజంతో కాలం గడిపితే ఊరుకునేది లేదని నాగ్ తీవ్రంగా మందలించారు. నాగార్జున అంత సీరియస్‌గా క్లాస్ పీకడంతో షాలిని ఒక్కసారిగా షాక్‌కు గురై ముఖం చిన్నబోయింది. నాగ్ వేసిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేక ఆమె తడబడింది.

హౌస్‌లో మారనున్న సమీకరణాలు

నాగార్జున ఇచ్చిన ఈ గట్టి షాక్‌తో హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లలో కూడా భయం మొదలైంది. కేవలం వివాదాలు సృష్టించడం లేదా కంటెంట్ కోసం ఓవరాక్షన్ చేస్తే ప్రేక్షకుల మద్దతు లభించదని నాగ్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

ఆ తరువాత రాం ప్రసాద్ వంతు వచ్చింది. ‘రాం ప్రసాద్.. పవిత్రమైన పెళ్లి సంగతి గురించి మాట్లాడుకుందామా?’ అంటూ వాయింపు స్టార్ట్ చేశారు నాగార్జున. అయితే ఈ ఇష్యూలో అపూర్వను అడ్డంగా బుక్ చేసేసింది షాలిని. ‘బిగ్ బాస్ చెప్పారు.. కంటెంట్ కోసం మంచి అబ్బాయిని చూసుకోమని.. సో నాకు మంచి అబ్బాయిని చూడు అని అపూర్వ నాతో చెప్పింది సార్’ అని అన్నాడు రాం ప్రసాద్.

‘ఆమె సరదాగా అని ఉండొచ్చు కదా’ అని నాగార్జున అంటే.. ‘లేదు సార్.. నేను అడిగింది పవిత్రమైన పెళ్లి కోసం అని చెప్పింది సార్’ అని అన్నాడు రాం ప్రసాద్. అప్పుడు అపూర్వ.. ‘అబ్బాయిని సెట్ చేయండి.. లవ్ కంటెంట్ చేసుకుంటా.. అనే అభిప్రాయం లేదు సార్.. ఎవరిపైనా లేదు సార్’ అని అంది. ‘లేదు సార్.. ఆమె అబద్ధం చెప్తోంది’ అంటూ షాలిని లేచింది.

మరోసారి టార్గెట్ అయిన రోహిత్..

తాజా ఎపిసోడ్‌లో అసలు హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరో తేల్చడానికి, ముఖంపై స్టాంప్ వేసే గేమ్ పెట్టారు నాగార్జున. అందులో అత్యధికంగా 5 స్టాంప్‌లు రోహిత్‌కు పడ్డాయి. చరణ్‌కు నాలుగు పడ్డాయి.

"అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్.. నీకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావ్?" అని రోహిత్‌కు ఓ టాస్క్ ఇచ్చారు. రోహిత్ తనకు తాను ఇచ్చుకున్న మార్కులు విని అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. 10కి 9 మార్కులు ఇచ్చుకున్నాడు రోహిత్. "ఈ వీక్ నువ్వు గేమ్ గెలవలేదు కదా.. ఎలా 9 ఇచ్చుకుంటావ్?" అని రోహిత్ గాలి తీసేశారు నాగ్. అంతేకాదు, షాలినితో అర్థరాత్రి మాటల విషయంలో కూడా పంచ్‌లు వేశారు.

చివర్లో రోహిత్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు నాగార్జున. ‘సుధీర్ అన్న మాటనే గుర్తు చేస్తున్నా.. ‘మేలుకో రాజా మేలుకో’ అంటూ సెటైర్ వేశారు. తన అభిమానులు కూడా ఈ వీక్ రోహిత్ డల్ అయ్యాడని డైరెక్ట్‌గా ఆడియన్స్ నుంచి చెప్పించడం విశేషం. మొత్తానికి ఈ వీకెండ్‌లో రోహిత్‌ను టార్గెట్ చేసి, అతని గ్రాఫ్‌ను ఇంకాస్త పెంచారు టీమ్.