- Home
- Entertainment
- Janaki kalaganaledu: మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. అఖిల్ మాటలకు బాధపడుతున్న జెస్సి!
Janaki kalaganaledu: మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. అఖిల్ మాటలకు బాధపడుతున్న జెస్సి!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జానకి కుంకుమపువ్వుతో పాలు కలిపి రెండు గ్లాసులు జెస్సి కి,మల్లిక కి తయారుచేస్తుంది.అప్పుడు జెస్సి అక్కడికి వస్తుంది. జెస్సి నువ్వు ఇలాగే ఉంటే అత్తయ్య గారు నీతో మాట్లాడే అవకాశం దగ్గర్లోనే ఉన్నదనిపిస్తుంది అని అంటుంది. దానికి జెస్సి ఏం మాట్లాడుతున్నావు అక్క నిజంగానా అని అనగా,అవును జెస్సీ,అత్తయ్య గారు ఎప్పుడూ ఇంటి బయటకు కదలరు కానీ నీకోసం, మల్లిక కోసం బయటకు వెళ్లి కుంకుమపువ్వు తెచ్చారు అని అనగా, జెస్సి ఆనందపడి పాల గ్లాస్ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మల్లికా నీలావతి పెద్దమ్మకి ఫోన్ చేసి,పెద్దమ్మ నా ప్లాన్ ఫెయిల్ అయింది అందుకని ఇంకో మార్గంలో వెళ్ళాను. ఇది కచ్చితంగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను అని అనగా నీలావతి ,జాగ్రత్త మల్లికా ఎవరికి నీ మీద అనుమానం రాకుండా చూసుకో అని అంటుంది.
అప్పుడు మల్లిక, నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది పెద్దమ్మ అని మల్లికా ఫోన్ లో ఒక ప్లాను నీలావతికి చెప్తుంది. వెనకనుంచి పాల గ్లాస్ తెచ్చిన జానకి ఇదంతా వింటుంది. జానకిని గమనించిన మల్లిక, నేను తర్వాత చేస్తాను పెద్దమ్మ అని ఫోన్ పెట్టేస్తుంది.ఏం జానకి ఇటువైపు వచ్చావు అని అనగా, నువ్వు చేస్తుంది తప్పు మల్లిక అని జానకి అంటుంది. అంతా వినిసిందా అని భయపడి, దేని గురించి మాట్లాడుతున్నావు జానకి అని మల్లిక అంటుంది. కడుపుతో ఉండి ఇలా ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడడం తప్పు కదా మల్లిక. ఇదిగో అత్తయ్య గారు నీ కోసం పాలు ఇవ్వమన్నారు కడుపులో బిడ్డకు మంచిది అని అనగా, అబ్బా ఇది ఒకటి కదా! బెడ్డే లేనప్పుడు దీనివల్ల ఏం ఉపయోగం ఇవి ఎక్కువ తాగితే కడుపులో వేడి చేస్తుంది.
ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకొని, నా కడుపులో ప్లేస్ లేదు జానకి తర్వాత తాగుతానులే అని అంటుంది.అప్పుడు జానకి, నీ పద్ధతేమీ బాలేదు మల్లిక, పాలు గురించి నేను మాట్లాడడం లేదు ఇందాక నువ్వు మాట్లాడిన విషయాలు అన్నీ నేను విన్నాను. ఉదయం జెస్సిని కావాలని అత్తయ్య గారు ముందు ఇరికించాలని చూసావు, జెస్సి తల్లిదండ్రులు ఫోన్ చేసింది నువ్వే అని కూడా నేను పసిగట్టగలిగాను. నేను నీకు ముందే చెప్పాను నీ పద్ధతి మార్చుకోమని కానీ నువ్వు వినలేదు.మళ్లీ చెప్తున్నాను ఈసారి పద్ధతి మార్చుకోకపోతే నేను ఇంకొక విధంగా ప్రవర్తించాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మల్లిక,ఇదేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది అని కోపంగా ఉంటుంది. ఆ తర్వాత సీన్లో జెస్సి ఆనందంగా అఖిల్ దగ్గరికి వచ్చి, అఖిల్ ఈరోజు నాకు ఆనందంగా ఉన్నది. అత్తయ్య గారు నా కోసం వెళ్లి కుంకుమ పువ్వులు తెచ్చారట అని అనగా అఖిల్, మల్లిక చెప్పిన విషయాలు గుర్తుతెచ్చుకొని, బాగా ఆనందంగా ఉన్నావు కదా!
