MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు

Vijayashanti దెబ్బకు ఉన్న కొంప కూడా పోయింది, నాలుగేళ్లు ఇండస్ట్రీకి దూరం.. కసితో బాక్సాఫీస్ బద్దలు

విజయశాంతితో నిర్మించిన ఓ చిత్రం డిజాస్టర్ కావడం వల్ల ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అని ప్రముఖ నిర్మాత ఒకరు అన్నారు. నాలుగేళ్లు ఇండస్ట్రీలో కనిపించలేదు. తిరిగొచ్చి బాక్సాఫీస్ దద్దరిల్లే విజయం అందుకున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 13 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijayashanti
Image Credit : Asianet News

Vijayashanti

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలల్లో ఎంఎస్ రాజు ఒకరు. నిర్మాతగా మాత్రమే కాకుండా ఆయన దర్శకుడిగా కుడా రాణిస్తున్నారు. ఎంఎస్ రాజు నిర్మాతగా ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను నిర్మించిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయశాంతి క్రేజ్
Image Credit : Asianet News

విజయశాంతి క్రేజ్

తాను నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన సమయంలో బిగినింగ్ లో కొన్ని హిట్స్ పడ్డాయి అని ఎంఎస్ రాజు తెలిపారు. ఆ తర్వాత 1995 లో విజయశాంతి ప్రధాన పాత్రలో స్ట్రీట్ ఫైటర్ అనే చిత్రాన్ని నిర్మించారు. విజయశాంతి లీడ్ రోల్స్ లో నటించే సినిమాలకు ఆ టైంలో సూపర్ క్రేజ్ ఉండేది. కర్తవ్యం తర్వాత వియజయశాంతి స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగింది. ఆ క్రేజ్ ని వాడుకోవాలని ఎంఎస్ రాజు ప్రయత్నించారు. ఆమెతో స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా నిర్మించారు.

35
ఆస్తులు అమ్ముకున్నాం
Image Credit : Asianet News

ఆస్తులు అమ్ముకున్నాం

ఆ చిత్రం గురించి ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. స్ట్రీట్ ఫైటర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో ఉన్న కొంప, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అని అని అన్నారు. స్ట్రీట్ ఫైటర్ సినిమా తర్వాత నాలుగేళ్ళ పాటు ఎం ఎస్ రాజు కనిపించలేదు. దీని గురించి యాంకర్ ప్రశ్నించగా.. అలా అనుకోవడం సరికాదు. ఆ మూవీ తర్వాత నాలుగేళ్ళ పాటు నేను నిర్మించిన సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. అది వాస్తవమే. కానీ స్ట్రీట్ ఫైటర్ ఫ్లాప్ అయ్యాక 8 నెలలకే కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి చిత్రాన్ని ప్రారంభించాం.

45
దేవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్
Image Credit : Facebook

దేవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్

ఆ చిత్రానికి సంబంధించిన కథ డెవెలెప్ చేసే ప్రాసెస్, షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అయ్యాయి. కథని డెవెలెప్ చేసి అద్భుతమైన అవుట్ పుట్ తీసుకువచ్చాం. ఆలస్యం అయినప్పటికీ ఆ చిత్రం రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ అయింది అని ఎం ఎస్ రాజు అన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆ మూవీ అప్పట్లో ఒక సంచలనం.

55
మూడు గంటలు మాట్లాడిన వెంకటేష్
Image Credit : Suresh Productions

మూడు గంటలు మాట్లాడిన వెంకటేష్

దేవి మూవీ రిలీజ్ కంటే ముందు సురేష్ బాబు, రామానాయుడు, వెంకటేష్ ముగ్గురూ ప్రివ్యూ చూశారు. దేవీ మూవీ చూసిన తర్వాత వెంకటేష్ బాబు నాకు కాల్ చేశారు. రేపు చెన్నై నుంచి యుఎస్ వెళుతున్నా. ఎయిర్ పోర్ట్ కి రండి అని పిలిచారు. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఒక హోటల్ లో వెంకటేష్, నేను మీట్ అయ్యాం. ఫ్లైట్ కి టైం ఉండడంతో మూడు గంటల పాటు దేవి మూవీ గురించే మాట్లాడుతూనే ఉన్నారు. చివర్లో వెళుతూ.. కుదిరితే నాకు కూడా ఒక సినిమా చేసిపెట్టండి అని అడిగారు. ఆ విధంగా వెంకటేష్ తో దేవీ పుత్రుడు సినిమా నిర్మించాం. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. క్లైమాక్స్ విషయంలో నేను సంతృప్తిగా లేను అని ఎంఎస్ రాజు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved