- Home
- Entertainment
- Janaki Kalaganaledu: తను ప్రెగ్నెంట్ అని అఖిల్ కి చెప్పేసిన జెస్సి.. జానకిలో మొదలైన అనుమానం?
Janaki Kalaganaledu: తను ప్రెగ్నెంట్ అని అఖిల్ కి చెప్పేసిన జెస్సి.. జానకిలో మొదలైన అనుమానం?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈ రోజు ఎపిసోడ్ లో మల్లిక అందరూ డాన్స్ చేస్తూ ఆనందంగా ఉండగా అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది.ఎలా అయినా తాను కూడా డాన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. అందరూ కలిసి సంతోషంగా డాన్సులు వేస్తుండడంతో అది చూసి జ్ఞానాంబ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు మల్లికా తన అత్తయ్య కళ్ళు కప్పి డాన్స్ చేస్తూ ఉండగా అది చూసిన గోవిందరాజు,జ్ఞానాంబ కు చెప్పడంతో జ్ఞానాంబ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత గోవిందరాజు మల్లిక ను వెనక్కి పంపించి తాను డాన్స్ చేయడానికి వెళతాడు. మరొకవైపు అఖిల్ లవర్ జెస్సి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అఖిల్ గురించి తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది జెస్సీ. మరొకవైపు జ్ఞానాంబ కుటుంబ సభ్యులు సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అది అఖిల్ వీడియో తీస్తుంటాడు. అప్పుడు జెస్సి,అఖిల్ కి ఫోన్ చేయగా ఫోన్ కలవకపోవడంతో వెంటనే అఖిల్ దగ్గరికి వెళ్తాను అని బయలుదేరుతుంది.
ఇక అందరూ ఎంజాయ్ చేస్తుండగా అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు అలసిపోయి పక్కకు వెళ్లడంతో వెంటనే బరిలోకి విష్ణు దిగుతాడు. ఇప్పుడు మల్లికా పక్కనే ఉంది వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత రామచంద్ర బరిలోకి దిగుతాడు. అది చూసి జానకి,జ్ఞానాంబ అది సంతోషపడుతూ ఉంటారు. ఇక చివరిగా అఖిల్ వచ్చి కుండను పగలగొడతాడు. దీంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.
ఇంతలోనే అక్కడికి జెస్సి వస్తుంది. అందరూ సంతోషంగా వేడుకలు చేసుకుంటూ ఉండగా అప్పుడు జెస్సీని, అఖిల్ చూస్తాడు. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోని అయిన తర్వాత వచ్చి నీతో మాట్లాడతాను అని అనగా జెస్సి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు జెస్సి అసలు విషయం చెప్పడంతో అఖిల్ షాక్ అవుతాడు. అప్పుడు జెస్సి అసలు విషయాన్నీ చెప్పి ఎమోషనల్ అవుతూ ఉండడంతో అఖిల్ షాక్ అవుతాడు.
మా అమ్మ వాళ్లు నన్ను గట్టిగా కొట్టి నిలదీసి అడిగారు కానీ నేను నీ పేరు చెప్పలేదు అనడంతో అఖిల్ ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు జెస్సి ఈ విషయం అందరికి తెలియక ముందే మనం వెళ్లి పెళ్లి చేసుకుందాము అని అంటుంది. అప్పుడు అఖిల్ జెస్సి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉండగా అది జానకి చూస్తుంది. అప్పుడు అఖిల్, జెస్సి నీ బతిమిలాడుతూ ఉండగా అది చూసిన జానకి ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే జ్ఞానాంబ పిలుస్తుంది.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారికి భోజనాలు వడ్డీస్తూ ఉంటారు. ఆ తర్వాత మల్లిక గర్భవతి అన్న మాటని అడ్డుపెట్టుకొని జ్ఞానాంబ ముందు నటిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లికా కుర్చీ మీద కూర్చోగా జానకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు కావాలనే మల్లికను అందరి ముందు జానకిని అవమానించే విధంగా మాట్లాడుతుంది. వెంటనే గోవిందరాజులు,మల్లికకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత అఖిల్ జరిగిన విషయాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ ఆలోచిస్తూ కూర కలుపుకోకుండా ఉత్త అన్నం తింటూ ఉంటాడు. ఇప్పుడు జానకి, అఖిల్ కంగారుని గమనించి ఏదో జరిగింది వెంటనే తెలుసుకోవాలి అని అంటుంది అనుకుంటూ ఉంటుంది.