నీకు అదే కావాలి కదా నువ్వు, అమ్మ ఒకటై పోవాలి, నేను ఇంట్లో ఏమైపోయినా పర్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అని అనగా, అలా మాట్లాడతావ్ ఏంటి అఖిల్ నీవల్లే నాకు ఇంట్లో స్థానం వచ్చింది. నేను నీకు ఎందుకు చెడు చేయాలని చూస్తాను అని అనగా, మరి ఇన్ని రోజుల నుంచి నేను తినడం మానేసి అమ్మ మాట్లాడట్లేదు అని ఏడుస్తుంటే, అమ్మ మాత్రం నీ కోసం వెళ్లి అవన్నీ తెస్తుంది. నన్ను పట్టించుకోవట్లేదు అని అంటాడు అఖిల్.అప్పుడు జెస్సీ,నువ్వు ప్రతిరోజు భోజనం చేయడం లేదని నేను చాలా బాధపడుతున్నాను అఖిల్ కానీ అని జెస్సి అనే లోగా అఖిల్ జస్సీ చేతిలో ఉన్న పాల గ్లాసు ను కింద పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి ఆ శబ్దం చూసి అక్కడికి వస్తుంది.
అప్పటికే జెస్సి ఏడుస్తూ, చూసేవా అక్క నేను ఎందుకు అఖిల్ గురించి అలా అనుకుంటాను? నన్ను ఎందుకు అఖిల్ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు? అని ఏడుస్తుంది.అప్పుడు జానకి, ఆలా ఏం లేదు జెస్సి అత్తయ్య గారు అఖిల్తో సరిగ్గా మాట్లాడటం లేదు కదా అందుకే అలాగా ఉన్నట్టున్నాడు. అత్తయ్య గారు మాట్లాడితే అఖిలే సర్దుకుంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత సీన్లో మల్లిక తన గదిలో విష్ణు పడుకున్నప్పుడు, అయినా జానకి ఏంటి నాకే వార్నింగ్ ఇస్తుంది? ఇప్పటివరకు నేను కామెడీ విలన్ లాగా ఉన్నాను కానీ ఇప్పటినుంచి సీరియస్ గా ఉండాలి.
ఇన్ని ఎపిసోడ్లు నుంచి నాకు ఓటమి వచ్చినా సరే ఒక్క ప్లాన్ తో సీజన్ చివరి వరకు నాదే పై చేయ్యి అవ్వాలి. ఎలాగైనా జానకి చదువు ని ఆపి,పోలీస్ అవ్వకుండా చేసి జానకిది, నాది ఇంట్లో ఒకే స్థాయి అని చెప్పాలి అని అనుకుంటుంది. పక్కనే విష్ణు గుర్రుపెట్టి పడుకుంటూ ఉండగా మల్లికా విష్ణు ని కొట్టి లేపుతుంది.ఎందుకు కొట్టావు మల్లికా నిద్రలో ఉన్నాను కదా అని విష్ణు అనగా, చంప మీద దోమ కుడితే దాన్ని కుట్టకుండా కొట్టాను అని చెప్పి పడుకుంటుంది మల్లిక. ఆ తర్వాత సీన్లో జానకి చదవడం లేదని, అలా ఇంటి బాధ్యతలు గురించి ఆలోచిస్తుంది అని రామా బాధపడుతూ ఆలోచనలలో పడతాడు.
ఇంతలో జానకి అక్కడికి వచ్చి, పుస్తకం తీస్తుంది.అప్పుడు రామ పుస్తకం మూసి, మీకెందుకు జానకి గారు నా బాధ అర్థం కావడం లేదు. నేను బాగా పరీక్షలు రాయాలని కోరుతుంటే మీరు ఇలా ఇంటి పనులు, వంట పనులు అనుకొని కూర్చుంటున్నారు. రాత్రులు చదువులు మానేసి జెస్సికి పద్ధతులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా పాలు ఇస్తానని చెప్పి ఇంతసేపటికి వచ్చారు అసలు మీకు చదువుకోవాలని ఉన్నదా లేదా అని అనగా, అలా కాదు రామ గారు, ఇంటి బాధ్యతలు ఉంటాయి కదా. అక్కడ జెస్సికి, అఖిల్ కి మనస్పర్ధలు పెరుగుతున్నాయి.
మనిద్దరం వాళ్ళకు పెళ్లి చేసింది వాళ్ళు సంతోషంగా ఉండాలని, తీరా ఇక్కడికి వచ్చి వాళ్ళు బాధగా ఉంటే పెద్దవాళ్ళం మనం వాళ్ళని చూస్తూ ఊరుకోలేము కదా. వాళ్ళని మంచిదారిలో పెట్టాల్సిన బాధ్యత మనదే కదా అని అనగా, అవి ఎప్పుడూ ఉండేవే కదండీ అవి ఎప్పటికైనా తీరుతాయి ముందు మీరు చదవండి. మనం దాని గురించి తర్వాత ఆలోచిద్దాము అని జానకిని చదువుపిస్తూ ఉంటాడు రామా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!