MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: పెళ్లి చేసుకున్న అఖిల్, జెస్సీలు.. షాక్ లో మల్లిక?

Janaki Kalaganaledu: పెళ్లి చేసుకున్న అఖిల్, జెస్సీలు.. షాక్ లో మల్లిక?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 21 2022, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ,జెస్సీ వాళ్ళ తల్లిదండ్రులతో, మా అఖిల్ మీద నాకు నమ్మకం ఉన్నది అఖిల్ తప్పు చేయలేదు. ఈ పెళ్లి జరగడం అసంభవం. ఇంక మీరు బయలుదేరచ్చు అని అంటుంది.అప్పుడు గోవిందరాజు,ఎలాగా జానకికి నువ్వు గడువు ఇచ్చావు కదా అప్పటివరకు ఆగు జ్ఞానం, తర్వాత జానకి నిజం నిరూపించకపోతే అప్పుడు ఒక మాట చెప్పొచ్చు అని అంటాడు. అప్పుడు జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు,రేపు సాయంత్రం వస్తాము మీరు పెళ్లి చేస్తాను అంటే సరే సరే.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో మీ ఊహకు కూడా అందదు అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత జ్ఞానాంబ జానకి దగ్గరికి వచ్చి, రేపు నిమజ్జనం ఉన్నది దానికి ఏ లోటు రాకుండా దానికన్నా ముందే  నిజం నిరూపించాలనుకుంటే నిరూపించు. ఒకవేళ నిజం నిరూపించలేక పోతే ఇంకెప్పుడూ జెస్సి ప్రస్తావన ఈ ఇంట్లో రాకూడదు అని అంటుంది. అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. జ్ఞానాంబ ఉయ్యాల మీద కూర్చొని జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉంటుంది. 
 

38

మరోవైపు రామా జానకి లు కూడా ఆలోచనలో పడతారు. సమయం చాలా తక్కువ ఉన్నది ఎలాగైనా అఖిల్ ని ఒప్పించాలి అని అనుకుంటారు. మరోవైపు అఖిల్, రేపు సాయంత్రం వరకు నేను జాగ్రత్తగా ఉంటే చాలు ఈలోగా ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకేం తెలియనట్టే ఉంటాను తర్వాత ఎలాగ జెస్సీ ప్రస్తావన ఇంట్లో రాదు అని అనుకుంటాడు. ఆ తర్వాత జానకి అఖిల్ తో మాట్లాడి వెళ్లి నిజం నిరూపించాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు నిమజ్జనానికి ఏర్పాట్లు అన్నీ అవుతూ ఉంటాయి.
 

48

ఊరంతా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటారు. జ్ఞానాంబ పూజలో ఉంటుంది. మల్లికా మాత్రం జానకి, అఖిల్, రామాలు ఎక్కడ ఇంట్లో కనిపించలేదు అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అత్తయ్య గారికి చెబుదామా అంటే మళ్ళీ పూజకి భంగం కలిపిస్తున్నాను అని నాన్నే తిడతారు మనమే వెళ్లి వెతుక్కుందామని అనుకుని బయట అంతా వెతుకుతూ ఉంటుంది..ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. జానకిరామాలు అందులో నుంచి దిగుతారు. అప్పుడు మల్లికా,వీళ్ళిద్దరూ ఉన్నారు మరి అఖిల్ ఏడి అని అనుకోగా, వెనకాతల నుంచి పూలదండలు మార్చుకొని అఖిల్,జెస్సీ లు దిగుతారు.దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు.మల్లిక కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూస్తూ, నేను చూసేది నిజమేనా వెంటనే వెళ్లి అత్తయ్యకి చెప్పాలి అని చెప్తుంది.అప్పటికే జ్ఞానాంబ కళ్ళు తెరిచి మనసు ఎందుకో కీడు సంకిస్తుంది అని అనుకుంటుంది. 

58

 అప్పుడు మల్లికా జ్ఞానం దగ్గరికి వచ్చి,జానకి మీ మాట వినకుండా  వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది అత్తయ్య గారు, మీరు వెంటనే రండి అని అంటుంది.ఇంతలో జెస్సీ అఖిల్ లను జానకిరాములు ఇంటి ద్వారబంధం వరకు తీసుకువస్తారు. అప్పుడు మల్లిక జ్ఞనాంబ ను తీసుకువచ్చి,చూడండి అత్తయ్య గారు మీ మాటంటే జానకికి అసలు నమ్మకం లేదు వెంటనే మిగిలిన నాలుగు తప్పులు కూడా ఒకేసారి కొట్టేయండి అని అంటుంది. ఇంతలో గోవిందరాజులు చికితను పంపించి వెళ్లి హారతి పళ్లెం తీసుకురమ్మని అంటాడు. అప్పుడు మల్లికా మీరు ఏమైనా మాట్లాడండి అత్తగారు అని అనగా కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటుంది ఙ్ఞానాంబ.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి ఆశ్చర్యపోతారు,మల్లికా అవాక్కైపోతుంది.

68

లోపలికి వచ్చిన తర్వాత మల్లికా జ్ఞానంతో ఇదంతా మీకు ముందే తెలుసా అత్తయ్య గారు అని అడుగుతుంది. ముందు రోజు రాత్రి జానకి అఖిల్ ని చూస్తూ, ఈరోజు ఎలాగైనా అఖిల్ నోట్లో నుంచి నిజం రప్పించాలి అని అనుకుంటుంది. అఖిల్ బయట ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి నిజం చెప్పు అఖిల్ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు తప్పు చేశావు కానీ దాన్ని సరిదిద్దుకొని అవకాశం నీకు దక్కింది. ఇప్పుడు నీ అంతట నువ్వు నిజం చెప్పకపోతే తర్వాత ఎప్పుడైనా నిజం బయటపడినప్పుడు అత్తయ్య గారికి ఒక మచ్చ ఏర్పడుతుంది.
 

78

మంచి పేరు ఉన్న మీ అన్నయ్య గారికి కూడా సమాజంలో గౌరవం దక్కదు. ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటే మించిపోయింది ఏమీ లేదు అని అనగా వద్దు వదిన సారీ ఇంక వదిలేయండి. రేపు మధ్యాహ్నం కల్లా అమ్మ మీకు ఇచ్చిన గడువు అయిపోతుంది కదా దాని తర్వాత ఇంక జెస్సీ ప్రస్తావన రాదు అని అంటాడు. అప్పుడు జానకి, అక్కడ జెస్సి నీ వల్ల కడుపుతో ఉండి ఒక్కతే బాధపడుతూ కుమిలిపోతుంది. ఇలాంటి సమయంలో నువ్వు మాట్లాడిన మాటలు ఇవా!.
 

88

నేను నిన్ను ఎప్పుడూ నా మరిదిలా కాకుండా నా కొడుకులా భావించాను చిన్న చిన్న తప్పులు అని అత్తయ్య గారి ముందు కవర్ చేశాను కానీ ఇది పెద్ద తప్పు అని అనగా అఖిల్, అమ్మకి ఇంక నిజం తెలియదు లే వదినా. రేపు సాయంత్రం వరకు వేచి చూస్తే చాలు ఎలాగా అమ్మకి నామీద నమ్మకం ఉన్నది అని అంటున్నాడు. ఈ విషయం అంతా జ్ఞానాంబ  కిటికీలో నుంచి విని ఆశ్చర్య పోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy Divorce: విడాకుల దిశగా విశ్వంభర నటి ? భర్త మోసం చేశాడా.. డివోర్స్ కి కారణం ఇదే..
Recommended image2
100 కోట్ల ఆస్తులు, పదికి పైగా వ్యాపారాలు, 45 ఏళ్ల వయసులో చేతి నిండా సంపాదిస్తోన్న హీరోయిన్ ఎవరు?
Recommended image3
Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved